PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections4e90f693-4e92-4f3f-a9eb-d7c88efae1bb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections4e90f693-4e92-4f3f-a9eb-d7c88efae1bb-415x250-IndiaHerald.jpgఎలాగైనా ఏకగ్రీవాలు చేసుకోవాలి.. ఇదీ వైసీపీ లక్ష్యం.. ఇందుకోసం సామదానబేధ దండోపాయాలు ప్రయోగిస్తోంది. కుదిరితే బు‌జ్జగింపు.. లేదంటే బెదిరింపు..అదీ కాదంటే బలప్రయోగం.. ఇలా సాగుతోంది వైసీపీ నేతల ఎన్నికల వ్యవహారం.. వ్యాపారాలు, ఉద్యోగాలు, ఉపాధి హామీ నిధుల మంజారు..ఇలా ఏ అంశాన్నయినా అడ్డుపెట్టుకుని విపక్షాలకు చెందిన నాయకులను బెదిరిస్తున్నారు. టీడీపీ హయాంలో చేసిన ఉపాధి హామీ పనుల బిల్లులు చాలా చోట్ల మంజూరు కాలేదు. ఎన్నకల్లో నామినేషన్ ఉపసంహరించుకుంటే ఆ నిధులు ఇప్పిస్తామని కొన్ని చోట్ల బేరాలు పెడుతున్నారు. jagan-nimmagadda-elections;hari;hari music;scheduled caste;tdp;ycp;partyజగడ్డ: ఏకగ్రీవాల కోసం వైసీపీ బెదిరింపులు.. ఏ రేంజ్‌లో అంటే..?జగడ్డ: ఏకగ్రీవాల కోసం వైసీపీ బెదిరింపులు.. ఏ రేంజ్‌లో అంటే..?jagan-nimmagadda-elections;hari;hari music;scheduled caste;tdp;ycp;partyWed, 03 Feb 2021 10:00:00 GMTవైసీపీ లక్ష్యం.. ఇందుకోసం సామదానబేధ దండోపాయాలు ప్రయోగిస్తోంది. కుదిరితే బు‌జ్జగింపు.. లేదంటే బెదిరింపు..అదీ కాదంటే బలప్రయోగం.. ఇలా సాగుతోంది వైసీపీ నేతల ఎన్నికల వ్యవహారం.. వ్యాపారాలు, ఉద్యోగాలు, ఉపాధి హామీ నిధుల మంజారు..ఇలా ఏ అంశాన్నయినా అడ్డుపెట్టుకుని విపక్షాలకు చెందిన నాయకులను బెదిరిస్తున్నారు. టీడీపీ హయాంలో చేసిన ఉపాధి హామీ పనుల బిల్లులు చాలా చోట్ల మంజూరు కాలేదు. ఎన్నకల్లో నామినేషన్ ఉపసంహరించుకుంటే ఆ నిధులు ఇప్పిస్తామని కొన్ని చోట్ల బేరాలు పెడుతున్నారు.

గ్రామాల్లో ప్రతిపక్ష పార్టీకి చెందినవారు ఉపాధిహామీ, నీరు-చెట్టు కింద చేసిన పనులకు ఇవ్వాల్సిన బిల్లుల్ని వైకాపా అధికారంలోకి వచ్చాక నిలిపివేసింది. గరిష్ఠంగా రూ.2 కోట్ల వరకు బకాయిలు రావలసినవారూ ఉన్నారు. వారిలో బలమైన అభ్యర్థులు అనుకున్నవారిని... తమ పార్టీ మద్దతుతో పోటీచేస్తే బిల్లులు వచ్చేలా చూస్తామని కొన్ని చోట్ల అధికార పార్టీ నాయకులు ప్రలోభ పెడుతున్నారు. మాట వినకపోతే ఆ బిల్లులు రాకుండా చేస్తామని హెచ్చరిస్తున్నారు.

మరికొన్ని సంక్షే పథకాలకు సంబంధించిన బెదిరింపులు ఉంటున్నాయి. ఎస్సీ, ఎస్టీలు, బీసీల పింఛన్లు, రేషన్‌ కార్డులు తీసేస్తామని, ఇళ్ల పట్టాల్ని, గతంలో ఇచ్చిన అసైన్డ్‌ భూముల్ని రద్దు చేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. పోటీ చేసేవారితో పాటు వారి మద్దతుదారులనూ వేధిస్తున్నారు. మాజీ సర్పంచులు మళ్లీ పోటీ చేస్తే.. వారిపై తప్పుడు కేసులు పెడతామని వార్నింగ్ ఇస్తున్నారు. అంతే కాదు.. ఎన్నికల్లో గెలిచినా ఏదో ఒక కారణంతో చెక్‌పవర్‌ రద్దు చేయిస్తామని కూడా కొన్ని చోట్ల  బెదిరిస్తున్నారు.

ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులను  వైసీపీలోకి వస్తే, అతనికి రావలసిన బిల్లులు మంజూరు చేయిస్తామని, సగం.. సగం పంచుకుందామని బేరం పెడుతున్నారు. కొన్ని చోట్ల తమ మాట వినలేదని కిడ్నాప్‌ చేయిస్తున్నారు.  కొన్ని చోట్ల ఉపాధిహామీ పనులు చేసిన టీడీపీ నాయకులకు బిల్లులు ఇప్పిస్తామని ఆశపెడుతున్నారు. జూన్‌లోగా వారి బిల్లులు వస్తాయని ప్రమాణాలు చేస్తున్నారు.




టీచర్ల వెతలు: కరోనా సాకుతో పొట్టగొడుతున్న ప్రైవేటు స్కూళ్లు..?

జ‌న‌సేన‌కు ఏక‌గ్రీవాలు... వామ్మో దీనికే సంబ‌రాలా ?

చినబాబుకు భలే ఛాన్స్...సక్సెస్ అవుతారా ?

దుబాయ్ వెళ్లిన దిల్ రాజు... ఆ సెటిల్మెంట్ కోసమేనా ?

షాకింగ్: చైనాకు దిమ్మతిరిగే ఇండియా వార్త..?

ఏపీకి మరిన్ని ఆర్థిక కష్టాలు రాబోతున్నాయా..?

షాకింగ్‌: టీడీపీ నేత పట్టాభిపై దాడి చేయించింది చంద్రబాబేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>