PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/real-politicianf9448142-a5b3-4b46-b91c-3718e5817336-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/real-politicianf9448142-a5b3-4b46-b91c-3718e5817336-415x250-IndiaHerald.jpgతన ఊరిలో 1987 లో జరిగిన పంచాయితీ ఎన్నికలలో సర్పంచ్ గా పోటీచేసి గెలిచారు. సర్పంచ్ గా తన ఊరిని అనుకున్నట్లే ఎంతో అభివృద్ధి చేశారు. చివరికి స్థానికంగా జరిగిన స్వార్ధ పూరిత రాజకీయాలను భరించలేక తన పదవికి రాజీనామా చేశారు. real politician;andhra pradesh;రాజీనామా;district;school;collector;local language;march;lie;pettaసొంతూరి కోసం సర్పంచ్ గా మారిన కలెక్టర్.. ఎక్కడో తెలుసా...?సొంతూరి కోసం సర్పంచ్ గా మారిన కలెక్టర్.. ఎక్కడో తెలుసా...?real politician;andhra pradesh;రాజీనామా;district;school;collector;local language;march;lie;pettaWed, 03 Feb 2021 15:00:00 GMTఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నాయుడుపేట. ఇతను 1982 సంవత్సరంలో కలెక్టర్ బాధ్యతల నుండి పదవీ విరమణ పొందారు. ఈయన తన పదవీ కాలంలో నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాలకు కలెక్టర్ గా తన సేవలను అందించారు. ఒక వేళ మునిరత్నం కనుక స్వార్ధంగా అలోచించి ఉంటే తన అధికారాన్ని ఉపయోగించి ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఏదో ఒక విధంగా ఎమ్మెల్యేనో లేదా ఎంపీనో అయి ఉండవచ్చు. కానీ మునిరత్నం అలా ఆలోచించలేదు తాను పుట్టిన ఊరికోసం ఏదైనా చేయాలనుకున్నాడు.  

తన ఊరిలో 1987 లో జరిగిన పంచాయితీ ఎన్నికలలో సర్పంచ్ గా పోటీచేసి గెలిచారు. సర్పంచ్ గా తన ఊరిని అనుకున్నట్లే ఎంతో అభివృద్ధి చేశారు. చివరికి స్థానికంగా జరిగిన స్వార్ధ పూరిత రాజకీయాలను భరించలేక తన పదవికి రాజీనామా చేశారు. అయితే తాను సర్పంచ్ గా ఉన్నంత కాలం సిన్సియర్ గా పనిచేశారు. ఈయన పదవీ కాలంలో నాయుడుపేట రూపు రేఖల్నే మార్చి వేశాడు. ఇతను కలెక్టర్ గా ఉన్నప్పుడు తనకున్న పరిచయాలతో నాయుడుపేటకు సమృద్ధిగా నిధులను తీసుకొచ్చారు. కానీ ప్రభుత్వం గురించి తెలిసిందేగా కొన్ని సమయాలలో నిధులు అనుకున్న సమయానికి రావు, మరికొన్ని సార్లు అసలు నిధులే రావు. అయినా తాను వెనుతిరిగి చూడలేదు, తన దగ్గరున్న డబ్బుతోనే గ్రామానికి అవసరమయిన అన్ని పనులను చేశారు.  

అక్కడ ఉన్న పేదలకు ఇళ్ళు కట్టించాలని ఒక గొప్ప ఆశయంతో తనే ఎటువంటి ప్రభుత్వ సహాకారం లేకుండా 20 ఎకరాలు స్థలాన్ని కొనుగోలు చేసి, అక్కడ నివసించే బీడీ కార్మికులకు గృహాలను నిర్మించారు. అంతే కాదు అక్కడే రాష్ట్రంలోని మొట్టమొదటి సిమెంట్ రోడ్డును నిర్మించి రికార్డుల్లోకెక్కారు మునిరత్నం. అంతే కాకుండా నాయుడుపేటలో ఉన్న గర్ల్స్ హై స్కూల్, మునిసిపల్ ఆఫీస్, ఎన్ జె ఆర్  షాపింగ్ కాంప్లెక్స్ ఆయన కాలంలో నిర్మించినవే. మునిరత్నం నాయుడుపేటను అభివృద్ధికి మారుపేరుగా నిలిపి, పనిచేసిన కాలానికి గాను ఒక్కరూపాయి కూడా జీతంగా తీసుకోకపోవడం అభినందనీయం. ఈయన హయాంలోనే ప్రభుత్వం వారు నాయుడుపేటకు ఉత్తమ గ్రామ పంచాయతీగా అవార్డు రావడం ఇప్పటికీ మరచిపోలేము.

మునిరత్నం ముక్కుసూటి తనం మరియు నిజాయితీ అంటే ఇష్టం లేని కొందరు ఆయనపై ఆధారాల్లేని ఆరోపణలు విమర్శలు చేయడంతో, విసిగి పోయి తనే స్వచ్చంధంగా రాజకీయాలకు ముగింపు పలికారు. ఎటువంటి స్వార్ధం లేకుండా పనిచేసే నాయకులకు ఎక్కడైనా రాజకీయపరంగా ఇబ్బందులు తప్పవు. తరువాత నాయుడుపేట నగర పంచాయతీగా మరియు మున్సిపాలిటీగా మారినా, ప్రజలంతా ఈయన అభివృద్ధి గురించే మాట్లాడుతుంటారు. మునిరత్నం లాగా యువత కూడా ముందుకు వచ్చి పంచాయితీల అభివృద్ధిలో భాగం కావాలని ప్రజాసంఘాలు కోరుకుంటున్నాయి.


జాన్వీ లవ్ పై ఆసక్తికర విషయం..!

జగడ్డ : బాబోరికి పెరిగిపోతున్న గెలుపు ధీమా...రీజన్ అదే ....?

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణ‌ల విష‌యంలో బాబుకు మాత్రం బాధ్య‌త లేదా ?

రజనీ రాననలేదట.. మళ్లీ మెలికేనా..!

జగడ్డ: నిమ్మగడ్డ నిమ్మాడ ఎందుకు వెళ్లలేదో తెలుసా...కారణం వింటే షాక్...?

కాపు వేద‌న‌: జ‌గ‌న్ ఇలాకాలో 35 వేల ఓట్లున్న కాపులకు ఇంత అన్యాయ‌మా ?

జగడ్డ: జగన్ పై కోపంతో పంచాయతీ ఎన్నికల్ని లైట్ తీసుకున్న వైసీపీ ఎమ్మెల్యే




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>