PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections2d7065a1-e934-40c2-ade6-1ca1770d9f46-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections2d7065a1-e934-40c2-ade6-1ca1770d9f46-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేడి ఊపందుకుంటోంది. ఇప్పట్లో జరగవులే అనుకున్న ఎన్నికలు.. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పట్టుదల కారణంగా అనూహ్యంగా జరుగుతున్నాయి. ఇప్పటికే తొలిదశ పంచాయతీలకు నామినేషన్ల ఘట్టం పూర్తయింది. అయితే ఈ ఎన్నికల సందడి రాష్ట్రమంతటా ఉన్నా.. ఒక్క విజయనగరం జిల్లాలో మాత్రం నిన్నటి వరకూ పంచాయతీ ఎన్నికల వేడి కనిపించం లేదు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల విషయంలో ఈ ఒక్క జిల్లా మాత్రం కాస్త ప్రత్యేకంగా నిలుస్తోంది. తొలిదశ ఎన్నికలకు ఇవాళ్టి నుంచి నామినేషన్లు స్వీకరిస్తుంటే.. ఈ జిల్లాలో మాతjagan-nimmagadda-elections;kumaar;andhra pradesh;district;vijayanagaram;panchayati;vizianagaram;bobbiliజగ‌డ్డ: ఎట్టకేలకు విజయనగరంలో పంచాయతీ సందడి..?జగ‌డ్డ: ఎట్టకేలకు విజయనగరంలో పంచాయతీ సందడి..?jagan-nimmagadda-elections;kumaar;andhra pradesh;district;vijayanagaram;panchayati;vizianagaram;bobbiliTue, 02 Feb 2021 06:00:00 GMTకుమార్ పట్టుదల కారణంగా అనూహ్యంగా జరుగుతున్నాయి. ఇప్పటికే తొలిదశ పంచాయతీలకు నామినేషన్ల ఘట్టం పూర్తయింది. అయితే ఈ ఎన్నికల సందడి రాష్ట్రమంతటా ఉన్నా.. ఒక్క విజయనగరం జిల్లాలో మాత్రం నిన్నటి వరకూ పంచాయతీ ఎన్నికల వేడి కనిపించం లేదు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల విషయంలో ఈ ఒక్క జిల్లా మాత్రం కాస్త ప్రత్యేకంగా నిలుస్తోంది. తొలిదశ ఎన్నికలకు ఇవాళ్టి నుంచి నామినేషన్లు స్వీకరిస్తుంటే.. ఈ జిల్లాలో మాత్రం తొలిదశలో ఎన్నికలే లేవు.


తొలి దశలో ఎన్నికలు జరగని ఏకైక జిల్లా విజయనగరం మాత్రమే.. విజయనగరం మినహా మిగిలిన 12 జిల్లాల్లోనూ తొలి దశ ఎన్నికల సందడి కనిపించింది. ఇప్పుడు ఈ సందడి విజయనగరం జిల్లాకూ పాకింది. విజయనగరం జిల్లాలో రెండో దశలో పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. రెండో దశలో పార్వతీపురం రెవెన్యూ డివిజన్ లో రెండోదఫా పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. మొత్తం 15 మండలాల్లో415 పంచాయతీలు,3908 వార్డుల్లో  రెండో దఫాలో పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి.


అవి ఎక్కడెక్కడంటే.. పార్వతీపురం రెవెన్యూ డివిజన్ లో బాడంగి, బలిజపేట,బొబ్బిలి, గురుగుబిల్లి, గుమ్మ లక్ష్మిపురం, జియ్యమ్మవలస, కొమరాడ,కురుపాం, మక్కువ, పాచిపెంట, పార్వతీపురం, రామభద్రాపురం, సాలూరు,సీతానగరం, తెర్లాం మండలాల్లో రెండో దఫాలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో విజయనగరం జిల్లాలోని ఈ ప్రాంతాల్లో సందడి మొదలైంది. నామినేషన్లు వేసేందుకు గ్రామ నేతలు రెడీ అవుతున్నారు.


అయితే మరి విజయనగరం జిల్లాలో మాత్రమే తొలి విడతలో ఎందుకు పంచాయతీ ఎన్నికలు జరగలేదు.. అందుకూ కారణం ఉంది. విజయనగరం జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ అంతగా ఊపందుకోలేదు. అందుకే ఇక్కడ తొలి దశ కంటే.. మూడో నాలుగో దశలో ఎన్నికలే బెటర్ అని ఎన్నికల సంఘం భావించింది. దీంతో ఇప్పుడు మొత్తం ఏపీ అంతటా పంచాయతీ ఎన్నికల సందడి మొదలైనట్టయింది. 


హెరాల్డ్ ఎడిటోరియల్ : తెలుగు రాష్ట్రాలకు ఇందుకేనా కేంద్రం నిధులు కేటాయించనిది ? .. నేతలకు షాక్

జగడ్డ: వైసీపీ పై బ్రహ్మాస్త్రం బయటకు తీస్తున్న నిమ్మగడ్డ..?

బిగ్ బాస్ ఉత్సవం.. ఈటివి ఛాన్స్ ఇవ్వని స్టార్ మా..!

కాంగ్రెస్‌ గర్జన: తెలంగాణ బీజేపీ ఎంపీలు గాడిదలు కాస్తున్నారా..?

ఊహించని కాంబో.. టాలెంటెడ్ లేడీ డైరక్టర్ తో మహేష్..?

బడ్జెట్ 2021: రాష్ట్రానికి కేంద్రం మొండిచెయ్యి చూపింది - ఎంపీ విజయసాయిరెడ్డి

బడ్జెట్ 2021-22: జల జీవన్ మిషన్ విశేషాలేంటో...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>