PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/mohan-babu-jagan54029a92-876f-48c4-9004-7d12138c4a95-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/mohan-babu-jagan54029a92-876f-48c4-9004-7d12138c4a95-415x250-IndiaHerald.jpg అయితే ఆయ‌న వ్య‌క్తిగ‌త చేష్ట‌ల‌తో ఆ ప‌ద‌వి కోల్పోవాల్సి వ‌చ్చింది. ఆ త‌ర్వాత ఏ సినిమా న‌టుడిని కూడా జ‌గ‌న్ ద‌గ్గ‌ర‌కు చేర‌దీయ‌డం లేదు. ఇక త‌న బంధువు అయిన మోహ‌న్‌బాబు ను కూడా ఏ మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు. ఈ విష‌యంలో మోహ‌న్ బాబు తీవ్ర అసంతృప్తితో ఉన్న‌ట్టే ఇటీవ‌ల ఆయ‌న మాట్లాడిన మాట‌లే చెపుతున్నాయి. ఎన్నిక‌ల‌కు ముందే మోహ‌న్ బాబు చిత్తూరు జిల్లా శ్రీకాళ‌హ‌స్తి లేదా నెల్లూరు జిల్లా వెంక‌ట‌గిరి నుంచి పోటీ చేస్తార‌న్న ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఎన్నిక‌ల‌య్యాక ఆయ‌న్ను రాజ్య‌స‌భ‌కు పంపుతార‌న్న టాక్ mohan babu jagan;cbn;nani;editor mohan;kodali nani;mohan babu;vishnu;telugu desam party;district;cinema;telugu;king;minister;king 1;letter;ycp;reddy;party;sri venkateswara bhakti channelపాపం మోహ‌న్‌బాబు... జ‌గ‌న్‌ను న‌మ్ముకుని ఇలా మిగిలిపోయాడా ?పాపం మోహ‌న్‌బాబు... జ‌గ‌న్‌ను న‌మ్ముకుని ఇలా మిగిలిపోయాడా ?mohan babu jagan;cbn;nani;editor mohan;kodali nani;mohan babu;vishnu;telugu desam party;district;cinema;telugu;king;minister;king 1;letter;ycp;reddy;party;sri venkateswara bhakti channelTue, 02 Feb 2021 08:28:52 GMTక‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆయ‌న ఉన్న‌ది ఉన్న‌ట్టు కుండ‌బ‌ద్ద‌లు కొట్టేస్తుంటాడు. ఒక‌ప్పుడు తెలుగుదేశంలో కీ రోల్ పోషించ‌డంతో పాటు ఆ పార్టీ నుంచి రాజ్య‌స‌భ‌కు ఎంపిక‌య్యారు. ఆ త‌ర్వాత చంద్ర‌బాబుతో తీవ్రంగా విబేధించారు. ఆ త‌ర్వాత దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్‌. రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఫ్యామిలీతో బంధుత్వం అందుకుని వాళ్ల‌తో వియ్యం పొందారు. ఈ క్ర‌మంలోనే గ‌త ఎన్నిక‌ల‌కు ముంద చంద్ర‌బ‌బుపై తీవ్ర విమ‌ర్శ‌లు చేసి జ‌గ‌న్ స‌మ‌క్షంలో త‌న పెద్ద కుమారుడు విష్ణుతో స‌హా వైసీపీ కండువా క‌ప్పుకున్నారు.

క‌ట్ చేస్తే ఏపీలో జ‌గ‌న్ సీఎం అయ్యి ఇర‌వై నెల‌లు అవుతోంది. ఈ పాల‌నా కాలంలో మోహ‌న్‌బాబుకు ఎలాంటి ప్రాధాన్య‌త లేకుండా పోయింది. జ‌గ‌న్ సీఎం అయిన వెంట‌నే కొంద‌రు సినిమా న‌టుల‌కు మంచి ప్రాధాన్యం క‌ల్పించారు. వీరిలో పృథ్వికి ఏకంగా ఎస్వీబీసీ ఛానెల్ చైర్మ‌న్ ప‌ద‌వి కూడా ఇచ్చారు. అయితే ఆయ‌న వ్య‌క్తిగ‌త చేష్ట‌ల‌తో ఆ ప‌ద‌వి కోల్పోవాల్సి వ‌చ్చింది. ఆ త‌ర్వాత ఏ సినిమా న‌టుడిని కూడా జ‌గ‌న్ ద‌గ్గ‌ర‌కు చేర‌దీయ‌డం లేదు. ఇక త‌న బంధువు అయిన మోహ‌న్‌బాబు ను కూడా ఏ మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు. ఈ విష‌యంలో మోహ‌న్ బాబు తీవ్ర అసంతృప్తితో ఉన్న‌ట్టే ఇటీవ‌ల ఆయ‌న మాట్లాడిన మాట‌లే చెపుతున్నాయి.

ఎన్నిక‌ల‌కు ముందే మోహ‌న్ బాబు చిత్తూరు జిల్లా శ్రీకాళ‌హ‌స్తి లేదా నెల్లూరు జిల్లా వెంక‌ట‌గిరి నుంచి పోటీ చేస్తార‌న్న ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఎన్నిక‌ల‌య్యాక ఆయ‌న్ను రాజ్య‌స‌భ‌కు పంపుతార‌న్న టాక్ కూడా వ‌చ్చింది. ఇవేవి జ‌ర‌గ‌లేదు. ఇదే స‌మ‌యంలో జ‌గ‌న్ క‌మ్మ వ‌ర్గాన్ని పూర్తిగా అణ‌గ‌దొక్కుతున్నార‌న్న టాక్ ఉంది. ఒక్క క‌మ్మ‌కు కూడా ఆయ‌న రాజ్య‌స‌భ లేదా ఎమ్మెల్సీ కూడా ఇవ్వ‌లేదు. జ‌గ‌న్ యాంటీ క‌మ్మ ముద్ర‌ను పోగొట్టు కోవాల‌న్నా మోహన్ బాబుకు పదవి ఇవ్వాలన్న కామెంట్స్ కూడా పార్టీ నుంచి విన్పిస్తున్నాయి.

జ‌గ‌న్ మంత్రి వ‌ర్గంలో క‌మ్మ వ‌ర్గం నుంచి ఒక్క కొడాలి నాని మాత్ర‌మే మంత్రిగా ఉన్నారు. ఆ త‌ర్వాత ఎవ్వ‌రికి మంత్రి ప‌ద‌వి రాలేదు. మ‌రి ఇప్పుడు మోహ‌న్‌బాబుకు ఏదైనా ప‌ద‌వి ఇచ్చి అంద‌లం ఎక్కిస్తారా ?  లేదా ఆయ‌న అలా మిగిలి పోవాల్సిందేనా ? అన్న‌ది చూడాలి. 


సామాన్యులకు భారీ షాక్.. పెరగనున్న వంటగ్యాస్ ధరలు..?

జగడ్డ: విజయనగరం జిల్లాను తెగ పొగిడేసిన నిమ్మగడ్డ..? ఎందుకంటే..?

బ్రాహ్మణ ఘోష: పురోహితులు, పూజారులకు పెళ్లి కూతుళ్లు దొరకక పోవటానికి కారణాలివే!

బాలకృష్ణ దృష్టిలో పడిన రామ్ చరణ్ సెంటిమెంట్ !

జగడ్డ: 2 రోజుల్లో యాప్ తీసుకొస్తా.. నిమ్మగడ్డ పరోక్ష హెచ్చరిక..

హెరాల్డ్ సెటైర్ : తండ్రి పేరు చెప్పి కొడుకుతో భలే రాజకీయం చేస్తున్నారే ?

నాని రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>