TVP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/nagababu8702e927-3175-44e1-b667-99cdf91f1568-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/nagababu8702e927-3175-44e1-b667-99cdf91f1568-415x250-IndiaHerald.jpgబుల్లితెర రారాజు గా పది సంవత్సరాలు ఏలిన నాగబాబు ఇప్పుడు చేతిలో షో లు, సీరియల్ లు లేక ఖాళీగా ఉన్నాడు. ఇటీవలే కూతురు నిహారిక పెళ్లి ఎంతో ఘనంగా చేసిన నాగబాబు తన యూట్యూబ్ ఛానల్ నిర్వహణలో ఉన్నాడు కానీ షో లపై ఏమాత్రం కాన్సంట్రేట్ చెయ్యట్లేదు. ఎంతకాదన్నా మిగితా ఇద్దరు బ్రదర్స్ లాగా నాగబాబు వారి రేంజ్ కి చేరుకోలేకపోయారు.. చిరు మెగా స్టార్ అయితే , పవన్ పవర్ స్టార్ అయ్యారు..కానీ నాగబాబు టవర్ స్టార్ గానే మిగిలిపోయారు.. nagababu;pawan;kavitha;kushi;niharika konidela;pawan kalyan;varun;varun sandesh;varun tej;sreemukhi;cinema;jabardasth;marriage;youtube;you tube;comedy;hero;adirindiమళ్ళీ జబర్దస్త్ లోకి నాగబాబు... నాగబాబు షాకింగ్ డెసిషన్..?మళ్ళీ జబర్దస్త్ లోకి నాగబాబు... నాగబాబు షాకింగ్ డెసిషన్..?nagababu;pawan;kavitha;kushi;niharika konidela;pawan kalyan;varun;varun sandesh;varun tej;sreemukhi;cinema;jabardasth;marriage;youtube;you tube;comedy;hero;adirindiTue, 02 Feb 2021 10:17:39 GMTనిహారిక పెళ్లి ఎంతో ఘనంగా చేసిన నాగబాబు తన యూట్యూబ్ ఛానల్ నిర్వహణలో ఉన్నాడు కానీ షో లపై ఏమాత్రం కాన్సంట్రేట్ చెయ్యట్లేదు. ఎంతకాదన్నా మిగితా ఇద్దరు బ్రదర్స్ లాగా నాగబాబు వారి రేంజ్ కి చేరుకోలేకపోయారు.. చిరు మెగా స్టార్ అయితే , పవన్ పవర్ స్టార్ అయ్యారు..కానీ నాగబాబు టవర్ స్టార్ గానే మిగిలిపోయారు..

ఆమధ్య చిత్ర నిర్మాతగా ఓ సినిమా చేసి చేతులు కాల్చుకున్నాడు. దాంతో బుల్లితెర దారి పట్టిన నాగబాబు అక్కడ బాగానే సంపాదించి మళ్ళీ గెట్ ఇన్ అయ్యాడు. కొడుకు వరుణ్ తేజ్ కూడా హీరో కావడంతో ఆయనకున్న ఆర్థిక కష్టాలు తీరిపోయాయి. పదేళ్లుగా జబర్దస్త్ షో కి జడ్జ్ గా చేసి బయటకు వచ్చి అదిరింది అనే షో చేశాడు. కానీ అది మధ్యలోనే ఆగిపోయింది.. నిహారిక పెళ్లి తర్వాత నాగబాబు ఏ షో ఒప్పుకోలేదు.. అందుకే కాబోలు తనలోని కొత్త కళాకారుడిని బయటకు తీసుకొస్తున్నాడు.

ఆయన ఏకంగా పెయింటింగ్ ఆర్టిస్ట్ గా మారిపోయారు. తాను స్వయంగా వేసిన పెయింటింగ్ భావాన్ని కూడా కవిత రూపంలో వివరించాడు. డార్క్ షేడ్ లో ఓ పెయింట్ వేసిన ఆయన ' లోకం చీకటితో నిండిపోయినప్పుడు చీకటి నుండే ఆశాకిరణం ఉదయిస్తుంది. నక్షత్రాలు పూలవలె వికసిస్తాయి. మబ్బులు చెట్ల మాదిరి మారిపోతాయి. మొత్తం ఆకాశం నదిలా ప్రవహించి, బాదితుల దాహం తీరుస్తుంది' అంటూ వివరణ ఇచ్చారు.ఖాళీ సమయం దొరకడంతో నాగబాబు, తనలోని కొత్త కళను బయటకు తీశారనిపిస్తుంది. ఇక కారణం ఏదైనా కానీ అదిరింది, బొమ్మ అదిరింది షోలు ప్రసారం కావడం లేదు.  అయితే నాగబాబు యూట్యూబ్ లో స్టాండప్ కామెడీ షో నిర్వహిస్తున్నారు.ఖుషీ ఖుషీగా పేరుతో మొదలైన ఈ కామెడీ షోలో శ్రీముఖి, గెటప్ శ్రీను వంటివారు కూడా నాగబాబు తో పాటు షోలో కనిపిస్తున్నారు.మరోవైపు నాగబాబు మరలా జబర్ధస్త్ కి వెళతారని ప్రచారం జరుగుతుంది. నిజానికి అది సాధ్యం కాకపోవచ్చు. అప్పట్లో జబర్ధస్త్ నిర్వాహకులపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.




జ‌గ‌న్ టార్గెట్ చేసినా డోన్ట్‌కేర్ అంటోన్న ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ?

కాపు వేద‌న‌: జ‌గ‌న్‌కు ఈ కాపు నేత‌లు అక్క‌ర్లేదా... కాపు ఓట్లు అక్క‌ర్లేదా ?

జగడ్డ : నిమ్మగడ్డ జైల్ కి... గత అనుభవాలు ఏమి చెబుతున్నాయి ?

ఏపీకి బడ్జెట్‌ షాక్‌ : సీఎం జగన్‌కు అధికారులు ఏం చెప్పారంటే.. ?

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్ చైర్మ‌న్‌కే ఇన్ని బాధ‌లా ?

పాపం మోహ‌న్‌బాబు... జ‌గ‌న్‌ను న‌మ్ముకుని ఇలా మిగిలిపోయాడా ?

జగడ్డ : రెండో విడత నామినేషన్లు షురూ.. ఈసారి బాబోరు పక్కా ప్లాన్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>