PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/union-budget-202190247598-ad6e-43ff-9f14-4fe78d41fde1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/union-budget-202190247598-ad6e-43ff-9f14-4fe78d41fde1-415x250-IndiaHerald.jpgగత ఏడాది కాలం నుండి కరోనాతో దేశ ఆర్థిక రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. అంతే కాకుండా కరోనా ధాటికి ముఖ్యంగా దేశ ఆరోగ్య రంగం అతలాకుతలం అయ్యింది. ఈ మహమ్మారి ప్రభావం ఆరోగ్యరంగం పైనే ఎక్కువగా పడింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం 2021-22 గాను ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ లో ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. కరోనా సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే ఆరోగ్య సంరక్షణే మార్గమని కేంద్రం భావించింది. దీంతో బడ్జెట్ లో ఎప్పుడు లేని విధంగా ఈ సారి ఏకంగా137 శాతం నిధులను పెంచుతున్నట్లు ప్రకటించిunion budget 2021;amala akkineni;poorna;prime minister;2020;letter;central governmentబడ్జెట్ 2021 : కేంద్రం ఆ కొత్త పథకం పై ఎందుకంత ఫోకస్ ..బడ్జెట్ 2021 : కేంద్రం ఆ కొత్త పథకం పై ఎందుకంత ఫోకస్ ..union budget 2021;amala akkineni;poorna;prime minister;2020;letter;central governmentTue, 02 Feb 2021 10:04:57 GMTగత ఏడాది కాలం నుండి కరోనాతో దేశ ఆర్థిక రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. అంతే కాకుండా కరోనా ధాటికి ముఖ్యంగా దేశ ఆరోగ్య రంగం అతలాకుతలం అయ్యింది. ఈ మహమ్మారి ప్రభావం ఆరోగ్యరంగం పైనే ఎక్కువగా పడింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం 2021-22 గాను ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ లో ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. కరోనా సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే ఆరోగ్య సంరక్షణే మార్గమని కేంద్రం భావించింది. దీంతో బడ్జెట్ లో ఎప్పుడు లేని విధంగా ఈ సారి ఏకంగా137 శాతం నిధులను పెంచుతున్నట్లు ప్రకటించింది. దీన్నిబట్టి కేంద్రం ఆరోగ్యరంగం పై ఏ స్థాయిలో దృష్టి పెట్టిందో అర్థమవుతుంది.

 ముఖ్యంగా కరోనా నిర్మూలనకు టీకాలు ఇవ్వడం ఒక్కటే మార్గమని భావించిన కేంద్రం, కేవలం వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికే 35 వేల కోట్లు కేటాయించింది. ప్రజల సంపూర్ణ ఆరోగ్యం కోసం నివారణ, చికిత్స, సంరక్షణే లక్ష్యాలుగా అడుగులు వేసింది కేంద్ర ప్రభుత్వం. ఇందుకోసం ఆరోగ్య రంగంలోకి మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే అమలులో ఉన్న జాతీయ ఆరోగ్య మిషన్‌ కాకుండా మరో కొత్త ఆరోగ్య పథకాన్ని ఈ బడ్జెట్‌లో ప్రకటించింది. "ప్రధానమంత్రి ఆత్మనిర్భర్‌ స్వాస్థ్య భారత్‌ యోజన" పేరిట వస్తున్న ఈ పథకం కోసం ఈ బడ్జెట్ లో   64 వేల కోట్లు కేటాయించింది.

2020–21 సంవత్సరంలో ఆరోగ్య రంగంలో బడ్జెట్‌ అంచనాలు రూ.94,452 కోట్లు కాగా, 2021–22లో రూ.2 లక్షల 23 వేల 846 కోట్లు బడ్జెట్‌ లో కేటాయింపులు జరిగినట్లు అంచనా. బడ్జెట్‌లో కొత్తగా ప్రవేశ పెట్టిన  "ప్రధానమంత్రి ఆత్మనిర్భర్‌ స్వాస్థ్య భారత్‌ యోజన పథకం" ద్వారా   ముఖ్యంగా ప్రాథమిక, మాధ్యమిక, ప్రాంతీయ ఆరోగ్యాన్ని మెరుగు పరచడం పైన కేంద్రం దృష్టి పెట్టనుంది. ఈ పథకం కోసం కేటాయించిన రూ. 64,180 కోట్లును వచ్చే ఆరేళ్లలో ఈ మొత్తాన్ని ఖర్చు చెయ్యనుంది కేంద్రం. జాతీయ ఆరోగ్య మిషన్‌తో పాటు ఈ కొత్త ఆరోగ్య పథకం అమలవుతుంది.


భర్త స్నేహితుడితోనే అక్రమ సంబంధం పెట్టుకున్న హీరోయిన్..?

జ‌గ‌న్ టార్గెట్ చేసినా డోన్ట్‌కేర్ అంటోన్న ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ?

కాపు వేద‌న‌: జ‌గ‌న్‌కు ఈ కాపు నేత‌లు అక్క‌ర్లేదా... కాపు ఓట్లు అక్క‌ర్లేదా ?

జగడ్డ : నిమ్మగడ్డ జైల్ కి... గత అనుభవాలు ఏమి చెబుతున్నాయి ?

ఏపీకి బడ్జెట్‌ షాక్‌ : సీఎం జగన్‌కు అధికారులు ఏం చెప్పారంటే.. ?

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్ చైర్మ‌న్‌కే ఇన్ని బాధ‌లా ?

పాపం మోహ‌న్‌బాబు... జ‌గ‌న్‌ను న‌మ్ముకుని ఇలా మిగిలిపోయాడా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>