PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/jagan-nimmagadda-elections01e20e60-7dbd-4621-ad41-a1d26bf07f0e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/jagan-nimmagadda-elections01e20e60-7dbd-4621-ad41-a1d26bf07f0e-415x250-IndiaHerald.jpgనిమ్మగడ్డ రమేష్ కుమార్ పట్టుపట్టారంటే వీడేలా కనిపించడంలేదు. ఎన్నికల నిర్వహణ విషయంలో కోర్టు కేసుల్లోనే ఆయన మొండితనం అర్థమైంది. హైకోర్టు అంటే హైకోర్టు, సుప్రీంకోర్టు అంటే సుప్రీంకోర్టు.. ఇలా జరిగింది వ్యవహారం. ఆఖరికి గవర్నర్ వద్ద కూడా పంచాయితీ పెట్టి మరీ అధికారులపై ఫిర్యాదు చేశారు నిమ్మగడ్డ. ఇక ఈ వ్యవహారంలో మరో అంకం ఆన్ లైన్ నామినేషన్లు. తొలి దశలో ఆన్ లైన్ నామినేషన్లు ఎందుకు తీసుకోలేదంటూ ఇద్దరు అధికారులకు తలంటారు ఎస్ఈసీ. రెండో దశలో అయినా కచ్చితంగా ఆన్ లైన్ లో నామినేషన్లు తీసుకునే ఏర్పాటు చేయాలని ఆjagan-nimmagadda-elections;amala akkineni;kumaar;krishna;raj;shankar;panchayati;governor;qualificationజగడ్డ: నిమ్మగడ్డకోసం కొత్త చట్టం చేయాల్సిందేనా..?జగడ్డ: నిమ్మగడ్డకోసం కొత్త చట్టం చేయాల్సిందేనా..?jagan-nimmagadda-elections;amala akkineni;kumaar;krishna;raj;shankar;panchayati;governor;qualificationTue, 02 Feb 2021 07:00:00 GMTకుమార్ పట్టుపట్టారంటే వీడేలా కనిపించడంలేదు. ఎన్నికల నిర్వహణ విషయంలో కోర్టు కేసుల్లోనే ఆయన మొండితనం అర్థమైంది. హైకోర్టు అంటే హైకోర్టు, సుప్రీంకోర్టు అంటే సుప్రీంకోర్టు.. ఇలా జరిగింది వ్యవహారం. ఆఖరికి గవర్నర్ వద్ద కూడా పంచాయితీ పెట్టి మరీ అధికారులపై ఫిర్యాదు చేశారు నిమ్మగడ్డ. ఇక ఈ వ్యవహారంలో మరో అంకం ఆన్ లైన్ నామినేషన్లు. తొలి దశలో ఆన్ లైన్ నామినేషన్లు ఎందుకు తీసుకోలేదంటూ ఇద్దరు అధికారులకు తలంటారు ఎస్ఈసీ. రెండో దశలో అయినా కచ్చితంగా ఆన్ లైన్ లో నామినేషన్లు తీసుకునే ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చారు.

ఆన్ లైన్ అయ్యేపనేనా..?
ఆన్ లైన్ లో చదువుకి, ఉద్యోగానికి అప్లికేషన్లు తీసుకోవచ్చు కానీ, ఎన్నికల నామినేషన్ కాస్త కష్టసాధ్యమైన పనే. అన్ని సర్టిఫికెట్లు అసలా, నకిలీవా అనే పరిశోధించడం, వాటి ప్రకారం అభ్యర్థుల్ని ప్రకటించడం  కష్టసాధ్యం. కాలేజీలో సీటు ఇచ్చి, సర్టిఫికెట్లు నకిలీ అయితే క్యాన్సిల్ చేయొచ్చు, దాని వల్ల కేవలం ఒకరిద్దరికే ఇబ్బంది. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశమిచ్చి, ఆ తర్వాత అతనికి అర్హత లేదని తేలితే.. అది ఆ పంచాయతీ మొత్తంపై ప్రభావం చూపిస్తుంది. అందుకే ఆఫ్ లైన్ లోనే నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే నిమ్మగడ్డ మాత్రం దీన్ని మార్చేయాలనుకుంటున్నారు.


ఆన్ ‌లైన్‌ విధానంతో నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, దౌర్జన్యాలు, అపహరణలు, నామినేషన్‌ పత్రాలు లాక్కోవడం వంటి సంఘటనలను నిరోధించే వీలుంటుందని నిమ్మగడ్డ అభిప్రాయపడ్డారు. మొదటి దశ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ నుంచే ఆన్‌ లైన్‌ విధానాన్ని అమలు చేయాలని ఆదేశించినా, ఎందుకు చేపట్టలేదని పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ ను ఎస్ఈసీ ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికల్లో ఆన్‌లైన్లో నామినేషన్లు తీసుకునే ఏర్పాట్లు చేయకపోవడంపై వివరణ ఇవ్వాలన్న ఆయన.. వారిద్దర్నీ పిలిపించి మరీ మాట్లాడారు. అయితే ఆన్‌లైన్‌ విధానంలో నామినేషన్ల స్వీకరణ కోసం పంచాయతీరాజ్‌ చట్ట సవరణ చేయాల్సి ఉందని, ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో సాధ్యం కాలేదని అధికారులిద్దరూ ఎస్ఈసీకి వివరించారు. కనీసం రెండో దశ ఎన్నికల్లో అయినా ఆన్ ‌లైన్లో నామినేషన్లు స్వీకరించేలా ఏర్పాట్లు చేయాలని కమిషనర్‌ ఆదేశించారట. చట్ట సవరణ చేయాలని ఓవైపు అధికారులు చెబుతున్నా కూడా ఆన్ లైన్ కోసం పట్టుబడుతున్న నిమ్మగడ్డ.. తాను చెప్పినట్టు కొత్త చట్టం తేవాలని పరోక్షంగా చెప్పేశారన్నమాట. 


ఇండియా బడ్జెట్‌ చూసి.. చైనా ఫుల్‌ ఖుషీ ఖుషీ.. ఎందుకంటే..?

జగడ్డ: విజయనగరం జిల్లాను తెగ పొగిడేసిన నిమ్మగడ్డ..? ఎందుకంటే..?

బ్రాహ్మణ ఘోష: పురోహితులు, పూజారులకు పెళ్లి కూతుళ్లు దొరకక పోవటానికి కారణాలివే!

బాలకృష్ణ దృష్టిలో పడిన రామ్ చరణ్ సెంటిమెంట్ !

జగడ్డ: 2 రోజుల్లో యాప్ తీసుకొస్తా.. నిమ్మగడ్డ పరోక్ష హెచ్చరిక..

హెరాల్డ్ సెటైర్ : తండ్రి పేరు చెప్పి కొడుకుతో భలే రాజకీయం చేస్తున్నారే ?

నాని రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>