PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/is-vijayashanti-saying-goodbye-to-the-congress-par1042908f-8d9e-4a34-b4d6-91883f0f5de8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/is-vijayashanti-saying-goodbye-to-the-congress-par1042908f-8d9e-4a34-b4d6-91883f0f5de8-415x250-IndiaHerald.jpgరాజ్య‌స‌భ సీటు అడిగినా బీజేపీ అధిష్టానం ఖ‌చ్చిత‌మైన హామీ ఇవ్వ‌లేదట‌. పార్టీలో మీ క‌న్నా చాలా మంది సీనియ‌ర్లు ఉన్నార‌ని.. రాజ్య‌స‌భ సీటుపై తాము ఇప్పుడు చెప్ప‌లేమ‌ని అన‌డంతో పాటు వ‌చ్చే ఎన్నిక‌ల్లో మెద‌క్ ఎంపీగా పోటీ చేస్తే అన్ని విధాలా స‌హాయ స‌హ‌కారాలు అందిస్తామ‌ని చెప్పింద‌ట‌. 2009 ఎన్నిక‌ల‌కు ముందే త‌న త‌ల్లి తెలంగాణ పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేసిన విజ‌య‌శాంతి ఆ త‌ర్వాత ఆమె మెద‌క్ నుంచి ఎంపీగా పోటీ చేసి స్వ‌ల్ప తేడాతో గెలిచారు. ఐదేళ్ల పాటు ఆమె టీఆర్ఎస్ ఎంపీగా పేరుకు మాత్ర‌మే ఉన్నా చేసిందేమి vijayashanti;kcr;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;congress;mp;mla;minister;war;letter;joshఆ ఎంపీ సీటుపై క‌న్నేసిన విజ‌య‌శాంతి... బీజేపీ ఫిక్స్ చేసిందా ?ఆ ఎంపీ సీటుపై క‌న్నేసిన విజ‌య‌శాంతి... బీజేపీ ఫిక్స్ చేసిందా ?vijayashanti;kcr;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;congress;mp;mla;minister;war;letter;joshTue, 02 Feb 2021 09:30:00 GMTతెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు హీటెక్కుతున్నాయి. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ వ‌ర్సెస్ బీజేపీ నేతల మ‌ధ్య తీవ్ర‌మైన వార్ న‌డుస్తోంది. ముఖ్యంగా దుబ్బాక ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఆ త‌ర్వాత గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ కు దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చేలా చేసి ఆ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించింది. ఈ ప‌రిణామాల తో బీజేపీలో ఎక్క‌డా లేని జోష్ రాగా... ఆ త‌ర్వాత ప్ర‌ముఖ సినీ న‌టి, మెద‌క్ మాజీ ఎంపీ విజ‌య‌శాంతి సైతం కాషాయ కండువా క‌ప్పుకోవ‌డ‌తో పాటు మాజీ ఎమ్మెల్సీ స్వామిగౌడ్ .. మాజీ మంత్రి ఏ చంద్ర‌శేఖ‌ర్ తో పాటు మ‌రి కొంద‌రు నేత‌లు బీజేపీ చేర‌డంతో తెలంగాణ‌లో బీజేపీ జోరు మామూలుగా లేదు.

ఇదిలా ఉంటే బీజేపీ లో చేరిన‌ప్ప‌టి నుంచే విజ‌య‌శాంతి కేసీఆర్‌ను .. టీఆర్ఎస్ వాళ్ల‌ను ఓ రేంజ్‌లో టార్గెట్ చేస్తూ వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆమె బీజేపీ నుంచి మెద‌క్ లోక్‌స‌భ సీటుపై క‌న్నేశార‌ని తెలుస్తోంది. వాస్త‌వంగా ఆమె పార్టీలో చేరే స‌మ‌యంలో రాజ్య‌స‌భ సీటు అడిగినా బీజేపీ అధిష్టానం ఖ‌చ్చిత‌మైన హామీ ఇవ్వ‌లేదట‌. పార్టీలో మీ క‌న్నా చాలా మంది సీనియ‌ర్లు ఉన్నార‌ని.. రాజ్య‌స‌భ సీటుపై తాము ఇప్పుడు చెప్ప‌లేమ‌ని అన‌డంతో పాటు వ‌చ్చే ఎన్నిక‌ల్లో మెద‌క్ ఎంపీగా పోటీ చేస్తే అన్ని విధాలా స‌హాయ స‌హ‌కారాలు అందిస్తామ‌ని చెప్పింద‌ట‌.

2009 ఎన్నిక‌ల‌కు ముందే త‌న త‌ల్లి తెలంగాణ పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేసిన విజ‌య‌శాంతి ఆ త‌ర్వాత ఆమె మెద‌క్ నుంచి ఎంపీగా పోటీ చేసి స్వ‌ల్ప తేడాతో గెలిచారు. ఐదేళ్ల పాటు ఆమె టీఆర్ఎస్ ఎంపీగా పేరుకు మాత్ర‌మే ఉన్నా చేసిందేమి లేదు. అటు పార్టీతో అంటీ ముట్ట‌న‌ట్టుగా ఉండ‌డంతోనే ఆమెను కేసీఆర్ ప‌ట్టించుకోలేదు. చివ‌ర‌కు 2014 ఎన్నిక‌ల వేళ ఆమెకు సీటు కూడా ఇవ్వ‌లేదు. ఆ త‌ర్వాత కాంగ్రెస్ లోకి వెళ్లి మెద‌క్ ఎమ్మెల్యే గా పోటీ చేసి ఓడిపోయిన ఆమె ఇప్పుడు బీజేపీలోకి వ‌చ్చారు. మ‌రి విజ‌య‌శాంతికి బీజేపీలో ఏ ప‌ద‌వి వ‌స్తుందో ? ఆమె ఆశ ఎలా తీరుతుందో ?  చూడాలి. 


సముద్రం నీటి లోపల పెళ్లితో ఒక్కటయిన జంట.. వైరల్ వీడియో..?

జ‌గ‌న్ టార్గెట్ చేసినా డోన్ట్‌కేర్ అంటోన్న ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ?

కాపు వేద‌న‌: జ‌గ‌న్‌కు ఈ కాపు నేత‌లు అక్క‌ర్లేదా... కాపు ఓట్లు అక్క‌ర్లేదా ?

జగడ్డ : నిమ్మగడ్డ జైల్ కి... గత అనుభవాలు ఏమి చెబుతున్నాయి ?

ఏపీకి బడ్జెట్‌ షాక్‌ : సీఎం జగన్‌కు అధికారులు ఏం చెప్పారంటే.. ?

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్ చైర్మ‌న్‌కే ఇన్ని బాధ‌లా ?

పాపం మోహ‌న్‌బాబు... జ‌గ‌న్‌ను న‌మ్ముకుని ఇలా మిగిలిపోయాడా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>