MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rrr-child-artist8675c352-32e0-4a28-9ed8-88a0cac68d7e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rrr-child-artist8675c352-32e0-4a28-9ed8-88a0cac68d7e-415x250-IndiaHerald.jpgఆర్ ఆర్ ఆర్ .. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం. బాహుబలి తర్వాత పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుంది. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.rrr child artist;ntr;ram charan teja;ajay;jr ntr;pradeep;ram pothineni;rajamouli;dussehra;india;korcha;alluri sitarama raju;rrr movie;cinema;bahubali;october;vijayadashami;nandamuri taraka rama raoఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున్న చైల్డ్ ఆర్టిస్టు గురించి లీక్ చేసిన యాంకర్ ప్రదీప్ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున్న చైల్డ్ ఆర్టిస్టు గురించి లీక్ చేసిన యాంకర్ ప్రదీప్rrr child artist;ntr;ram charan teja;ajay;jr ntr;pradeep;ram pothineni;rajamouli;dussehra;india;korcha;alluri sitarama raju;rrr movie;cinema;bahubali;october;vijayadashami;nandamuri taraka rama raoTue, 02 Feb 2021 19:32:10 GMTఆర్.ఆర్.ఆర్ .. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం. బాహుబలి తర్వాత పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుంది. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సినిమా విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. మొత్తనికి ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదలకు సిద్ధమవుతుంది.

ట్రిపుల్ ఆర్ మూవీలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు. ఇద్దరూ అల్లూరి సీతారామరాజు, కుమ్రంభీం పాత్రల్లో నటిస్తున్నారు. బాహుబలి సినిమా రేంజ్ కు మించి ఉండాలని రాజమౌళి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాడు. అజయ్ దేవ్ గన్ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. అలియాభట్ ఓ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా గురించి ఎక్కడా లీక్ లీకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే కొన్ని విషయాలు మాత్రం బయటకు వస్తున్నాయి.

ఈ సినిమాలో రామ్ చరణ్ గుర్రాన్ని వాహనంగా ఉపయోగిస్తుంటే.. జూనియర్ ఎన్టీఆర్ బుల్లెట్ ను వాడుతున్నారు. ఆ బుల్లెట్ కూడా పురాతన కాలం లుక్ లో ఉంది. అన్ని పార్ట్స్ బయటకు కనిపిస్తూ ఒకే సీటుతో ఉంది. ఇటీవలె దీనికి సంబంధించిన చిత్రాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు మరో చిత్రం బయటకు వచ్చింది. ట్రిపుల్ ఆర్ చిత్రానికి సంబంధించిన ఓ కుర్రాడి ఫోటో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది.
ఫోటోలో ఓ కుర్రాడు తలకు కండువా కట్టుకుని ఉన్నాడు. పంచెకట్టుకుని కూర్చుని ఉన్న ఫోటో ఒకటి తెగ వైలరవుతోంది. ఆ కుర్రాడి పేరు ధృవన్.. ట్రిపుల్ ఆర్ లో చైల్డ్ ఆర్టిస్టుగా నటిస్తున్నాడు. ఈ ఫోటో కూడా ధృవన్ ఎకౌంట్ నుంచే పోస్ట్ చేశారు. అయితే ఈ ఫోటో చూసిన అభిమానులు ఎవరికి వచ్చినట్టు వారు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఇది రామ్ చరణ్ చిన్ననాటి పాత్ర అనుకుంటుంటే.. మరికొందరు జూనియర్ ఎన్టీఆర్ చిన్ననాటి పాత్ర అని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ కుర్రాడు ఎవరో తెలియాలంటే ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.


నిమ్మగడ్డకు జైలు తప్పదా ? జగన్ సర్కార్ బిగ్ స్కెచ్!

రవితేజాతో బాలయ్యకు గొడవలేంటి...?

టీచర్ల వెతలు : ప్రైవేట్ టీచర్లకు కూడా ప్రభుత్వం ప్రతినెలా తనవంతు జీతాలు ఇవ్వాలి...

బ్రాహ్మణ ఘోష: వీరి బాధ జగన్ కు అర్ధం కాదా...?

బ్రాహ్మణ ఘోష: ప్రభుత్వం బ్రాహ్మణులకు కూడా రిజర్వేషన్ లు ప్రవేశ పెట్టాలి...

ఇటు బాలయ్యతో...అటు చిరంజీవితో...ఎవరా లక్కీ డైరెక్టర్ ...?

బ్రాహ్మణ ఘోష: జగనోరూ ఇకనైనా కళ్ళు తెరవండి..మమ్మల్ని ఆదుకోండి...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>