PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/senior-heroine-in-the-election-ring-competition-from-that-partyd1a0be3a-4184-4fec-9527-cd203cc23c1c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/senior-heroine-in-the-election-ring-competition-from-that-partyd1a0be3a-4184-4fec-9527-cd203cc23c1c-415x250-IndiaHerald.jpgఈ సారి అయినా అధికారంలోకి వ‌స్తే త‌మ స‌త్తా చాటుకుంటామ‌ని ఆ పార్టీ అధినేత స్టాలిన్ ఉన్నారు. ఇక ఈ ఎన్నిక‌ల కోసం ఇప్పటి నుంచే పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇదిలా ఉంటే సినీ నటి రాధిక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారనే విషయం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయాన్ని స్వయంగా..ఆమె భర్త ఎస్ఎంకే నేత శరత్ కుమార్ వెల్లడించడం విశేషం. శ‌ర‌త్‌కుమార్ న‌తృత్వంలోని సమత్తువ మక్కల్ కట్చి మహిళా విభాగం ఇన్ ఛార్జీగా రాధిక వ్యవహరిస్తున్నారు. ఈ పార్టీ అధికార అన్నాడీఎంకే కూట‌మిలో ఉంది. తాము ఈ కూట‌మిలో ఉన్నా తాము మాత్రంsenior heroine;kumaar;radhika;sarath kumar;sharath;udhayanidhi stalin;bharatiya janata party;cinema;assembly;tamilnadu;husband;letter;heroine;central government;stalin;sharrath marar1;partyఎన్నిక‌ల బ‌రిలో సీనియ‌ర్ హీరోయిన్ ? ఆ పార్టీ నుంచే పోటీ ?ఎన్నిక‌ల బ‌రిలో సీనియ‌ర్ హీరోయిన్ ? ఆ పార్టీ నుంచే పోటీ ?senior heroine;kumaar;radhika;sarath kumar;sharath;udhayanidhi stalin;bharatiya janata party;cinema;assembly;tamilnadu;husband;letter;heroine;central government;stalin;sharrath marar1;partyWed, 03 Feb 2021 11:58:00 GMTత్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌రిగే రాష్ట్రాల్లో రాజ‌కీయం ఎప్పుడు ఎలా ?  మారుతుందో ?  కూడా తెలియ‌ట్లేదు. తమిళనాడులో రాజకీయ పరిణామాలు హీటెక్కిస్తున్నాయి. అధికారంలో ఉన్న అన్నాడీఎంకే..కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్ప‌టికే వ‌రుస‌గా రెండు సార్లు అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ ఇక్క‌డ ఈ సారి అధికారంలోకి వ‌చ్చి హ్యాట్రిక్ కొట్టేందుకు శ‌త‌విధాలా ప్ర‌య‌త్నాలు చేస్తోంది. అయితే దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత మృతి చెందాక తొలిసారి అక్క‌డ జ‌రుగుతోన్న ఎన్నిక‌లు కావ‌డంతో ఈ సారి అక్క‌డ అన్నాడీఎంకే అధికారంలోకి రావ‌డం అంత వీజీ అయితే కాదు.
ఇక డీఎంకే ప‌దేళ్లుగా అక్క‌డ అధికారంలో లేదు. ఈ క్ర‌మంలోనే ఈ సారి అయినా అధికారంలోకి వ‌స్తే త‌మ స‌త్తా చాటుకుంటామ‌ని ఆ పార్టీ అధినేత స్టాలిన్ ఉన్నారు. ఇక ఈ ఎన్నిక‌ల కోసం ఇప్పటి నుంచే పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇదిలా ఉంటే సినీ నటి రాధిక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారనే విషయం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయాన్ని స్వయంగా..ఆమె భర్త ఎస్ఎంకే నేత శరత్ కుమార్ వెల్లడించడం విశేషం. శ‌ర‌త్‌కుమార్ న‌తృత్వంలోని సమత్తువ మక్కల్ కట్చి మహిళా విభాగం ఇన్ ఛార్జీగా రాధిక వ్యవహరిస్తున్నారు.
పార్టీ అధికార అన్నాడీఎంకే కూట‌మిలో ఉంది. తాము ఈ కూట‌మిలో ఉన్నా తాము మాత్రం ప్ర‌త్యేక గుర్తుపై పోటీ చేస్తామ‌ని చెపుతున్నారు. త‌మిళ‌నాడు లో సినిమా వాళ్ల హ‌డావిడి మామూలుగా లేదు. ప్ర‌త్యేక పార్టీ పెడుతున్న‌ట్టు చెప్పిన సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ చేతులెత్తేసి తాను పార్టీ పెట్ట‌డం లేద‌ని చెప్పారు. ఇక మ‌రో సీనియ‌ర్ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ రాష్ట్రం అంత‌టా ప‌ర్య‌టిస్తున్నారు. ఇక విజ‌య్ కాంత్ పార్టీ ఏమైపోయిందో తెలియ‌దు. ఇక ఖుష్బూ బీజేపీ నుంచి ఎన్నిక‌ల బ‌రిలో ఉంటుందంటున్నారు. ఈ క్ర‌మంలోనే రాధిక రాజ‌కీయం ఎలా ఉంటుందో ?  చూడాలి. 


ఆచార్య ప్రి రిలీజ్ బిజినెస్ అదుర్స్‌... కేక పెట్టిస్తోందిగా ..!

వైసీపీ vs వైసీపీ vs వైసీపీ... త‌ల ప‌ట్టుకుంటోన్న లేడీ ఎమ్మెల్యే ?

30 ఏళ్లుగా మెగాస్టార్ డూప్ గా నటిస్తున్న ప్రేమ్ కుమార్ గురించి ఆసక్తికర విషయాలు మీకోసం..

టీడీపీలో మాజీ మంత్రికి కీల‌క ప‌ద‌వి... బెదిరింపుల‌కు బాబు లొంగారా ?

జ‌గ‌నోరు వ‌చ్చాక విశాఖ స్టీల్‌కు ఇన్ని కోట్ల న‌ష్టాలా... సేల్ పెట్టేసిన కేంద్రం ?

కాపు వేద‌న‌: సీమ‌లో ఈ కులం కాపుల‌ను అడ్డంగా తొక్కేస్తోందా... నోరు మెదిపే వారేరి ?

టీచర్ల వెతలు: కరోనా సాకుతో పొట్టగొడుతున్న ప్రైవేటు స్కూళ్లు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>