MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntrdcc48e00-0923-42d3-b4b4-ebf11a5abedc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntrdcc48e00-0923-42d3-b4b4-ebf11a5abedc-415x250-IndiaHerald.jpgసీనియర్ ఎన్టీయార్ తెలుగు సినీ సీమకు రారాజుగా నిలిచారు. ఆయనది మూడున్నర దశాబ్దాల సుదీర్ఘమైన సినీ జీవితం. ఆయన మూడు వందల యాభైకి పైగా సినిమాలు నటించి తన సత్తాను చాటుకున్నారు. అందులో పౌరాణిక, జానపద, చారిత్రాత్మక, సాంఘిక చిత్రాలు కూడా ఉన్నాయి. ntr;ntr;jayasudha;jeevitha rajaseskhar;ramu;district;cinema;vishakapatnam;director;february;driver;heroine;kakinada;araku valley;k raghavendraraoఅరకు అందాలకు ముచ్చట పడిన సీనియర్ ఎన్టీయార్...?అరకు అందాలకు ముచ్చట పడిన సీనియర్ ఎన్టీయార్...?ntr;ntr;jayasudha;jeevitha rajaseskhar;ramu;district;cinema;vishakapatnam;director;february;driver;heroine;kakinada;araku valley;k raghavendraraoTue, 02 Feb 2021 11:00:00 GMTఎన్టీయార్ తెలుగు సినీ సీమకు రారాజుగా నిలిచారు. ఆయనది మూడున్నర దశాబ్దాల సుదీర్ఘమైన సినీ జీవితం. ఆయన మూడు వందల యాభైకి పైగా సినిమాలు నటించి తన సత్తాను చాటుకున్నారు. అందులో పౌరాణిక, జానపద, చారిత్రాత్మక, సాంఘిక చిత్రాలు కూడా ఉన్నాయి.

ఇదిలా ఉంటే ఎన్టీయార్ ఎక్కువగా అవుట్ డోర్ షూటింగులు చేయలేదు. ఆయన సినిమాలు అన్నీ దాదాపుగా స్టూడియోలలోనే జరిగిపోయేవి. ఆయన షూటింగులు ఎక్కువగా ఊటీలో మాత్రమే అవుట్ డోర్లుగా జరిగేవి. ఇదిలా ఉంటే ఎదురీత సినిమా కోసం ఎన్టీయార్ కాకినాడ వచ్చి షూట్ చేశారు.

ఇక ఆయన అడవి రాముడు సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన తరువాత డైరెక్టర్ కె రాఘవేంద్రరావుతో మరో సినిమా చేశారు. అది కేడీ నంబర్ వన్. సూపర్ హిట్ అయింది. దాంతో ఎన్టీయార్ తన సొంత నిర్మాణ సంస్థలో కె రాఘవేంద్రరావుని డైరెక్టర్ గా పెట్టి డ్రైవర్ రాముడు సినిమా తీశారు. ఈ సినిమా 1979 ఫిబ్రవరి 2న తెలుగు నాట రిలీజ్ అయి అన్ని రికార్డులు బద్ధలు కొట్టింది. ఈ సినిమా షూటింగ్ కూడా అవుట్ డోర్ లో జరిగింది. ఈ సినిమా కోసం ఎన్టీయార్ విశాఖ జిల్లా ఏజెన్సీ అరకుకు ఫస్ట్ టైం  వచ్చారు. అరకు అందాలు చూసి అన్న గారు ముచ్చటపడ్డారు.

ఇక అరకులో కొన్ని సాంగ్స్ ఎంటీయార్, చిత్ర హీరోయిన్ జయసుధ మీద తీయడం జరిగింది. ఇదిలా ఉంటే ఎన్టీయార్ ఆ తరువాత బ్రహర్షి విశ్వామిత్ర సినిమా షూటింగ్ కోసం కూడా మరో మారు అరకు రావడం జరిగింది. మొత్తానికి అరకు అందాలకు అన్నగారు తెగ ముచ్చటపడిన నాటి ఘటనను అంతా గుర్తు చేసుకుంటారు. ఇక డ్రైవర్ రాముడు రిలీజ్ అయి ఈ రోజుకు 42 ఏళ్ళు పూర్తి అయ్యాయి. అలాంటి బ్లాక్ బస్టర్స్ మళ్లీ ఈనాటి తరంలో రావడం కష్టమని కూడా చిత్ర ప్రముఖులు చెబుతూంటారు.





ఇక వీళ్లే చెప్పాల్సి ఉంది..

చీరాల‌లో వింత రాజ‌కీయం: క‌్యాండెట్లు టీడీపీ...పోటీ చేసేది వైసీపీ...?

ప్రభుత్వం సై - విద్యార్థులు నై.. తెలంగాణలో విచిత్రం

జగడ్డ: నిమ్మగడ్డపై చర్యలకు ఏర్పాట్లు ముమ్మరం...?

మెగా హీరోకి జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ !

బిగ్ బాస్ 5లో యూట్యూబ్ సెనేషనల్ స్టార్.. అతడు వస్తే టైటిల్ ఫిక్స్..!

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : మ‌ళ్లీ చీక‌ట్లోకి మ‌యాన్మార్.. ప్ర‌జాస్వామ్యాన్ని మింగేసిన‌ సైనికతిరుగుబాటు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>