MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/movies/movies_latestnews/singer-sunitha209a1dde-50d6-4673-8e8d-3ba764aca50e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/movies/movies_latestnews/singer-sunitha209a1dde-50d6-4673-8e8d-3ba764aca50e-415x250-IndiaHerald.jpgప్రముఖ నేపథ్య గాయని సింగర్ సునీత జనవరి 9వ తేదీన హైదరాబాదులో రామ్ వీరపనేని ని పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె తన వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు. పలు పబ్లిక్ ఈవెంట్స్ లలో కూడా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొంటూ తమలోని కొత్త సునీతను చూపిస్తున్నారు.singer sunitha;geetha;prema;ram pothineni;tollywood;cinema;sangeetha;january;television;marriage;love;september;event;chennai;instagram;singer;santoshamఆయన కోసమే ఎమోషనల్ వీడియో పోస్ట్ చేసిన సింగర్ సునీత..ఆయన కోసమే ఎమోషనల్ వీడియో పోస్ట్ చేసిన సింగర్ సునీత..singer sunitha;geetha;prema;ram pothineni;tollywood;cinema;sangeetha;january;television;marriage;love;september;event;chennai;instagram;singer;santoshamTue, 02 Feb 2021 11:19:00 GMTగాయని సింగర్ సునీత జనవరి 9వ తేదీన హైదరాబాదులో రామ్ వీరపనేని ని పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె తన వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు. పలు పబ్లిక్ ఈవెంట్స్ లలో కూడా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొంటూ తమలోని కొత్త సునీతను చూపిస్తున్నారు. పెళ్లి అయినాక కూడా ఆమె తన మ్యూజిక్ కెరీర్ ని వదిలేయలేదు. సినిమాల్లో పాటలు పాడుతూ తన అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. అయితే తాజాగా ఆమె తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో దివంగత సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం కనిపించారు. వీళ్ళిద్దరూ ఒక టీవీ ప్రోగ్రాం లో సీతారామరాజు సినిమాలోని ఏవండోయ్ శ్రీవారు అనే పాటను ఆలపించారు. ఈ ఇద్దరు కలిసి తమ మధురమైన గొంతుకలతో పాడుతున్న పాట చాలా వినసొంపుగా ఉంది.
">

https://www.instagram.com/p/CKvQJ4vBdD3/?utm_source=ig_embed​​​

అయితే తాము పడుతున్న వీడియోని ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన సునీత "బాలు గారు" అని కామెంట్ చేసి ఎస్పీ బాలసుబ్రమణ్యం ని గుర్తు చేసుకున్నారు. నిజానికి వీళ్ళిద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో ఎంతో మధురమైన పాటలు పాడారు. కొన్నేళ్ల తర్వాత బాలసుబ్రహ్మణ్యం సినిమా పాటలు పాడటం మానేసారు. కానీ ప్రముఖ మ్యూజిక్ ప్రోగ్రాం లలో పాత పాటలు పాడుతూ తమ అభిమానులను అలరించారు. అయితే ఆ మ్యూజిక్ ప్రోగ్రాములలో బాలసుబ్రహ్మణ్యం తో కలిసి సునితా ఎన్నో పాటలు పాడారు. అందులోని భాగంగానే ఆమె సీతారామరాజు సినిమా లోని "ఏవండోయ్ శ్రీవారు" అనే పాటను కూడా ఆలపించారు. అయితే బాలసుబ్రమణ్యం తో కలిసి పాడిన జ్ఞాపకాలను స్మరించుకుంటూ సునీత బాధపడుతున్నారు.

ఆయన పేరు పక్కన లవ్, దణ్ణం ఎమోజిలను పోస్ట్ చేసి ఆయన పట్ల తనకున్న ప్రేమ, ఆప్యాయతలను మరియు గౌరవమర్యాదలను వ్యక్తపరిచారు. సెప్టెంబర్ 25 వ తేదీన బాల సుబ్రహ్మణ్యం చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తన తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. అయితే ఆయన అకాల మరణాన్ని యావత్ సంగీత ప్రపంచం జీర్ణించుకోలేక పోయింది. ముఖ్యంగా టాలీవుడ్ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం ఇక లేరు అనే నిజాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఇప్పటికీ ఏదో ఒక సందర్భంలో బాలసుబ్రహ్మణ్యం ని గుర్తు చేసుకొని తీవ్ర భావోద్వేగానికి లోనవుతున్నారు.​​


గుంటూరులో ఆ ఇద్ద‌రు వైసీపీ ఎమ్మెల్యేలే టార్గెట్ ?

చీరాల‌లో వింత రాజ‌కీయం: క‌్యాండెట్లు టీడీపీ...పోటీ చేసేది వైసీపీ...?

ప్రభుత్వం సై - విద్యార్థులు నై.. తెలంగాణలో విచిత్రం

జగడ్డ: నిమ్మగడ్డపై చర్యలకు ఏర్పాట్లు ముమ్మరం...?

మెగా హీరోకి జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ !

బిగ్ బాస్ 5లో యూట్యూబ్ సెనేషనల్ స్టార్.. అతడు వస్తే టైటిల్ ఫిక్స్..!

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : మ‌ళ్లీ చీక‌ట్లోకి మ‌యాన్మార్.. ప్ర‌జాస్వామ్యాన్ని మింగేసిన‌ సైనికతిరుగుబాటు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>