PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/madanapalli-padmaja8c7fce1c-a85e-4967-9560-0e870f4b2478-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/madanapalli-padmaja8c7fce1c-a85e-4967-9560-0e870f4b2478-415x250-IndiaHerald.jpgమదనపల్లె సబ్ జైలులో ఉన్న నిందితురాలు పద్మజ తోటి ఖైదీలను వణికిస్తున్నట్లు తెలుస్తోంది. ధ్యానంలోనే గడుపుతున్న పద్మజ.. ‘నేనే శివుడిని. నన్నే లోపల వేస్తారా?’ అంటూ వీరంగమేసిందని చెబుతున్నారు. శివా, శివా అంటూ పెద్దగా కేకలు వేయడంతో మహిళా బ్యారక్‌లోని తోటి ఖైదీలు భయంతో హడలిపోయారట.madanapalli padmaja;shiva;alekhya;arjuna;district;police;lord siva;husband;letter;murder.;madanapalleజైలులో పద్మజ కేకలు! వణికిపోయిన ఖైదీలుజైలులో పద్మజ కేకలు! వణికిపోయిన ఖైదీలుmadanapalli padmaja;shiva;alekhya;arjuna;district;police;lord siva;husband;letter;murder.;madanapalleTue, 02 Feb 2021 09:25:47 GMTజిల్లా మదనపల్లె అక్కా చెల్లెల్ల హత్య కేసులో ట్విస్టులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. పోలీసుల విచారణలో దిమ్మతిరిగే విషయాలు బయటపడుతున్నాయి. అయితే కన్నకుమార్తెలను దారుణంగా హత్య చేసిన కేసులో మదనపల్లె సబ్ జైలులో ఉన్న నిందితురాలు పద్మజ తోటి ఖైదీలను వణికిస్తున్నట్లు తెలుస్తోంది.  ధ్యానంలోనే గడుపుతున్న పద్మజ..  ‘నేనే శివుడిని. నన్నే లోపల వేస్తారా?’ అంటూ వీరంగమేసిందని చెబుతున్నారు.  శివా, శివా అంటూ పెద్దగా కేకలు వేయడంతో మహిళా బ్యారక్‌లోని తోటి ఖైదీలు భయంతో హడలిపోయారట. రాత్రంతా పద్మజ గట్టిగా కేకలు వేయడంతో ఖైదీలు జాగారం చేయాల్సి వచ్చిందంటున్నారు.  ఇదే జైలులోనే  ఉన్న పురుషోత్తమ నాయుడు కుమార్తెలను తలచుకుని కన్నీరుమున్నీరు అవుతున్నట్టు జైలు అధికారులు తెలిపారు.

       కుమార్తెల హత్య కేసులో పద్మజ, పురుషోత్తమ నాయుడు ఇద్దరూ సబ్ జైలులోనే ఉన్నారు. వారి మానసిక పరిస్థితి బాగాలేదని వైద్యులు ఇప్పటికే నిర్ధారించారు. దీంతో వీరిని విశాఖపట్టణం మానసిక వైద్యశాలకు తరలించాలని నిర్ణయించారు. అక్కడికి తరలించేందుకు తమకు ఎస్కార్ట్ కావాలంటూ జైలు అధికారులు పోలీసులకు లేఖ రాశారు. వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో పద్మజ, పురుషోత్తమ నాయుడుల తరలింపు ఆలస్యమవుతోంది.

      ఆధ్యాత్మిక పిచ్చిలో పెద్దకూతురు అలేఖ్య , తల్లి పద్మజలు కిరాతకంగా వ్యవహరించారని తెలుస్తోంది. మూఢ భక్తితో కుమార్తెలను డంబెల్‌తో కొట్టి చంపేసిన తల్లి పద్మజ... ఆ తర్వాత చనిపోయిన పెద్ద కుమార్తె అలేఖ్య నాలుకను కోసి తినేసిందని ఆమె భర్త పురుషోత్తం నాయుడు పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది.తాను పూర్వజన్మలో అర్జునుడినని అలేఖ్య తనతో చెప్పేదని పురుషోత్తం వైద్యులకు చెప్పినట్టు సమాచారం. కలియుగం అంతమై త్వరలోనే సత్యయుగం వస్తుందని, కరోనా ఇందుకు చక్కని ఉదాహరణ అని అలేఖ్య చెప్పేదని, తాను చదివిన ఆధ్యాత్మిక పుస్తకాల్లోనూ ఇలాంటి విషయాలే ఉండడంతో ఆమె మాటలు నమ్మామని పురుషోత్తం చెప్పినట్టు సమాచారం. 


జ‌గ‌న్ టార్గెట్ చేసినా డోన్ట్‌కేర్ అంటోన్న ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ?

కాపు వేద‌న‌: జ‌గ‌న్‌కు ఈ కాపు నేత‌లు అక్క‌ర్లేదా... కాపు ఓట్లు అక్క‌ర్లేదా ?

జగడ్డ : నిమ్మగడ్డ జైల్ కి... గత అనుభవాలు ఏమి చెబుతున్నాయి ?

ఏపీకి బడ్జెట్‌ షాక్‌ : సీఎం జగన్‌కు అధికారులు ఏం చెప్పారంటే.. ?

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్ చైర్మ‌న్‌కే ఇన్ని బాధ‌లా ?

పాపం మోహ‌న్‌బాబు... జ‌గ‌న్‌ను న‌మ్ముకుని ఇలా మిగిలిపోయాడా ?

జగడ్డ : రెండో విడత నామినేషన్లు షురూ.. ఈసారి బాబోరు పక్కా ప్లాన్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>