PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/akhila-priya1ce2210f-04ea-4c6f-a45e-8bbf75920d56-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/akhila-priya1ce2210f-04ea-4c6f-a45e-8bbf75920d56-415x250-IndiaHerald.jpgమాజీ మంత్రి అఖిలప్రియకు బోయినపల్లి కిడ్నాప్‌ కేసులో బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రతి 15 రోజులకు ఒకసారి ఆమె పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంతకం పెట్టాలన్న నిబంధన విధించింది కోర్టు.. ఆ షరతు ప్రకారమే.. అఖిలప్రియ నిన్న బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. సాధారణంగా సంతకం పెట్టి వెళ్లిపోవడం ఐదు, పది నిమిషాల పని.. అందులోనూ ఆమె కాస్త వీఐపీ కాబట్టి అంత సమయం కూడా పట్టదు. కానీ నిన్న ఆమె బోయినపల్లి పీఎస్‌కు ఉదయం పదింపావు సమయంలో వచ్చారు..కానీ ఆమె తిరిగి వెళ్లే సరికిరి 11. 45 సమయం అయ్యింది. ఆమె దాదాakhila-priya;police;bhuma akhila priya;minister;husband;traffic police;reddy;bowenpallyఅఖిలప్రియకు పోలీసుల షాక్.. ఆ గంటన్నర ఏం జరిగింది..?అఖిలప్రియకు పోలీసుల షాక్.. ఆ గంటన్నర ఏం జరిగింది..?akhila-priya;police;bhuma akhila priya;minister;husband;traffic police;reddy;bowenpallyTue, 02 Feb 2021 07:07:07 GMTమంత్రి అఖిలప్రియకు బోయినపల్లి కిడ్నాప్‌ కేసులో బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రతి 15 రోజులకు ఒకసారి ఆమె పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంతకం పెట్టాలన్న నిబంధన విధించింది కోర్టు.. ఆ షరతు ప్రకారమే.. అఖిలప్రియ నిన్న బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. సాధారణంగా సంతకం పెట్టి వెళ్లిపోవడం ఐదు, పది నిమిషాల పని.. అందులోనూ ఆమె కాస్త వీఐపీ కాబట్టి అంత సమయం కూడా పట్టదు.

కానీ నిన్న ఆమె బోయినపల్లి పీఎస్‌కు ఉదయం పదింపావు సమయంలో వచ్చారు..కానీ ఆమె తిరిగి వెళ్లే సరికిరి 11. 45 సమయం అయ్యింది. ఆమె దాదాపు గంటన్నర సేపు బోయిన్‌పల్లి పీఎస్‌లోనే ఉండాల్సి వచ్చింది. కేవలం సంతకం పెట్టించి పంపించడానికి అంత సేపు పట్టదు. మరి గంటన్నర సేపు అఖిలప్రియను ఏం విచారించారన్నది పోలీసులు వెల్లడించలేదు. అఖిల ప్రియ సానుకూలంగా స్పందించారని విచారణకు సహకరించారని మాత్రమే పోలీసులు వెల్లడించారు.

బోయినపల్లి కిడ్నాప్‌ కేసులో అరెస్టయిన అఖిలప్రియ ఇటీవల బెయిల్‌ పై విడుదలైనా.. ఆమె భర్త భార్గవ్‌రామ్‌ ఇప్పటికే పరారీలో ఉన్నారు. ఆయన బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదు. భార్గవ్‌ రామ్‌ బెయిల్ వస్తే  తప్ప అజ్ఞాతం వీడే ఆలోచనలో ఉన్నట్టు కనిపించడంలేదు. ఆయన కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. ఈ కేసులో అఖిల ప్రియ తమ్ముడు జగద్విఖ్యాత్‌ రెడ్డి కూడా  చిక్కులు ఎదుర్కొంటున్నారు.

ప్రస్తుతం అఖిలప్రియ తమ్ముడు జగద్విఖ్యాత్‌ రెడ్డి కూడా పరారీలోనే ఉన్నారు. ఆయన కూడా బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక అఖిల ప్రియ విషయానికి వస్తే.. రాజకీయ కుటుంబం అయి ఉండీ.. మాజీ మంత్రి అయి ఉండీ.. ఆమె జైల్లో గడపాల్సివచ్చింది. సాధారణంగా రాజకీయ నాయకులు జైళ్లకు వెళ్లినా.. వెంటనే బెయిల్ పై బయటకు వస్తుంటారు. ఎందుకంటే.. వాటిలో చాలా వరకూ వైట్ కాలర్ నేరాలుగానే ఉంటాయి. కానీ అఖిల ప్రియ మాత్రం రిమాండ్‌ల ఉండక తప్పలేదు. మొత్తానికి బెయిల్ సంపాదించిన అఖిలప్రియ.. ఇప్పుడు తమ్ముడు, భర్తల బెయిల్‌ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.




సామాన్యులకు భారీ షాక్.. పెరగనున్న వంటగ్యాస్ ధరలు..?

జగడ్డ: విజయనగరం జిల్లాను తెగ పొగిడేసిన నిమ్మగడ్డ..? ఎందుకంటే..?

బ్రాహ్మణ ఘోష: పురోహితులు, పూజారులకు పెళ్లి కూతుళ్లు దొరకక పోవటానికి కారణాలివే!

బాలకృష్ణ దృష్టిలో పడిన రామ్ చరణ్ సెంటిమెంట్ !

జగడ్డ: 2 రోజుల్లో యాప్ తీసుకొస్తా.. నిమ్మగడ్డ పరోక్ష హెచ్చరిక..

హెరాల్డ్ సెటైర్ : తండ్రి పేరు చెప్పి కొడుకుతో భలే రాజకీయం చేస్తున్నారే ?

నాని రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>