PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////////images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////////images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో రాజకీయ నాయకులను వాడుకుని అక్రమంగా సంపాదించడం అనేది జనాలకు అలవాటు అయింది. నేను పలానా అధికారి, నేను పాలనా నాయకుడి దగ్గర ఉంటాను అంటూ పెద్ద పెద్ద మోసాలు చేయడానికి సిద్దమవుతున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నా సరే మార్పు మాత్రం రావడం లేదు. ఏకంగా ముఖ్యమంత్రులను, మంత్రులను, వారి కుటుంబ సభ్యులను వాడుకుని కొందరు నేరాలకు పాల్పడుతున్నారు. దీనిపై పోలీసులు ముందు నుంచి కూడా కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఏపీలో సిఎం జగన్ నే వాడుకున్నాడు ఒక వ్యక్తి. సీఎం పేషీ పేరుతో మోసం చేస్తుys jagan;pradeep;tiru;jagan;vijayawada;police;traffic police;mantraఓరయ్యా ఏకంగా జగన్ నే వాడేసుకున్నాడు గా...!ఓరయ్యా ఏకంగా జగన్ నే వాడేసుకున్నాడు గా...!ys jagan;pradeep;tiru;jagan;vijayawada;police;traffic police;mantraTue, 02 Feb 2021 11:00:00 GMT
తాజాగా ఏపీలో సిఎం జగన్ నే వాడుకున్నాడు ఒక వ్యక్తి. సీఎం పేషీ పేరుతో మోసం చేస్తున్న ఘరానా మోసగాడిని బెజవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం పేషీ నుంచి మాట్లాడుతున్నానని ప్రభుత్వం కాంట్రాక్ట్ లు ఇప్పిస్తానని పలువురు వద్ద డబ్బులు వసూలు చేయడం సంచలనం అయింది. తన అకౌంట్ కు నగదును ట్రాన్స్ ఫర్ చేయించుకుని పత్తాలేకుండాపోయిన వ్యక్తి... పై ఫిర్యాదులు వెళ్ళాయి. విజయవాడ కమిషనరేట్ పరిధిలో 7 కేసులు నమోదు చేసారు పోలీసులు. ఖమ్మం జిల్లాకు చెందిన నేలపట్ల రాకేష్ ను బెజవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ట్రు కాలర్ లో ప్రదీప్ సీఎం పేషీ అకౌంట్స్ అని నమోదు చేయించుకుని ఘరానా మోసానికి రాకేష్ పాల్పడ్డాడు అని పోలీసులు గుర్తించారు. తన అకౌంట్ కు నగదును బదిలీ చేయించుకునేందుకు వెండర్ కోడ్ క్రియేట్ చేయాలని సూచనలు చేసాడు. కోడ్ కు ముందుగా రూ.20 వేలు చెల్లించాలంటూ నమ్మబలికాడు రాకేష్. లక్షల రూపాయలు వసూలు చేసి నిందితుడు పరారు కావడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేసారు. తరచూ సిమ్ లు మారుస్తూ తప్పించుకుని రాకేష్ తిరుగుతున్నాడు అని గుర్తించారు. ఎట్టకేలకు బెజవాడ పోలీసులకు రాకేశ్ చిక్కగా అతని వద్ద నుంచి సమాచారం సేకరిస్తున్నారు. మోసగాళ్ల చేతికి చిక్క వద్దని అప్రమత్తంగా ఉండాలని బెజవాడ పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు సూచిస్తున్నారు.


గుంటూరులో ఆ ఇద్ద‌రు వైసీపీ ఎమ్మెల్యేలే టార్గెట్ ?

ఆయన కోసమే ఎమోషనల్ వీడియో పోస్ట్ చేసిన సింగర్ సునీత..

చీరాల‌లో వింత రాజ‌కీయం: క‌్యాండెట్లు టీడీపీ...పోటీ చేసేది వైసీపీ...?

ప్రభుత్వం సై - విద్యార్థులు నై.. తెలంగాణలో విచిత్రం

జగడ్డ: నిమ్మగడ్డపై చర్యలకు ఏర్పాట్లు ముమ్మరం...?

మెగా హీరోకి జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ !

బిగ్ బాస్ 5లో యూట్యూబ్ సెనేషనల్ స్టార్.. అతడు వస్తే టైటిల్ ఫిక్స్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>