PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections34153e6a-fc42-4b73-b062-80f520ad1a48-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections34153e6a-fc42-4b73-b062-80f520ad1a48-415x250-IndiaHerald.jpgఏపీ పంచాయతీ ఎన్నికల్లో పదనిసలకు కొదవలేదు. సరిగమలతోనే సమరం చేస్తున్న సీన్ కనిపిస్తోంది. ఇదిలా ఉంటే సుప్రీం కోర్టు తీర్పుతో పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం ఓకే చెప్పినా కూడా అటూ ఇటూ కూడా మాటల యుద్ధం వాడివేడిగా సాగుతోంది. ఈ క్రమంలో ఒక కొత్త యాప్ ని పంచాయతీ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం తయారు చేసింది. jagan-nimmagadda-elections;kumaar;bharatiya janata party;andhra pradesh;telugu;panchayati;court;tdp;ycp;reddy;racchaజగడ్డ : ఎస్ఈసీ వర్సెస్ సర్కార్... మరో కొత్త రచ్చ ?జగడ్డ : ఎస్ఈసీ వర్సెస్ సర్కార్... మరో కొత్త రచ్చ ?jagan-nimmagadda-elections;kumaar;bharatiya janata party;andhra pradesh;telugu;panchayati;court;tdp;ycp;reddy;racchaTue, 02 Feb 2021 16:10:37 GMTఏపీ పంచాయతీ ఎన్నికల్లో పదనిసలకు కొదవలేదు. సరిగమలతోనే సమరం చేస్తున్న  సీన్ కనిపిస్తోంది. ఇదిలా ఉంటే సుప్రీం కోర్టు తీర్పుతో పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం ఓకే చెప్పినా కూడా అటూ ఇటూ కూడా మాటల యుద్ధం వాడివేడిగా సాగుతోంది. ఈ క్రమంలో ఒక కొత్త యాప్ ని పంచాయతీ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం తయారు చేసింది.

ఆ యాప్ విషయంలో ఇప్పటికీ వైసీపీ బీజేపీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. యాప్ విషయం గురించి చెప్పాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి కోరారు. ఇక వైసీపీ నేతలు అయితే టీడీపీ ఆఫీస్ లో యాప్ తయారు అయిందని అంటున్నారు. ఈ యాప్ విషయంలో తాము అంగీకరించమని కూడా స్పష్టం చేస్తున్నారు.

ఇక ఈ యాప్ మీద కోర్టుకు వెళ్లాలని కూడా వైసీపీ సర్కార్ చూస్తున్నట్లుగా చెబుతున్నారు. ఏపీలో ఆన్ లైన్ ద్వారా నామినేషన్లు తీసుకోవాలని తెలుగుదేశం ఇప్పటికే కోరింది. తాజాగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా ఆన్ లైన్ ద్వారా ఎందుకు నామినేషన్లు స్వీకరించరు అంటూ అధికారులను ప్రశ్నించారు. ఈ మొత్తం వ్యవహారంలో  తాను చెప్పినట్లుగా అంతా జరగాలని, అది ఎన్నికల నియమ నిబంధలను అటూ ఎన్నికల సంఘం చెబుతూంటే ప్రభుత్వ అధికారులు ఎటూ చెప్పలేకపోతున్నారు.

ఇక ఎన్నికల్లో ఆన్ లైన్ విధానం ద్వారా నామినేషన్లు స్వీకరించాలన్నది కనుక ఒక విధానంగా ఉండాలంటే దానికి చట్ట సవరణ అవసరం అని కూడా ప్రభుత్వం అంటోంది. మరి ఈ తగవు ఇలా ఉండగానె యాప్ మీద ప్రభుత్వం కోర్టుకు వెళ్తే మాత్రం మరో కొత్త రచ్చకు అవకాశం ఉంటుందని అంతా భావిస్తున్నారు. మరో వైపు చూస్తూంటే తొలి దశ ఎన్నికల్లో పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఏకగ్రీవాలు కూడా చాలా తక్కువగానే జరిగాయి. మరి ప్రశాంతంగా సాగుతున్నా పంచాయతీ ఎన్నికల వేళ ఇపుడు ఆన్ లైన్ నామినేషన్లు అంటూ ఎందుకు పట్టుపట్టడం అన్న చర్చ అయితే ఉంది.







ఆ చిట్కాలు పాటించడం వల్లే నేను ఈ రోజు ఇంత అందంగా వున్నాను : మౌని రాయ్

అయాయ్యో..పుష్ప రిలీజ్ డేట్ తో సుక్కు హ్యాపీగా లేడా.. ఎందుకబ్బా?

ప్రస్తుతం గంగోత్రి సినిమా హీరోయిన్ ఎలా ఉందో చూస్తే కన్నీళ్లు ఆగవు..

బాలయ్య - బోయపాటి సినిమాకి అదిరిపోయేలా ప్రీ రిలీజ్ బిజినెస్

పవన్ కళ్యాణ్ తో మల్టీస్టారర్ ప్లాన్ చేసిన త్రివిక్రమ్..మరో హీరో ఎవరంటే..??

అయ్యయ్యో.. అక్కినేని సామ్ కు అమెజాన్ ప్రైమ్ హ్యాండ్ ఇచ్చిందా?

జగడ్డ : అక్కడ టీడీపీకి అడ్వాంటేజ్....?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>