PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-vidadala-rajini-dominate-chilakaluripeta-fcbc3dc6-d5c2-48e3-ae5d-0fed1549e47f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-vidadala-rajini-dominate-chilakaluripeta-fcbc3dc6-d5c2-48e3-ae5d-0fed1549e47f-415x250-IndiaHerald.jpgఏపీ రాజకీయాల్లో అతి తక్కువ కాలంలోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న ఎమ్మెల్యేల్లో విడదల రజిని కూడా ఒకరు. ఎన్‌ఆర్‌ఐగా వచ్చిన రజిని టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి, సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు దగ్గర రాజకీయం చూసి, వెంటనే పార్టీ మార్చి, ఆయననే ఓడించి సంచలనం సృష్టించింది. మామూలుగా చిలకలూరిపేటలో టీడీపీకి బలం ఎక్కువ. అందులోనూ ప్రత్తిపాటికి తిరుగులేదు. vidadala rajini;tiru;jagan;andhra pradesh;2019;capital;assembly;cheque;tdp;ycp;march;prathipati pullarao;chilakaluripeta;petta;partyపేటలో రజిని సెట్ చేసేసుకున్నట్లేనా? మళ్ళీ అదే రిపీట్ అవుతుందా?పేటలో రజిని సెట్ చేసేసుకున్నట్లేనా? మళ్ళీ అదే రిపీట్ అవుతుందా?vidadala rajini;tiru;jagan;andhra pradesh;2019;capital;assembly;cheque;tdp;ycp;march;prathipati pullarao;chilakaluripeta;petta;partyWed, 03 Feb 2021 03:00:00 GMTఏపీ రాజకీయాల్లో అతి తక్కువ కాలంలోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న ఎమ్మెల్యేల్లో విడదల రజిని కూడా ఒకరు. ఎన్‌ఆర్‌ఐగా వచ్చిన రజిని టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి, సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు దగ్గర రాజకీయం చూసి, వెంటనే పార్టీ మార్చి, ఆయననే ఓడించి సంచలనం సృష్టించింది. మామూలుగా చిలకలూరిపేటలో టీడీపీకి బలం ఎక్కువ. అందులోనూ ప్రత్తిపాటికి తిరుగులేదు.

పేట నుంచి ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో కూడా ప్రత్తిపాటి విజయం ఖాయమని అనుకున్నారు. కానీ ఊహించని విధంగా రజిని రాజకీయం చేశారు. జగన్ వేవ్‌లో ప్రత్తిపాటికి చెక్ పెట్టేశారు. ఇక ఎమ్మెల్యేగా కూడా రజిని దూసుకెళుతున్నారు. నియోజకవర్గంలో బాగానే పనిచేసుకుంటున్నారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర స్థాయిలో క్రేజ్ పెంచుకున్నారు. ఇంత క్రేజ్ తెచ్చుకున్న రజినికి పంచాయితీ ఎన్నికలు పెద్ద సవాల్‌గా మారినట్లే కనిపిస్తున్నాయి.

పేటలో ప్రత్తిపాటి కూడా స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఎన్నికల్లో ఓడిపోయాక ప్రత్తిపాటి, మరింతగా పేట ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేశారు. అటు రాజధాని అంశం కాస్త ప్లస్ అవుతుంది. పైగా తన హయాంలో నియోజకవర్గంలో బాగానే అభివృద్ధి జరిగింది. ఇప్పుడు పథకాలు తప్పా, మరో కార్యక్రమం కనబడటం లేదు. రజిని ఎక్కువగా పని కంటే ప్రచారాలకే ప్రాధాన్యత ఇస్తుందనే విమర్శలు కూడా ఉన్నాయి.

ఈ నేపథ్యంలో పంచాయితీ ఎన్నికల్లో పేటలో వైసీపీ క్లీన్‌స్వీప్ చేయడం కష్టమని అర్ధమైపోతుంది. నియోజకవర్గంలో ఎడ్లపాడు, చిలకలూరిపేట, నాదెండ్ల మండలాలు ఉన్నాయి. ఈ మూడు మండలాల్లో టీడీపీ బలంగానే ఉంది. వైసీపీకి గట్టి పోటీ ఇచ్చేలా ఉంది. అయితే అధికారంలో ఉండటం వైసీపీకి అడ్వాంటేజ్. అధికార బలంతో పేటలో రజిని పైచేయి సాధించే అవకాశాలున్నాయి. ఒకవేళ పేటలో టీడీపీ సగం పంచాయితీలు గెలిస్తే రజిని పవర్ తగ్గినట్లే. మరి చూడాలి అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా పంచాయితీల్లో కూడా రజిని సత్తా చాటుతారో లేదో.




రవితేజాతో బాలయ్యకు గొడవలేంటి...?

టీచర్ల వెతలు : ప్రైవేట్ టీచర్లకు కూడా ప్రభుత్వం ప్రతినెలా తనవంతు జీతాలు ఇవ్వాలి...

బ్రాహ్మణ ఘోష: వీరి బాధ జగన్ కు అర్ధం కాదా...?

బ్రాహ్మణ ఘోష: ప్రభుత్వం బ్రాహ్మణులకు కూడా రిజర్వేషన్ లు ప్రవేశ పెట్టాలి...

ఇటు బాలయ్యతో...అటు చిరంజీవితో...ఎవరా లక్కీ డైరెక్టర్ ...?

బ్రాహ్మణ ఘోష: జగనోరూ ఇకనైనా కళ్ళు తెరవండి..మమ్మల్ని ఆదుకోండి...?

ఆచార్య లో మరో స్టార్ హీరో.. ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>