PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionsaf9f30bb-d213-49b1-952f-f4801cf10c47-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionsaf9f30bb-d213-49b1-952f-f4801cf10c47-415x250-IndiaHerald.jpgఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ విజయనగరం జిల్లా ను సందర్శించారు. అక్కడి ఎన్నికల ఏర్పాట్ల గురించి సమీక్ష నిర్వహించారు. రెండో దశలో ఈ జిల్లాలోని పార్వతీపురం రెవెన్యూ డివిజన్ లో రెండోదఫా పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. మొత్తం 15 మండలాల్లో415 పంచాయతీలు,3908 వార్డుల్లో రెండో దఫాలో పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. పార్వతీపురం రెవెన్యూ డివిజన్ లో బాడంగి, బలిజపేట,బొబ్బిలి, గురుగుబిల్లి, గుమ్మ లక్ష్మిపురం, జియ్యమ్మవలస, కొమరాడ,కురుపాం, మక్కువ, పాచిపెంట, పార్వతీపురం, రామభద్రాపురjagan-nimmagadda-elections;kumaar;district;media;uttarandhra;panchayati;chief commissioner of elections;bobbiliజగడ్డ: విజయనగరం జిల్లాను తెగ పొగిడేసిన నిమ్మగడ్డ..? ఎందుకంటే..?జగడ్డ: విజయనగరం జిల్లాను తెగ పొగిడేసిన నిమ్మగడ్డ..? ఎందుకంటే..?jagan-nimmagadda-elections;kumaar;district;media;uttarandhra;panchayati;chief commissioner of elections;bobbiliTue, 02 Feb 2021 06:13:21 GMTఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌  విజయనగరం జిల్లా ను సందర్శించారు. అక్కడి ఎన్నికల ఏర్పాట్ల గురించి సమీక్ష నిర్వహించారు. రెండో దశలో ఈ జిల్లాలోని పార్వతీపురం రెవెన్యూ డివిజన్ లో రెండోదఫా పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. మొత్తం 15 మండలాల్లో415 పంచాయతీలు,3908 వార్డుల్లో  రెండో దఫాలో పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. పార్వతీపురం రెవెన్యూ డివిజన్ లో బాడంగి, బలిజపేట,బొబ్బిలి, గురుగుబిల్లి, గుమ్మ లక్ష్మిపురం, జియ్యమ్మవలస, కొమరాడ,కురుపాం, మక్కువ, పాచిపెంట, పార్వతీపురం, రామభద్రాపురం, సాలూరు,సీతానగరం, తెర్లాం మండలాల్లో రెండో దఫాలో ఎన్నికలు జరగనున్నాయి.


దీంతో విజయనగరం జిల్లాలోని ఈ ప్రాంతాల్లో సందడి మొదలైంది. నామినేషన్లు వేసేందుకు గ్రామ నేతలు రెడీ అవుతున్నారు. ఈ సందర్భంగా ఈ జిల్లాను సందర్శించిన నిమ్మగడ్డ... ఆ జిల్లాను అమాంతం పొగిడేశారు. విజయనగరం కు విలక్షణ మైన గుర్తింపు ఉందన్నారు. ఇక్కడి ప్రజలు ప్రజాస్వామ్య వ్యవస్థ ను స్వాగతిస్తారని మెచ్చుకున్నారు. 2013లో జిల్లాలో ఏకగ్రీవాలు తక్కువ.. ఓటింగ్ శాతం ఎక్కువగా ఉందని తెగపొగిడేశారు. ఇదే నిజమైన ప్రజాస్వామ్యమంటూ  నిమ్మగడ్డ విజయనగరం జిల్లాను ఆకాశానికెత్తేశారు.  


ఇదే సమయంలో నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. ఎన్నికల సంఘానికీ, రాష్ట్ర ప్రభుత్వానికి జరుగుతున్న పోరును పరోక్షంగా ప్రస్తావించారు. ఎన్నికల కమిషన్‌కు విస్తృత అధికారాలు ఉన్నా ప్రజాస్వామ్యం కోసమే పని చేస్తామన్నారు. ఎలక్షన్ కమీషన్ నిర్ణయాన్ని సుప్రీం కోర్టు కూడా గౌరవించిందని... ప్రజా స్వామ్యంలో ఎన్నికలు  అవసరమని నిమ్మగడ్డ అన్నారు. ఎన్నికలు వద్దు, ఏకగ్రీవాలు ఎక్కువ కావాలనడం సరికాదన్న నిమ్మగడ్డ ఏకగ్రీవాలు అంటే బలవంతంగా  గొంతు నొక్కడమే అంటున్నారు.


అయితే.. సాధారణంగా జరిగే ఏకగ్రీవాలను  ఎలక్షన్ కమీషన్ స్వాగతిస్తుందని.. అసాధారణంగా జరిగే ఏకగ్రీవాలను ఎలక్షన్ కమీషన్  అడ్డుకట్ట వేస్తుందని నిమ్మగడ్డ గుర్తు చేసారు. ఎన్నికల్లో అవకతవకలు  లేకుండా ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని...  ఎన్ని నిఘా వ్యవస్థలు ఉన్నా మీడియా పాత్ర కూడా కీలకమని.. మీడియా కూడా నిజాలను వెలికి తీస్తే వాటిని స్వీకరించే విధానం ఉండాలని నిమ్మగడ్డ అంటున్నారు. 


జగ‌డ్డ: ఎట్టకేలకు విజయనగరంలో పంచాయతీ సందడి..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : జైలు నుండి విడుదల కాగానే మొదలైన శశికళ రాజకీయం

పవన్ సినిమాలో రామ్..త్రివిక్రమ్ సెట్ చేసేనా ..??

హెరాల్డ్ ఎడిటోరియల్ : తెలుగు రాష్ట్రాలకు ఇందుకేనా కేంద్రం నిధులు కేటాయించనిది ? .. నేతలకు షాక్

జగడ్డ: వైసీపీ పై బ్రహ్మాస్త్రం బయటకు తీస్తున్న నిమ్మగడ్డ..?

బిగ్ బాస్ ఉత్సవం.. ఈటివి ఛాన్స్ ఇవ్వని స్టార్ మా..!

కాంగ్రెస్‌ గర్జన: తెలంగాణ బీజేపీ ఎంపీలు గాడిదలు కాస్తున్నారా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>