Politicsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/polio-drops8d377159-4606-4fe4-9fc6-f93a9bdedd84-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/polio-drops8d377159-4606-4fe4-9fc6-f93a9bdedd84-415x250-IndiaHerald.jpgవైద్య సిబ్బంది నిర్లక్ష్యానికి 12 మంది చిన్నారులు మూల్యం చెల్లించుకున్నారు. పోలియో చుక్కలు వేయడానికి వెళ్లిన సిబ్బంది నిర్వాకం ఆ చిన్నారులను ప్రాణాలతో పోరాడేలా చేసింది. ఈ ఘటన మహారాష్ట్రలోని యవత్మాల్‌లో చోటు చేసుకుంది. స్థానిక ఘాటాంజీ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రంలో పోలియో చుక్కలు వేస్తున్న సిబ్బంది పోలియో డ్రాప్స్ బదులు శానిటైజర్..polio drops;health;krishna;mumbai;district;village;local language;central government;polioపోలియో చుక్కలకు బదులు శానిటైజర్... చిన్నారుల పరిస్థితి ఏంటంటే..పోలియో చుక్కలకు బదులు శానిటైజర్... చిన్నారుల పరిస్థితి ఏంటంటే..polio drops;health;krishna;mumbai;district;village;local language;central government;polioTue, 02 Feb 2021 10:14:03 GMTముంబై: వైద్య సిబ్బంది నిర్లక్ష్యానికి 12 మంది చిన్నారులు మూల్యం చెల్లించుకున్నారు. పోలియో చుక్కలు వేయడానికి వెళ్లిన సిబ్బంది నిర్వాకం ఆ చిన్నారులను ప్రాణాలతో పోరాడేలా చేసింది. ఈ ఘటన మహారాష్ట్రలోని యవత్మాల్‌లో చోటు చేసుకుంది. స్థానిక ఘాటాంజీ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రంలో పోలియో చుక్కలు వేస్తున్న సిబ్బంది పోలియో డ్రాప్స్ బదులు శానిటైజర్ వేయడంతో ఏకంగా 12 మంది చిన్నారులు ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటన ప్రస్తుతం కలకలం సృష్టిస్తోంది. దీంతో వారు అనారోగ్యం పాలవడంతో ఆసుపత్రికి తరలించారు.

యవత్మాల్ జిల్లా పరిషద్ పరిధిలోని ఘటాంజి తెహ్సిల్ గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో అక్కడి ఆరోగ్య కార్యకర్తలు చిన్నారులకు పోలియో డ్రాప్స్‌ వేసే కార్యక్రమం చేపట్టారు. వరుసగా చిన్నారులకు డ్రాప్స్ వేయడం ప్రారంభించారు. అయితే కొద్ది సేపటికి డ్రాప్స్ వేయించుకున్న చిన్నారుల్లో కొంతమంది అనారోగ్యం పాలవడం, వాంతులు చేసుకున్నారు. తమ చిన్నారులను ఇలాంటి పరిస్థితుల్లో చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. పరిస్థితిని వెంటనే అక్కడి సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారికి అసలు విషయం బోధపడింది. తాము పోలియో డ్రాప్స్ బదులు శానిటైజర్ తాగించామని గుర్తించారు. వెంటనే ఆ చిన్నారులను సమీప ఆసుపత్రికి తరలించారు.

ఈ ఉదంతంపై జిల్లా పరిషద్ చీఫ్ ఎగ్జక్యూటివ్ ఆఫీసర్ కృష్ణ పాంచల్ మాట్లాడుతూ, స్థానిక బంబోరా ఆరోగ్య కేంద్రం పరిధిలోని కప్సి సబ్ సెంటర్‌లో ఈ ఘటన జరిగిందని, ఆ కేంద్రంలో ముగ్గురు సిబ్బంది ఉన్నారని తెలిపారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఆశా వర్కర్, అంగన్వాడీ సేవికలు ఉన్నారని చెప్పారు. వారు ఆ చిన్నారులకు పోలియో డ్రాప్స్ బదులు శానిటైజర్ వేశారు. ప్రతి చిన్నారికీ రెండు చుక్కలు చొప్పున శానిటైజర్ తాగించారని, అయితే చిన్నారులు అనారోగ్యం పాలు కావడంతో వారిని యావత్మల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని తెలిపారు. ఘటనకు కారకులైన వారిలో ఒక ఆశా కార్యకర్తను సస్పెండ్ చేశామని, ప్రస్తుతం దర్యాప్తు చేపట్టినట్లు కృష్ణ పాంచాల్ వెల్లడించారు.





మళ్ళీ జబర్దస్త్ లోకి నాగబాబు... నాగబాబు షాకింగ్ డెసిషన్..?

జ‌గ‌న్ టార్గెట్ చేసినా డోన్ట్‌కేర్ అంటోన్న ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ?

కాపు వేద‌న‌: జ‌గ‌న్‌కు ఈ కాపు నేత‌లు అక్క‌ర్లేదా... కాపు ఓట్లు అక్క‌ర్లేదా ?

జగడ్డ : నిమ్మగడ్డ జైల్ కి... గత అనుభవాలు ఏమి చెబుతున్నాయి ?

ఏపీకి బడ్జెట్‌ షాక్‌ : సీఎం జగన్‌కు అధికారులు ఏం చెప్పారంటే.. ?

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్ చైర్మ‌న్‌కే ఇన్ని బాధ‌లా ?

పాపం మోహ‌న్‌బాబు... జ‌గ‌న్‌ను న‌మ్ముకుని ఇలా మిగిలిపోయాడా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>