MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-heroinese21d931d-f99a-4f59-836b-3c0cf914b834-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-heroinese21d931d-f99a-4f59-836b-3c0cf914b834-415x250-IndiaHerald.jpgఒకే సినిమాతో మురిపించి మాయమైపోయిన హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. ఒకే సినిమాలో నటించినా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయేంత ముద్ర వేసుకున్నారు. బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. మరి అలాంటి హీరోయిన్స్ ఎవరో ఓ లుక్కేద్దామా..tollywood heroines;pawan;chiranjeevi;mahesh;prabhas;venkatesh;balakrishna;nithin;kangana ranaut;meera;nagarjuna akkineni;tanushree dutta;akhil akkineni;allu arjun;allu sirish;anjali;aparna;arya;bhanu;gautham new;gautham;geetanjali;girija;kalyan;karishma kotak;kriti sanon;pawan kalyan;prasad;prince;rajendra prasad;ravi teja;shankar;tollywood;cinema;telugu;king;hindi;blockbuster hit;king 1;girl;heroine;success;silver screen;arjun 1;nithin reddy;manmadhudu;athidhi;babu rajendra prasad;josh;bhanusri;oy;yami gautham;don seenu;aryaa;raghavendra;ek niranjan;chirutha;chitramచేసిన ఒక్క సినిమాతో టాలీవుడ్ నుండి మాయమైన తెలుగు హీరోయిన్స్చేసిన ఒక్క సినిమాతో టాలీవుడ్ నుండి మాయమైన తెలుగు హీరోయిన్స్tollywood heroines;pawan;chiranjeevi;mahesh;prabhas;venkatesh;balakrishna;nithin;kangana ranaut;meera;nagarjuna akkineni;tanushree dutta;akhil akkineni;allu arjun;allu sirish;anjali;aparna;arya;bhanu;gautham new;gautham;geetanjali;girija;kalyan;karishma kotak;kriti sanon;pawan kalyan;prasad;prince;rajendra prasad;ravi teja;shankar;tollywood;cinema;telugu;king;hindi;blockbuster hit;king 1;girl;heroine;success;silver screen;arjun 1;nithin reddy;manmadhudu;athidhi;babu rajendra prasad;josh;bhanusri;oy;yami gautham;don seenu;aryaa;raghavendra;ek niranjan;chirutha;chitramTue, 02 Feb 2021 19:46:07 GMTహీరోయిన్స్ ఎవరో ఓ లుక్కేద్దామా..

మన్మథుడు సినిమాలో కింగ్ నాగార్జున పక్కన నటించిన సెకండ్ హీరోయిన్ గుర్తుందా.. అన్షు.. మన్మథుడులో నటించి మెప్పించింది.. తర్వాత ప్రభాస్ సరసన రాఘవేంద్ర సినిమాలో నటించింది. తర్వాత మాత్రం సిల్వర్ స్క్రీన్ నుంచి మాయమైంది. అమెరికాలో సెటిల్ అయిపోయింది.

ఇక నాగార్జున సరసన గీతాంజలి సినిమాలో నటించిన గిరిజ కూడా అంతే. ఒకే సినిమాతో ఎనలేని గుర్తింపు వచ్చినా.. ఆమె మరే సినిమాలోనూ నటించలేదు.. తర్వాత ఫారిన్ లో సెటిలైంది.

సుందరకాండ  సినిమాలో వెంకటేష్ తో ఆడిపాడిన కర్లీ హెయిర్ అమ్మాయి అపర్ణ కూడా తర్వాత రాజేంద్ర ప్రసాద్ తో నటించింది. అక్క పెత్తనం చెల్లెలి కాపురంలో కనిపించినా.. తర్వాత విదేశాలకు వెళ్లిపోయింది

లోఫర్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన దిశా పటానీ.. ఆ తర్వాత టాలివుడ్ లో నటించలేదు. బాలివుడ్ లో ఆఫర్లు రావడంతో అక్కడే సెటిల్ అయిపోయింది.

మహేష్ బాబు తో హీరోయిన్ గా చేసిన కృతి సనన్ ... తర్వాత నాగచైతన్యతో దోచేయ్ చిత్రంలో నటించింది. ఆ తర్వాత పెద్దగా ఆఫర్లు రాలేదు.


అఖిల్ తో పాటు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన సయేషా సైగల్ కూడా .. తెలుగులో సక్సెస్ ని సాధించలేకపోయింది. తమిళనాట మాత్రం హిట్స్ తో దూసుకుపోతుంది.

ఏక్ నిరంజన్ తో ప్రభాస్ తో కలిసి నటించిన కంగన రనౌత్.. మళ్లీ తెలుగులో నటించలేదు. బాలివుడ్ లో మాత్రం వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది.

మెగాస్టార్ చిరంజీవి పక్కన శంకర్ దాదా సినిమాలో నటించిన కరిష్మా కోటక్.. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో కనిపించకుండా పోయింది.

చిరుత, కుర్రాడు సినిమాల్లో నటించిన నేహా శర్మకు కూడా తర్వాత ఆఫర్లు రాలేదు. అడపాదడపా హిందీ సినిమాల్లో నటించినా.. తర్వాత ఖాళీగానే ఉంది.  


పవన్ సరసన పంజాలో నటించిన సారాజైన్ కు కూడా.. ఆతర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు.

బాలకృష్ణ చిత్రం వీరభద్రలో నటించిన తనుశ్రీ దత్తా.. కూడా వన్ మూవీ వండర్ గానే మిగిలిపోయింది.

పవర్ స్టార్ సరసన పంజాలో నటించిన అంజలి లావనియా.. సినిమా ఫ్లాప్ కావడంతో ఆఫర్లు రాలేదు

బన్నీ సినిమాలో అల్లు అర్జున్ కి జోడీ కట్టిన గౌరీ ముంజల్ .. తర్వాత కొన్ని సినిమా ల్లో మాత్రమే నటించింది.

ప్రిన్స్ మహేశ్ బాబు హీరోయిన్ గా అతిధి సినిమాలో నటించిన అమృతారావు కూడా వన్ ఫిల్మ్ హీరోయిన్ గా మిగిలిపోయింది.

వరుడు సినిమా డిజాస్టర్ గా మిగిలిపోవడంతో అందులో నటించిన భానుశ్రీ మెహ్రాకు మళ్లీ అవకాశాలు రాలేదు

నాగార్జున బ్లాక్ బస్టర్ మూవీ సంతోషం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన గ్రేసీ సింగ్.. తర్వాత తప్పు చేసి పప్పు కూడు సినిమాలో నటించింది. తర్వాత హిందీ సినిమాలకు పరిమితమైంది.

ఆర్య సినిమాలో నటించిన హీరోయిన్ అనురాధ మెహతా.. తర్వాత రెండు మూడు సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు.

పవన్ కళ్యాణ్ బంగారం సినిమాలో నటించిన మీరా చోప్రా.. తర్వాత నితిన్ సరసన ఒక సినిమాలో మాత్రమే కనిపించింది.

రవితేజతో నేనింతే సినిమాలో నటించిన శియా గౌతమ్.. ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు.


అల్లు శిరీష్ సరసన గౌరవం, కొరియర్ బాయ్ కళ్యాణ్ అంటూ నితిన్ తో కలిసి ఆడిపాడినా .. తెలుగు ప్రేక్షకులను అలరించలేకపోయింది యామీ గౌతమ్

చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న బేబీ షామిలీ.. ఓయ్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. చిన్నప్పటి మ్యాజిక్ ఇప్పుడు పనిచేయలేదు.

జోష్ సినిమాతో నాగచైతన్యతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కార్తీక.. దమ్ము సినిమాలో నటించింది. ఆ తర్వాత ఆఫర్లు కరువయ్యాయి.


రవితేజ సరసన డాన్ శీనులో నటించిన అంజనా సుఖానీకి.. మరే సినిమాలోనూ అవకాశం రాలేదు.


బాలయ్యతో క్రాక్.. నందమూరి ఫ్యాన్స్ కు పండుగే..!

రవితేజాతో బాలయ్యకు గొడవలేంటి...?

టీచర్ల వెతలు : ప్రైవేట్ టీచర్లకు కూడా ప్రభుత్వం ప్రతినెలా తనవంతు జీతాలు ఇవ్వాలి...

బ్రాహ్మణ ఘోష: వీరి బాధ జగన్ కు అర్ధం కాదా...?

బ్రాహ్మణ ఘోష: ప్రభుత్వం బ్రాహ్మణులకు కూడా రిజర్వేషన్ లు ప్రవేశ పెట్టాలి...

ఇటు బాలయ్యతో...అటు చిరంజీవితో...ఎవరా లక్కీ డైరెక్టర్ ...?

బ్రాహ్మణ ఘోష: జగనోరూ ఇకనైనా కళ్ళు తెరవండి..మమ్మల్ని ఆదుకోండి...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>