PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_analysis/tdp-ysrcp48be1631-9ed0-43a7-8695-74727b1a2140-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_analysis/tdp-ysrcp48be1631-9ed0-43a7-8695-74727b1a2140-415x250-IndiaHerald.jpg ఒక‌రిద్ద‌రు నాయ‌కులు త‌ప్పా ఎవ్వ‌రూ బ‌య‌ట‌కు రాలేదు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు టీడీపీలో ఉండి ప‌నులు చేయించుకున్న వీళ్లు ఈ రోజు స్థానిక ఎన్నిక‌ల వేళ వైసీపీ సానుభూతిప‌రులుగా అవ‌తారం ఎత్తి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లు పంచాయ‌తీ స్థానాల‌కు నామినేష‌న్లు వేస్తున్నారు. బ‌ల‌రాం వైసీపీ చెంత చేరాక నిజ‌మైన వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌కు ప‌నులు, కాంట్రాక్టులు ఎక్క‌డా రాలేదు. టీడీపీలో ఉంటూ బ‌ల‌రాంకు స‌పోర్ట్ చేస్తోన్న వారికే చాలా చోట్ల వ‌లంటీర్ పోస్టులు.. స‌చివాల‌యాల కాంట్రాక్టులు ద‌క్కాయి. ఇక్క‌డ వైసీపీ వీరాభిమానులు వెళితే tdp ysrcp;district;village;mla;cheque;letter;tdp;local language;chirala;ycp;amanchi krishna mohan;reddy;v;partyచీరాల‌లో వింత రాజ‌కీయం: క‌్యాండెట్లు టీడీపీ...పోటీ చేసేది వైసీపీ...?చీరాల‌లో వింత రాజ‌కీయం: క‌్యాండెట్లు టీడీపీ...పోటీ చేసేది వైసీపీ...?tdp ysrcp;district;village;mla;cheque;letter;tdp;local language;chirala;ycp;amanchi krishna mohan;reddy;v;partyTue, 02 Feb 2021 11:17:00 GMTజిల్లా చీరాల‌లో వింత రాజ‌కీయం న‌డుస్తోంది. తాజా స‌ర్పంచ్ ఎన్నిక‌ల్లో ఇక్క‌డ అధికార వైసీపీ త‌ర‌పున పోటీ చేసేందుకు నామినేష‌న్ వేసిన అభ్య‌ర్థుల్లో చాలా చోట్ల టీడీపీ వాళ్లే ఉన్నారు. టీడీపీ హార్డ్‌కోర్ అభిమానులు... ఆ పార్టీ గెలుపు కోసం గ‌త ఎన్నిక‌ల్లో ప‌నిచేసిన వారే ఇప్ప‌డు చాలా చోట్ల క‌ర‌ణం బ‌ల‌రాం వ‌ర్గీయులుగా నామినేష‌న్లు వేస్తున్నారు. దీంతో పార్టీ కోసం ద‌శాబ్దాలుగా క‌ష్ట‌ప‌డి... గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి ఆమంచి కృష్ణ‌మోహ‌న్ గెలుపు కోసం ప‌నిచేసిన అస‌లు సిస‌లు అయిన వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌కు తీవ్ర అన్యాయం జ‌రుగుతోంది. ఇంత జ‌రుగుతున్నా దీనిపై జిల్లా వైసీపీ పెద్దలు కాని.. పార్టీ పెద్ద‌లు కాని ప‌ట్టించుకోవ‌డం లేదు. దీంతో ఇక్క‌డ పార్టీని పార్టీ వాళ్లే సర్వ‌నాశ‌నం చేస్తున్నార‌ని స‌గ‌టు వైసీపీ కార్య‌క‌ర్త తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.
క‌ర‌ణం బ‌ల‌రాం వైసీపీ సానుభూతిప‌రుడిగా మారిన‌ప్పుడు టీడీపీ వాళ్ల‌లో ఒక‌రిద్ద‌రు నాయ‌కులు త‌ప్పా ఎవ్వ‌రూ బ‌య‌ట‌కు రాలేదు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు టీడీపీలో ఉండి ప‌నులు చేయించుకున్న వీళ్లు ఈ రోజు స్థానిక ఎన్నిక‌ల వేళ వైసీపీ సానుభూతిప‌రులుగా అవ‌తారం ఎత్తి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లు పంచాయ‌తీ స్థానాల‌కు నామినేష‌న్లు వేస్తున్నారు. బ‌ల‌రాం వైసీపీ చెంత చేరాక నిజ‌మైన వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌కు ప‌నులు, కాంట్రాక్టులు ఎక్క‌డా రాలేదు. టీడీపీలో ఉంటూ బ‌ల‌రాంకు స‌పోర్ట్ చేస్తోన్న వారికే చాలా చోట్ల వ‌లంటీర్ పోస్టులు.. స‌చివాల‌యాల కాంట్రాక్టులు ద‌క్కాయి. ఇక్క‌డ వైసీపీ వీరాభిమానులు వెళితే ప‌నులు చేయ‌రు... అదే టీడీపీ వాళ్లు వెళితే ఠ‌క్కున ప‌నులు అయిపోతుంటాయి.
మ‌రో విచిత్రం ఏంటంటే బ‌ల‌రాం వైసీపీ సానుభూతిప‌రుడు అయిన ఎమ్మెల్యేగా ఉన్నా కూడా అక్క‌డ టీడీపీ వాళ్లు బ‌ల‌రాంకు, ఆయ‌న కుమారుడు వెంక‌టేష్ పుట్టిన రోజుల‌కు ఫ్లెక్సీలు వేస్తుంటారు. ఇందులో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఫ్లెక్సీల‌కు ఎక్క‌డా ప్రాధాన్య‌త ఉండ‌దు.అదే బ‌ల‌రాం, వెంక‌టేష్‌కు సంబంధించిన కార్య‌క్ర‌మాలు జ‌రిగితే మామూలు హ‌డావిడి ఉండ‌దు. ఇటీవ‌ల ఇళ్ల ప‌ట్టాల పంపిణీ కార్య‌క్ర‌మం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ధూం ధాంగా జ‌రిగితే చీరాల‌లో మాత్రం అధికారులు వేసిన ఒక‌టీ అరా టెంట్లు, ప‌దో , ఇర‌వ‌య్యో కుర్చీలు వేసి మ‌మః అనిపించేసి అస‌లు ఈ కార్య‌క్ర‌మం ప‌రువే తీసేశారు.

ఓ వైపు స్థానిక ఎన్నిక‌ల్లో మాజీ ఎమ్మెల్యే, చీరాల వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న ఆమంచి కృష్ణ‌మోహ‌న్ పార్టీని న‌మ్ముకున్న వాళ్ల‌ను పుల పంచాయ‌తీల్లో పోటీ చేయిస్తుండడంతో పాటు వారికి కావాల్సిన అన్ని సహాయ స‌హ‌కారాలు అందిస్తున్నారు. ఇందుకు విరుద్ధంగా టీడీపీలో ఉన్న వాళ్ల‌తో వైసీపీ అభ్య‌ర్థుల‌కు వ్య‌తిరేకింగా నామినేష‌న్లు వేయించి వీరిని గెలిపించాల‌ని బ‌ల‌రాం వ‌ర్గం చెపుతోందంటే... వారు పేరుకు, ప‌నుల‌కు మాత్ర‌మే వైసీపీలో ఉంటున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. ఓవ‌రాల్‌గా చీరాల స్థానిక సంగ్రామంలో మామూలుగా అయితే టీడీపీకి సీన్ లేదు.

కాని ఇక్క‌డ నిజ‌మైన వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌కు, నేత‌ల‌కు ... పైకి వేసీపీ ముసుగు వేసుకున్న ప‌సుపు పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు జ‌రుగుతున్న సంగ్రామంగానే చూడాలి. ఈ పోరులో కొన్ని చోట్ల పార్టీ న‌ష్ట‌పోయే అంతిమంగా టీడీపీకి ల‌బ్ది క‌లిగేలా ఉంది. ఇప్ప‌ట‌కీ అయినా సొంత పార్టీని బ్ర‌ష్టు ప‌ట్టించే ఈ కుళ్లు రాజ‌కీయానికి వైసీపీ అధిష్టానం చెక్ పెట్ట‌క‌పోతే చీరాల‌లో పార్టీ స‌ర్వ‌నాశ‌నం అవ్వ‌క త‌ప్ప‌దు.





ఇక వీళ్లే చెప్పాల్సి ఉంది..

ప్రభుత్వం సై - విద్యార్థులు నై.. తెలంగాణలో విచిత్రం

జగడ్డ: నిమ్మగడ్డపై చర్యలకు ఏర్పాట్లు ముమ్మరం...?

మెగా హీరోకి జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ !

బిగ్ బాస్ 5లో యూట్యూబ్ సెనేషనల్ స్టార్.. అతడు వస్తే టైటిల్ ఫిక్స్..!

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : మ‌ళ్లీ చీక‌ట్లోకి మ‌యాన్మార్.. ప్ర‌జాస్వామ్యాన్ని మింగేసిన‌ సైనికతిరుగుబాటు

జగడ్డ : ఆ ఎన్నికలు ఆపేందుకు వైసీపీ స్కెచ్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>