PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/nimmagadda-gives-clarity-on-local-elections-mobile-app841020cb-6aad-4bcf-89bb-00ad7c96db71-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/nimmagadda-gives-clarity-on-local-elections-mobile-app841020cb-6aad-4bcf-89bb-00ad7c96db71-415x250-IndiaHerald.jpgరాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిఘా యాప్ ని కాదని, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రత్యేకంగా మరో యాప్ తయారు చేయించారని, ఎన్నికల ప్రక్రియలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోబోతున్నారంటూ వైసీపీ అనుకూల మీడియా కొన్నిరోజులు హడావిడి చేసింది. ఎస్ఈసీ సొంత యాప్ వల్ల లేనిపోని వివాదాలు వస్తాయని, టీడీపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకునేందుకే ఈ యాప్ తయారు చేయించారని కూడా నేతలు మండిపడ్డారు. అయితే ఆ తర్వాత యాప్ వ్యవహారం కాస్త సద్దుమణిగింది. ప్రజా వ్యతిరేకత వల్ల దాన్ని తీసుకురాలేకపోయారని కూడా వైసీపీ కౌంటర్ ఇచ్చింjagan-nimmagadda-elections;kumaar;media;news;ycp;partyజగడ్డ: 2 రోజుల్లో యాప్ తీసుకొస్తా.. నిమ్మగడ్డ పరోక్ష హెచ్చరిక..జగడ్డ: 2 రోజుల్లో యాప్ తీసుకొస్తా.. నిమ్మగడ్డ పరోక్ష హెచ్చరిక..jagan-nimmagadda-elections;kumaar;media;news;ycp;partyTue, 02 Feb 2021 08:00:00 GMTకుమార్ ప్రత్యేకంగా మరో యాప్ తయారు చేయించారని, ఎన్నికల ప్రక్రియలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోబోతున్నారంటూ వైసీపీ అనుకూల మీడియా కొన్నిరోజులు హడావిడి చేసింది. ఎస్ఈసీ సొంత యాప్ వల్ల లేనిపోని వివాదాలు వస్తాయని, టీడీపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకునేందుకే ఈ యాప్ తయారు చేయించారని కూడా నేతలు మండిపడ్డారు. అయితే ఆ తర్వాత యాప్ వ్యవహారం కాస్త సద్దుమణిగింది. ప్రజా వ్యతిరేకత వల్ల దాన్ని తీసుకురాలేకపోయారని కూడా వైసీపీ కౌంటర్ ఇచ్చింది.

కట్ చేస్తే యాప్ తో ముప్పతిప్పలు పెడతానంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. మరో రెండు రోజుల్లో యాప్ ని ప్రజలకు అందుబాటులోకి తెస్తామని, ఎక్కడైనా దౌర్జన్యాలు, అక్రమాలు జరిగితే వెంటనే ఆ యాప్ ద్వారా సమాచారం ఇవ్వొచ్చని, వీడియోలు, ఫొటోలు షేర్ చేయొచ్చని స్పష్టం చేశారు. అలా సేకరించిన సమాచారంతో అక్కడి ఎన్నికల భవిష్యత్ పై నిర్ణయం తీసుకుంటామి కూడా భరోసా ఇచ్చారు.

అదే సమయంలో ఏకగ్రీవాలన్నింటికీ తాము వ్యతిరేకం కాదని మరోసారి స్పష్టం చేశారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్. గతంలో కూడా ఏకగ్రీవాలు జరిగాయని గుర్తు చేశారు. ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తే బలహీనవర్గాలు అధికారానికి దూరమవుతాయని, ప్రజావాణిని నొక్కేస్తున్నట్లు భావించాల్సి వస్తుందని అన్నరాయన. అది రాజ్యాంగవిరుద్ధమని కూడా తేల్చి చెప్పారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పర్యటించి అధికారులతో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు నిమ్మగడ్డ. తాము రూపొందించిన ఎన్నికల యాప్‌ మరో 2 రోజుల్లో వస్తుందని స్పష్టం చేశారు.

నిమ్మగడ్డ దూకుడు దేనికి సంకేతం..?
ఓవైపు అధికార పక్ష నేతలు నిమ్మగడ్డపై పదే పదే విరుచుకుపడుతున్నా.. ఆయన మాత్రం నింపాదిగా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. ఆన్ లైన్ నామినేషన్లపై అధికార పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నా.. సాధ్యాసాధ్యాలు పరిశీలించాలంటూ అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇప్పుడు యాప్ విషయంలో కూడా గొడవ జరిగే అవకాశముంది. ప్రభుత్వం తయారు చేసిన నిఘా యాప్ ని కాదని, నిమ్మగడ్డ యాప్ ఏంటని వైసీపీ నేతలు విమర్శలు సంధిస్తున్నారు. ఈ విమర్శలకు ఎలాగూ అలవాటు పడ్డారు కాబట్టి.. ఈ విషయంలో కూడా తన పైచేయి నిరూపించుకునేందుకే ఎస్ఈసీ ముందడుగేస్తున్నట్టు అర్థమవుతోంది. 


ఇండియా బడ్జెట్‌ చూసి.. చైనా ఫుల్‌ ఖుషీ ఖుషీ.. ఎందుకంటే..?

జగడ్డ: విజయనగరం జిల్లాను తెగ పొగిడేసిన నిమ్మగడ్డ..? ఎందుకంటే..?

బ్రాహ్మణ ఘోష: పురోహితులు, పూజారులకు పెళ్లి కూతుళ్లు దొరకక పోవటానికి కారణాలివే!

బాలకృష్ణ దృష్టిలో పడిన రామ్ చరణ్ సెంటిమెంట్ !

హెరాల్డ్ సెటైర్ : తండ్రి పేరు చెప్పి కొడుకుతో భలే రాజకీయం చేస్తున్నారే ?

నాని రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

జగడ్డ : రెండో దశ పంచాయతీ యుద్ధం ప్రారంభం.. ఎక్కడెక్కడో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>