PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections4d251a63-73a1-4f31-8f4b-67538feb6189-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections4d251a63-73a1-4f31-8f4b-67538feb6189-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికల పోరులో మొదటి ఘట్టం ముగిసింది. మొదటి దశ నామినేషన్ ప్రక్రియ సవ్యంగా ముగిసింది. జనవరి 29 నుంచి 31 వరకు మూడు రోజుల పాటు కొనసాగిన నామినేషన్ ప్రక్రియకు ఊహించినదానికంటే ఎక్కువమంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. jagan-nimmagadda-elections;godavari river;krishna river;andhra pradesh;east;east godavari;west godavari;vishakapatnam;january;panchayati;local languageజగడ్డ: మొదటి విడుత నామినేషన్ లో పోటీకి ఎంతమందో తెలుసా...?జగడ్డ: మొదటి విడుత నామినేషన్ లో పోటీకి ఎంతమందో తెలుసా...?jagan-nimmagadda-elections;godavari river;krishna river;andhra pradesh;east;east godavari;west godavari;vishakapatnam;january;panchayati;local languageTue, 02 Feb 2021 09:04:42 GMTఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికల పోరులో   మొదటి ఘట్టం ముగిసింది. మొదటి దశ నామినేషన్ ప్రక్రియ సవ్యంగా ముగిసింది. జనవరి 29 నుంచి 31 వరకు మూడు రోజుల పాటు కొనసాగిన నామినేషన్ ప్రక్రియకు ఊహించినదానికంటే ఎక్కువమంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. కరోనా నేపద్యంలో కూడా అభ్యర్థులు అధిక సంఖ్యలో నామినేషన్ ప్రక్రియకు హాజరు కావడం విశేషం. తొలి విడతలో ఎన్నికలు జరుగుతున్న 3,251 గ్రామ పంచాయతీలలో సర్పంచ్‌ పదవుల కొరకు 19,491 నామినేషన్లు దాఖలు కాగా, ఆయా గ్రామాల పరిధిలో 32,522 వార్డు పదవులకు గాను 79,799 నామినేషన్లు దాఖలయ్యాయి.
 
ఆదివారం సాయంత్రం 5గంటలకే నామినేషన్ల దాఖలుకు సమయం ముగిసినప్పటికీ..నిర్ణీత సమయంలో కార్యాలయాలకు వచ్చిన వారికి టోకెన్లు ఇచ్చిన అధికారులు అర్ధరాత్రి 12గంటల వరకు నామినేషన్లు స్వీకరించినట్లు సమాచారం. ఇక అసలు ఎన్నికల విషయానికి వస్తే 12 జిల్లాల పరిధిలోని దాదాపు 175 మండలాల్లో 3,251 గ్రామ పంచాయతీలు, 32,522 వార్డులకు ఈ నెల 9న ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక తొలి విడత .... జిల్లాల వారీగా ఎన్నికల నామినేషన్ ల లెక్కలు ఈ విధంగా ఉన్నాయి.. పశ్చిమ గోదావరి జిల్లాలో 239 సర్పంచ్ స్థానాలకు 1,415.., 2552 వార్డులకు 6639 నామినేషన్లు  వచ్చాయి. తూర్పుగోదావరి జిల్లాలో 366 సర్పంచ్ స్థానాలకు 2,135.., 4,100 వార్డులకు 12,293 మంది నామినేషన్లు దాఖలయ్యాయి.

శ్రీకాకుళం జిల్లాలో 321 సర్పంచ్ స్థానాలకు 1,772 నామినేషన్లు దాఖలవగా.., 2,920 వార్డులకు 6,382 నామిన్షన్లు నమోదయ్యాయి.
కృష్ణా జిల్లాలో 234 సర్పంచ్ స్థానాలకు 1,379.., 2,502 వార్డులకు 7,889 నామినేషన్లు, గుంటూరు జిల్లాలోని 337 పంచాయతీలకు 1,745, 3,442 వార్డులకు 8019 నామినేషన్లు వేశారు. విశాఖ జిల్లాలోని 340 సర్పంచ్ స్థానాలకు 2,009.., 3,250 వార్డులకు 9,525 నామినేషన్లు నమోదు అయ్యాయి. ఇకపోతే రెండో విడతలో పంచాయతీ ఎన్నికలు నిర్వహణ ప్రక్రియ 3,335 గ్రామాల్లో నేటి నుండి నామినేషన్ల  దాఖల స్వీకరణ ప్రారంభం కానుంది.


కాపు వేద‌న‌: జ‌గ‌న్‌కు ఈ కాపు నేత‌లు అక్క‌ర్లేదా... కాపు ఓట్లు అక్క‌ర్లేదా ?

పాపం మోహ‌న్‌బాబు... జ‌గ‌న్‌ను న‌మ్ముకుని ఇలా మిగిలిపోయాడా ?

జగడ్డ : రెండో విడత నామినేషన్లు షురూ.. ఈసారి బాబోరు పక్కా ప్లాన్..?

జగడ్డ: విజయనగరం జిల్లాను తెగ పొగిడేసిన నిమ్మగడ్డ..? ఎందుకంటే..?

బ్రాహ్మణ ఘోష: పురోహితులు, పూజారులకు పెళ్లి కూతుళ్లు దొరకక పోవటానికి కారణాలివే!

బాలకృష్ణ దృష్టిలో పడిన రామ్ చరణ్ సెంటిమెంట్ !

జగడ్డ: 2 రోజుల్లో యాప్ తీసుకొస్తా.. నిమ్మగడ్డ పరోక్ష హెచ్చరిక..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>