Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mekuluccaec195-381b-46e0-82f4-34aa0c714bd8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mekuluccaec195-381b-46e0-82f4-34aa0c714bd8-415x250-IndiaHerald.jpgరైతుల ఉద్యమం రోజురోజుకూ మరింత తీవ్ర రూపం దాలుస్తుంది అన్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ రైతులతో పాటు దేశవ్యాప్తంగా రైతు సంఘాలు మొత్తం ఢిల్లీ సరిహద్దుల్లోకి కదిలాయి. రోజుల తరబడి అక్కడే ఢిల్లీ సరిహద్దుల్లో ఇక నిరసనలు ఆందోళనలు చేపడుతున్నాయి. అయితే పలుమార్లు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి రైతు సంఘాలతో చర్చలు జరిపినప్పటికీ ఈ చర్చలు విఫలం అయ్యాయి అన్న విషయం తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లో వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందే అంటూ రైmekulu;vishwa;delhi;police;january;job;central government;punjabరోడ్లపై మేకులు కొడుతున్న అధికారులు.. ఎందుకో తెలుసా..?రోడ్లపై మేకులు కొడుతున్న అధికారులు.. ఎందుకో తెలుసా..?mekulu;vishwa;delhi;police;january;job;central government;punjabTue, 02 Feb 2021 08:30:00 GMTపంజాబ్ రైతులతో పాటు దేశవ్యాప్తంగా రైతు సంఘాలు మొత్తం ఢిల్లీ సరిహద్దుల్లోకి కదిలాయి.  రోజుల తరబడి అక్కడే ఢిల్లీ సరిహద్దుల్లో ఇక నిరసనలు ఆందోళనలు చేపడుతున్నాయి. అయితే పలుమార్లు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి రైతు సంఘాలతో చర్చలు జరిపినప్పటికీ ఈ చర్చలు విఫలం అయ్యాయి అన్న విషయం తెలిసిందే.  ఎట్టి పరిస్థితుల్లో వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందే అంటూ రైతు సంఘాలు కోరుతున్న నేపథ్యంలో వ్యవసాయ చట్టాలను రద్దు చేసే ప్రసక్తి లేదు అంటూ కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.



 ఈ క్రమంలోనే వ్యవసాయ చట్టాలను రద్దు చేసేంతవరకు తాము ఉద్యమాన్ని విరమించేది లేదు అంటూ రైతు సంఘాలు స్పష్టం చేస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే మొన్నటి వరకు ఎంతో ప్రశాంతంగా రైతు సంఘాలు ఉద్యమాన్ని నిర్వహించగా.. ఈ మధ్య కాలంలో మాత్రం రైతులు నిర్వహిస్తున్న ఉద్యమం కాస్త ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తుంది.  జనవరి 26 వ తేదీన గణతంత్ర దినోత్సవం రోజున ఏకంగా ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించిన రైతులు ఎర్రకోట లోకి చొచ్చుకు పోయి ఇక అక్కడ భారత జెండా తొలగించి మరో జెండాను ఎగరవేయడం సంచలనంగా మారిపోయింది.అదే  సమయంలో పోలీసులు రైతుల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోగా ఎంతోమంది పోలీసులకు రైతులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి.



 ఇక రానున్న రోజుల్లో ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు మరోసారి చోటు చేసుకోకుండా ఉండేందుకు ప్రస్తుతం అధికారులు సిద్ధమవుతున్నారు ఢిల్లీ సరిహద్దుల్లోని ఘాజీపూర్, టిక్రి  ప్రాంతాల్లో ఆందోళనలు అడ్డుకునేందుకు పోలీసులు.. విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోని బారికేడ్లు ముళ్లకంచెలు మాత్రమే కాదు..  ఏకంగా రోడ్లపై మేకులు కొట్టి కాంక్రీట్ తో పటిష్టంగా కంచె ఏర్పాటు చేస్తున్నారు. అంతే కాకుండా భారీ గోడలు కూడా నిర్మిస్తున్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా తమ ఉద్యమాన్ని ఎవరూ అడ్డుకోలేరు అంటూ రైతులు స్పష్టం చేస్తున్నారు. కాగా నేటితో రైతులు చేస్తున్న ఉద్యమం 66వ రోజుకు చేరుకుంది.


ఇండియా బడ్జెట్‌ చూసి.. చైనా ఫుల్‌ ఖుషీ ఖుషీ.. ఎందుకంటే..?

జగడ్డ: విజయనగరం జిల్లాను తెగ పొగిడేసిన నిమ్మగడ్డ..? ఎందుకంటే..?

బ్రాహ్మణ ఘోష: పురోహితులు, పూజారులకు పెళ్లి కూతుళ్లు దొరకక పోవటానికి కారణాలివే!

బాలకృష్ణ దృష్టిలో పడిన రామ్ చరణ్ సెంటిమెంట్ !

జగడ్డ: 2 రోజుల్లో యాప్ తీసుకొస్తా.. నిమ్మగడ్డ పరోక్ష హెచ్చరిక..

హెరాల్డ్ సెటైర్ : తండ్రి పేరు చెప్పి కొడుకుతో భలే రాజకీయం చేస్తున్నారే ?

నాని రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>