EditorialVijayaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/sasikala-started-nuisance-politics-againc5418990-ae69-4aba-84ba-2ccb98d7b944-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/sasikala-started-nuisance-politics-againc5418990-ae69-4aba-84ba-2ccb98d7b944-415x250-IndiaHerald.jpgఎప్పుడైతే ఆమె జైలు పాలయ్యారో వెంటనే ఏఐఏడిఎంకే ముఖ్యనేతలంతా కలిసి ఆమెను పార్టీనుండి బహిష్కరిస్తున్నట్లు తీర్మానం చేశారు. ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్ శెల్వంతో పాటు మంత్రులు, ఎంపిలు, ఎంఎల్ఏలు, పార్టీ సీనియర్ నేతలంతా కలిసి తీసుకున్న బహిష్కరణ నిర్ణయమది. ఈ విషయం యావత్ ప్రపంచానికి తెలుసు. ఏఐఏడిఎంకేలో తన ప్రస్తానం ముగిసిందన్న నిర్ణయంతోనే తన మేనల్లుడు దినకరన్ తో అమ్మ మక్కళ్ మున్నేట్ర కజగం(ఏఎంఎంకే) అనే కొత్త పార్టీని పెట్టించారు ఆమె. అయితే ఆ పార్టీని రాష్ట్రంలో దేకేవాడే కరువయ్యారట. ఎటsasikala aiadmk tamilnadu stalin dinakaran modi bj;jayalalitha;jayalalithaa;chief minister;party;mantraహెరాల్డ్ ఎడిటోరియల్ : జైలు నుండి విడుదల కాగానే మొదలైన శశికళ రాజకీయంహెరాల్డ్ ఎడిటోరియల్ : జైలు నుండి విడుదల కాగానే మొదలైన శశికళ రాజకీయంsasikala aiadmk tamilnadu stalin dinakaran modi bj;jayalalitha;jayalalithaa;chief minister;party;mantraTue, 02 Feb 2021 05:00:00 GMT

జైలు నుండి విడుదలైన దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెల్లి, వ్యక్తిగత సహాయకురాలు శశికళ అప్పుడే ఏఐఏడిఎంకేలో కంపు మొదలుపెట్టేశారు. జైలు నుండి విడుదలైన నెచ్చెలి బెంగుళూరుకి శివార్లలో ఉన్న ఓ రిసార్ట్స్ కు చేరుకున్నారు. ఆసుపత్రి నుండి డిస్చార్జి అయిన శశికళ రిసార్ట్స్ కు వెళ్ళిన వాహనానికి ఏఐఏడిఎంకే జెండా ఉండటంతో ఆమె మద్దతుదారులు ఆశ్చర్యపోయారు. దానికితోడు సోమవారం ఉదయం రిసార్ట్స్ లో తన మద్దతుదారులతో ఆమె మాట్లాడుతూ ఏఐఏడిఎంకేకు ఇప్పటికీ తానే ప్రధాన కార్యదర్శిగా ఆమె ప్రకటించుకున్నారు. దీంతో పార్టీలో శశికళ కంపు రాజకీయాలు మొదలుపెట్టినట్లే. ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో శశికళను అరెస్టు చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే.



ఎప్పుడైతే ఆమె జైలు పాలయ్యారో వెంటనే ఏఐఏడిఎంకే ముఖ్యనేతలంతా కలిసి ఆమెను పార్టీనుండి బహిష్కరిస్తున్నట్లు తీర్మానం చేశారు. ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్ శెల్వంతో పాటు మంత్రులు, ఎంపిలు, ఎంఎల్ఏలు, పార్టీ సీనియర్ నేతలంతా కలిసి తీసుకున్న బహిష్కరణ నిర్ణయమది. ఈ విషయం యావత్ ప్రపంచానికి తెలుసు.  ఏఐఏడిఎంకేలో తన ప్రస్తానం ముగిసిందన్న నిర్ణయంతోనే తన  మేనల్లుడు దినకరన్ తో అమ్మ మక్కళ్ మున్నేట్ర కజగం(ఏఎంఎంకే) అనే కొత్త పార్టీని పెట్టించారు ఆమె. అయితే ఆ పార్టీని రాష్ట్రంలో  దేకేవాడే కరువయ్యారట. ఎటూ వచ్చే మే నెలలోగా ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ పరిస్ధితుల్లో తన పార్టీ జనాల్లో ఆదరణ ఉండదన్న విషయం శశికళకు అర్ధమైనట్లుంది.



అందుకనే ఎలాగైనా మళ్ళీ ఏఐఏడిఎంకేను చేజిక్కుంచుకోవాలని కంకణం కట్టుకున్నట్లున్నారు. అందుకనే పార్టీకి తానే జనరల్ సెక్రటరీని అంటూ పంచాయితి మొదలుపెట్టారు. సరే తానే పార్టీకి  ప్రధాన కార్యదర్శి అని ఆమె అనుకుంటే సరిపోతుందా ? ఎలాగూ ఏఐఏడిఎంకే అధికారంలో ఉంది కాబట్టి పార్టీ ఆఫీసు మెట్లను కూడా ఆమెను ఎక్కనివ్వరన్నది వాస్తవం.  ముందుజాగ్రత్తగా జయలిలత నివసించిన ‘వేదనిలయం’ ను ప్రభుత్వం ఓ మ్యూజియంగా మార్చేసింది కాబట్టి అందులోకి కూడా శశికళ ప్రవేశించే అవకాశం లేదు. కాకపోతే ఇపుడు మొదలుపెట్టిన కొత్త పంచాయితి కారణంగా అసలే బలహీనంగా ఉన్న ఏఐఏడిఎంకే మరింత బలహీనపడటం మినహా ఉపయోగం లేదు. అంటే తనకు కాకుండా పోయిన పార్టీని ఇంకెవ్వరికీ కాకుండా చేయాలని శశికళ కంకణం కట్టుకున్నట్లున్నారు. చూద్దాం చివరకు ఏమి జరుగుతుందో.




బిగ్ బాస్ ఉత్సవం.. ఈటివి ఛాన్స్ ఇవ్వని స్టార్ మా..!

కాంగ్రెస్‌ గర్జన: తెలంగాణ బీజేపీ ఎంపీలు గాడిదలు కాస్తున్నారా..?

ఊహించని కాంబో.. టాలెంటెడ్ లేడీ డైరక్టర్ తో మహేష్..?

బడ్జెట్ 2021: రాష్ట్రానికి కేంద్రం మొండిచెయ్యి చూపింది - ఎంపీ విజయసాయిరెడ్డి

బడ్జెట్ 2021-22: జల జీవన్ మిషన్ విశేషాలేంటో...?

బడ్జెట్ ప్రసంగంలో టీమిండియా.. నిర్మలమ్మ నోట మోదీ మాట..

జబర్దస్త్ కు ఆల్టర్నేట్.. కామెడీ స్టార్స్ కుమ్మేస్తుందిగా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>