PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_analysis/gold-mining-in-ap-do-you-know-where-it-is28b76f4d-ba74-4489-a3cc-c48d3b9caa15-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_analysis/gold-mining-in-ap-do-you-know-where-it-is28b76f4d-ba74-4489-a3cc-c48d3b9caa15-415x250-IndiaHerald.jpgఅనుమ‌తులు వ‌చ్చినంత మాత్రానా వెంట‌నే బంగారం దొర‌క‌దు. ముందుగా అక్క‌డ ఎంత వ‌ర‌కు త‌వ్వాలి ? బంగారం దొరుకుతుందా ? ఈ బంగారం నాణ్య‌మైన‌దేనా ? త‌వ్వ‌కాల‌కు అయ్యే ఖ‌ర్చుకు... దొరికే బంగారానికి గిట్టుబాటు అవుతుందా ? అన్న లెక్క‌లు వెంట‌నే తేల‌వు. ఇవ‌న్నీ గిట్టుబాటు అవుతాయ‌నుకుంటే నే అప్పుడు ఈ ప్ర‌క్రియ మ‌రింత ముందుకు వెళుతుంది. ఈ ప్రాంతంలో రెండు ద‌శాబ్దాల క్రితం భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ సంస్ద ఇక్కడ తవ్వకాలు చేయ‌గా అప్పుడు బంగారం రేటుకు.. తవ్వ‌కాల‌కు అయ్యే ఖ‌ర్చుతో పొంత‌న లేదు. న‌ష్టాలు రావ‌డంతో gold digging;india;andhra pradesh;karnataka - bengaluru;district;rayalaseema;bihar;karnataka 1;letterఏపీలో బంగారం త‌వ్వ‌కాలు... ఎక్క‌డో తెలుసా ..!ఏపీలో బంగారం త‌వ్వ‌కాలు... ఎక్క‌డో తెలుసా ..!gold digging;india;andhra pradesh;karnataka - bengaluru;district;rayalaseema;bihar;karnataka 1;letterTue, 02 Feb 2021 08:45:00 GMTఆంధ్రప్రదేశ్ బంగారు నిక్షేపాలు దేశంలో పుష్కలంగా లభించే రాష్ట్రాల్లో ఐదో స్థానంలో ఉంది. మ‌న దేశంలో బంగారం ల‌భించే రాష్ట్రాల్లో తొలి నాలుగు స్థానాల్లో వ‌రుస‌గా బీహార్ - రాజస్ధాన్ - కర్నాటక - పశ్చిమబెంగాల్ ఉన్నాయి. ఆ త‌ర్వాత ఐదో స్థానంలో ఏపీ ఉంది. ఇక్క‌డ సీమ ప్రాంతంలో బంగారం త‌వ్వ‌కాలు ఒక‌ప్పుడు ఎక్కువుగా జ‌రిగేవి. అయితే రెండు ద‌శాబ్దాల త‌ర్వాత ఇప్పుడు ఇక్క‌డ బంగారం త‌వ్వ‌కాలు చేప‌ట్టేందుకు జాతీయ ఖనిజాభివృద్ధి సంస్ధ ఎన్ఎండీసీ రెడీ అవుతోంది. సీమ‌లోని చిత్తూరు - అనంత‌పురం జిల్లా ల్లో త‌న ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. చిత్తూరు జిల్లాలోని చిగురుగుంట... అనంతపురం జిల్లాలోని రామగిరిలోనూ తవ్వకాలు ప్రారంభిస్తారు.

అయితే ఈ బంగారం త‌వ్వ‌కాల‌కు అనుమ‌తులు వ‌చ్చినంత మాత్రానా వెంట‌నే బంగారం దొర‌క‌దు. ముందుగా అక్క‌డ ఎంత వ‌ర‌కు త‌వ్వాలి ?  బంగారం దొరుకుతుందా ? ఈ బంగారం నాణ్య‌మైన‌దేనా ?  త‌వ్వ‌కాల‌కు అయ్యే ఖ‌ర్చుకు... దొరికే బంగారానికి గిట్టుబాటు అవుతుందా ? అన్న లెక్క‌లు వెంట‌నే తేల‌వు. ఇవ‌న్నీ గిట్టుబాటు అవుతాయ‌నుకుంటే నే అప్పుడు ఈ ప్ర‌క్రియ మ‌రింత ముందుకు వెళుతుంది. ఈ ప్రాంతంలో రెండు ద‌శాబ్దాల క్రితం భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ సంస్ద ఇక్కడ తవ్వకాలు చేయ‌గా అప్పుడు బంగారం రేటుకు.. తవ్వ‌కాల‌కు అయ్యే ఖ‌ర్చుతో పొంత‌న లేదు. న‌ష్టాలు రావ‌డంతో అప్పుడు గోల్డ్ మైనింగ్ ఆపేశారు.

ఇక అనంతపురం జిల్లా రాఫ్తాడు నియోజ‌క‌వ‌ర్గం లోని రామ‌గిరిలో 100 అడుగుల లోతు ల్లో బంగారం దొర‌క‌వ‌చ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు. ఈ మేర‌కు త‌వ్వ‌కాలు చేప‌డితే టన్నుకు 2 నుంచి 3 గ్రాముల బంగారం లభ్యమవుతుందని ఎన్ ఎండీసీ ప్రాధమికంగా అంచనా వేస్తోంది. అంత లోతులో కొన్ని చోట్ల చాలా ఎక్కువ గాను.. మ‌రి కొన్ని చోట్ల కాస్త త‌క్కువ గా బంగారం దొరికే సూచ‌న‌లు ఉన్నాయంటున్నారు. ఏదేమైనా త్వ‌ర‌లోనే ఏపీలో బంగారం త‌వ్వ‌కాలు అయితే ప్రారంభం కానున్నాయి. మ‌రి ఇవి ఏ స్తాయిలో స‌క్సెస్ అవుతాయో ?  చూడాలి. 


పాపం మోహ‌న్‌బాబు... జ‌గ‌న్‌ను న‌మ్ముకుని ఇలా మిగిలిపోయాడా ?

జగడ్డ : రెండో విడత నామినేషన్లు షురూ.. ఈసారి బాబోరు పక్కా ప్లాన్..?

జగడ్డ: విజయనగరం జిల్లాను తెగ పొగిడేసిన నిమ్మగడ్డ..? ఎందుకంటే..?

బ్రాహ్మణ ఘోష: పురోహితులు, పూజారులకు పెళ్లి కూతుళ్లు దొరకక పోవటానికి కారణాలివే!

బాలకృష్ణ దృష్టిలో పడిన రామ్ చరణ్ సెంటిమెంట్ !

జగడ్డ: 2 రోజుల్లో యాప్ తీసుకొస్తా.. నిమ్మగడ్డ పరోక్ష హెచ్చరిక..

హెరాల్డ్ సెటైర్ : తండ్రి పేరు చెప్పి కొడుకుతో భలే రాజకీయం చేస్తున్నారే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>