PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan-tdpe8f23f88-764b-4cf7-a5a0-6f288b1fb7bd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan-tdpe8f23f88-764b-4cf7-a5a0-6f288b1fb7bd-415x250-IndiaHerald.jpgఎన్నో సార్లు దాడులు జ‌గ‌డంతో ఆయ‌న చివ‌ర‌కు పార్టీ మారిపోయారు. కందుకూరు మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావుతో పాటు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వికుమార్ గ్రానైట్ వ్యాపారాల‌పై కంటిన్యూగా దాడులు జ‌రుగుతున్నాయి. అస‌లు గొట్టిపాటి ర‌విని వ‌ద‌ల‌కుండా టార్గెట్ చేస్తున్నారు. పంచాయ‌తీ ఎన్నిక‌ల వేళ ర‌విని ఆర్థికంగా దెబ్బ తీసే ప్లాన్ జ‌రుగుతోంది. ఇక పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు వ్యాపారాలు ఏపీలో ఎప్పుడో ఆగిపోయాయి. అయినా ఆయ‌న బాప‌ట్ల పార్ల‌మెంట‌రీ పార్టీ అధ్య‌క్షుడిగా ఏడు నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీని jagan tdp;mla;minister;cycle;letter;tdp;gottipati ravi kumar;parchoor;addanki;kondapi;partyజ‌గ‌న్ టార్గెట్ చేసినా డోన్ట్‌కేర్ అంటోన్న ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ?జ‌గ‌న్ టార్గెట్ చేసినా డోన్ట్‌కేర్ అంటోన్న ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ?jagan tdp;mla;minister;cycle;letter;tdp;gottipati ravi kumar;parchoor;addanki;kondapi;partyTue, 02 Feb 2021 09:46:00 GMTఏపీలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం టీడీపీకి చెందిన కీల‌క నేత‌ల‌ను టార్గెట్ చేస్తోంద‌న్న ప్ర‌చారం తెలిసిందే. మ‌న‌కు ప్ల‌స్ అయినా కాక‌పోయినా టీడీపీకి ప్ల‌స్ కాకూడ‌ద‌న్న కోణంలోనే ప‌లువురు నేత‌ల‌ను పార్టీలోకి లాగేసుకుంది. ఈ క్ర‌మంలోనే న‌లుగురు ఎమ్మెల్యేలు .. ప‌లువురు కీల‌క నేత‌లు సైకిల్ దిగిపోయారు. అయితే ఆ పార్టీకి ఆర్థికంగా అండ‌గా ఉంటార‌నుకుంటోన్న వాళ్ల‌పై సైతం ఏదోలా ఒత్తిడి చేస్తున్నారు. కొంద‌రిని ప్రలోభాల‌కు గురి చేస్తున్నారు.. మ‌రి కొంద‌రిని సామదానభేద దండోపాయాలతో లొంగ దీసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. మ‌రి కొంద‌రి వ్యాపారాల‌ను టార్గెట్ చేస్తున్నారు. .ఇలా ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా ఒకే జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రం జ‌గ‌న్ కు ఏమాత్రం లొంగ‌డం లేదు. వాళ్లు స‌ర్కార్‌తో ఢీ అంటే ఢీ అనే రేంజ్ లో వ్య‌వ‌హ‌రించ‌డంతో పాటు ఓర్పుతో పోరాడుతూ అక్క‌డ పార్టీని నిల‌బెడుతున్నారు.

ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవ‌రో కాదు ప్ర‌కాశం జిల్లాకు చెందిన  అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు, కొండపి ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి. ఈ ముగ్గురిపై ఎన్ని ఒత్తిళ్లు వ‌చ్చినా వీరు పార్టీని వీడ‌డం లేదు. ఇదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి శిద్ధా రాఘ‌వ‌రావు గ్రానైట్ ఫ్యాక్ట‌రీల‌పై ఎన్నో సార్లు దాడులు జ‌గ‌డంతో ఆయ‌న చివ‌ర‌కు పార్టీ మారిపోయారు. కందుకూరు మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావుతో పాటు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వికుమార్ గ్రానైట్ వ్యాపారాల‌పై కంటిన్యూగా దాడులు జ‌రుగుతున్నాయి.

అస‌లు గొట్టిపాటి ర‌విని వ‌ద‌ల‌కుండా టార్గెట్ చేస్తున్నారు. పంచాయ‌తీ ఎన్నిక‌ల వేళ ర‌విని ఆర్థికంగా దెబ్బ తీసే ప్లాన్ జ‌రుగుతోంది. ఇక పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు వ్యాపారాలు ఏపీలో ఎప్పుడో ఆగిపోయాయి. అయినా ఆయ‌న బాప‌ట్ల పార్ల‌మెంట‌రీ పార్టీ అధ్య‌క్షుడిగా ఏడు నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీని ప‌రుగులు పెట్టిస్తున్నారు. ఇక కొండ‌పి ఎమ్మెల్యే స్వామిని ఎంత ఇబ్బంది పెడుతున్నా ఆయ‌న కూడా ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా పోరాడుతున్నారు.

అద్దంకిలో 103, పర్చూరులో 95, కొండపిలో 111 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పంచాయతీలను ఏకగ్రీవం చేయాలని అధికారపార్టీ ఎన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నా వీరు మాత్రం టీడీపీ నుంచి అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్ట‌డంతో పాటు త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో పై చేయి కోసం విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఏదేమైనా ఈ ముగ్గురి పోరాటం మిగిలిన టీడీపీ నేత‌ల్లో ఉంటే ఏపీలో టీడీపీ ప‌రిస్థితి మరోలా ఉండేది. 


సముద్రం నీటి లోపల పెళ్లితో ఒక్కటయిన జంట.. వైరల్ వీడియో..?

కాపు వేద‌న‌: జ‌గ‌న్‌కు ఈ కాపు నేత‌లు అక్క‌ర్లేదా... కాపు ఓట్లు అక్క‌ర్లేదా ?

జగడ్డ : నిమ్మగడ్డ జైల్ కి... గత అనుభవాలు ఏమి చెబుతున్నాయి ?

ఏపీకి బడ్జెట్‌ షాక్‌ : సీఎం జగన్‌కు అధికారులు ఏం చెప్పారంటే.. ?

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్ చైర్మ‌న్‌కే ఇన్ని బాధ‌లా ?

పాపం మోహ‌న్‌బాబు... జ‌గ‌న్‌ను న‌మ్ముకుని ఇలా మిగిలిపోయాడా ?

జగడ్డ : రెండో విడత నామినేషన్లు షురూ.. ఈసారి బాబోరు పక్కా ప్లాన్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>