Moviesyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/adipurusha4cead91-a15b-4852-970d-1e1a65d9508e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/adipurusha4cead91-a15b-4852-970d-1e1a65d9508e-415x250-IndiaHerald.jpgయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఆదిపురుష్ షూటింగ్ నేటి(మంగళవారం) నుంచి ప్రారంభమైంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రభాస్‌ కెరీర్‌లోనే ఓ మైలు రాయిగా నిలిచిపోనుందని ఇండస్ట్రీ టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని బాలీవుడ్‌ దర్శకుడు ఓం రవుత్‌ డైరెక్ట్ చేయనున్నాడు. పౌరాణిక గాథ రామాయణం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిస్తున్నట్లు ఓం రవుత్‌ ఇంతకుముందే వెల్లడించారు. మంగళవారం ఈ సినిమా లాంఛనంగా..adipurush;technology;prabhas;saif ali khan;krishnam raju;kriti sanon;nag ashwin;prasanth;prashanth neel;ramu;seetha;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;india;adinarayanareddy;cinema;naga aswin;jil;twitter;kannada;industry;director;letter;prasanth neel;vemuri radhakrishna;prashant kishorఆదిపురుష్ మొదలయ్యింది.. ఇక ఆ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే..ఆదిపురుష్ మొదలయ్యింది.. ఇక ఆ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే..adipurush;technology;prabhas;saif ali khan;krishnam raju;kriti sanon;nag ashwin;prasanth;prashanth neel;ramu;seetha;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;india;adinarayanareddy;cinema;naga aswin;jil;twitter;kannada;industry;director;letter;prasanth neel;vemuri radhakrishna;prashant kishorTue, 02 Feb 2021 13:43:24 GMTఇంటర్నెట్ డెస్క్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఆదిపురుష్ షూటింగ్ నేటి(మంగళవారం) నుంచి ప్రారంభమైంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రభాస్‌ కెరీర్‌లోనే ఓ మైలు రాయిగా నిలిచిపోనుందని ఇండస్ట్రీ టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని బాలీవుడ్‌ దర్శకుడు ఓం రవుత్‌ డైరెక్ట్ చేయనున్నాడు. పౌరాణిక గాథ రామాయణం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిస్తున్నట్లు ఓం రవుత్‌ ఇంతకుముందే వెల్లడించారు. మంగళవారం ఈ సినిమా లాంఛనంగా ముంబైలో ప్రారంభమైంది. ఈ విషయాన్ని దర్శకుడు ఓం రావుత్ అధికారికంగా తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘ఆది పురుష్’ ఆరంభ్’’ అంటూ టైటిల్ లోగోతో ఆయ ట్వీట్ చేశారు. దీంతో ప్రభాస్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఇందులో ప్రభాస్‌ రాముడి పాత్రలో కనిపిస్తాడని, ఓం రవుత్ ఇంతకుముందే వెల్లడించాడు. కాగా రావణుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ కనిపించనున్నాడని, సీత పాత్ర కృతి సనన్ కనిపించనుంది.

ఇటీవలే ‘ఆది పురుష్’ చిత్రం మోషన్‌ క్యాప్చర్‌ టెక్నాలజీ వర్క్‌కు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయంటూ ఓం రవుత్ తన ట్విటర్ ద్వారానే వెల్లడించాడు. టీ సిరీస్‌ బ్యానర్‌ భూషణ్‌ కుమార్‌, కృషన్‌ కుమార్‌లతో పాటు ఓం రవుత్‌, ప్రసాద్‌ సుతార్‌, రాజేష్‌ నాయర్‌ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్ట్ 11న సినిమాను విడుదల చేస్తామని కూడా డైరెక్టర్ ఓం రవుత్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో సినిమా ఏ స్థాయిలో ఉండబోతోందోనని అభిమానులు ఇప్పటినుంచే ఆరాటపడిపోతున్నారు. అంతేకాకుండా  తమ అభిమాన హీరోను రాముడిగా చూడాలనుకునే అభిమానులు కూడా ఈ వార్తతో తెగ ఆనందపడున్నారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్‌ జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరెక్షన్‌లో 'రాధేశ్యామ్‌' సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ ఈ మధ్యనే పూర్తయింది. ఈ చిత్రం అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక దీనితో పాటు కన్నడ సెన్సేషన్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ప్రభాస్ 'సలార్‌' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ ఇటీవలై ప్రారంభమై వేగంగా సాగుతోంది. వీటితో పాటు నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో కూడా ప్రభాస్ మరో సినిమా చేయనున్నాడు.
">





జెర్సీ లేకుండా క్రికెటర్ పరుగు.. వీడియో వైరల్

తెలంగాణ‌లో టీడీపీ షాకింగ్ డెసిష‌న్‌... మ‌ళ్లీ ఎన్టీఆర్...!

10 సార్లు ఫేస్ టు ఫేస్ గా విడుదలైన చిరంజీవి వర్సెస్ నాగార్జున సినిమాలు.. ఇందులో ఎవరిది పై చేయి..!

జగడ్డ: నిమ్మగడ్డపై కొడాలి నాని మౌనానికి కారణం ఏంటి..?

ఆర్ ఆర్ ఆర్ కోసం అదిరిపోయే ప్లాన్ లో రాజమౌళి ?

ఐటమ్ బాంబ్స్ వల్ల బాగా నష్టపోతున్న స్టార్ హీరోయిన్లు..

గుంటూరులో ఆ ఇద్ద‌రు వైసీపీ ఎమ్మెల్యేలే టార్గెట్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>