PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////////images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////////images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpgగుంటూరు జిల్లాలో అధికారి వైసీపీ ఇప్పుడు అన్ని విధాలుగా కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా అమరావతి విషయంలో వైసీపీ నేతలు గతంలో చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ ఇబ్బంది పెట్టొచ్చు అనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఎక్కువగా వినబడుతున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ అమరావతి విషయంలో తీసుకున్న నిర్ణయంపై ప్రజలలో ఆగ్రహం పెరుగుతోంది. అమరావతిని జగన్ ఇబ్బందులు పెడుతున్నారని రాజధాని ప్రాంత అభివృద్ధి విషయంలో ఆయన వైఖరిపై బాగా లేదని ఆగ్రహం వ్యక్తం అవుతుంది. మూడు రాజధానులు కావాలి అంటూ విశాఖ లో రాజధాని ఏర్పాటు చేయడానిys jagan;krishna river;jagan;amaravati;guntur;district;vishakapatnam;capital;chief minister;parliment;mla;local language;narasaraopet;ycp;petta;party;sajjala ramakrishna reddy;macherla;pinnelli ramakrishna reddyజగడ్డ: గుంటూరులో ఎమ్మెల్యేలే జగన్ కు మైనస్...?జగడ్డ: గుంటూరులో ఎమ్మెల్యేలే జగన్ కు మైనస్...?ys jagan;krishna river;jagan;amaravati;guntur;district;vishakapatnam;capital;chief minister;parliment;mla;local language;narasaraopet;ycp;petta;party;sajjala ramakrishna reddy;macherla;pinnelli ramakrishna reddyTue, 02 Feb 2021 14:00:00 GMTవైసీపీ ఇప్పుడు అన్ని విధాలుగా కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా అమరావతి విషయంలో వైసీపీ నేతలు గతంలో చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ ఇబ్బంది పెట్టొచ్చు అనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఎక్కువగా వినబడుతున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ అమరావతి విషయంలో తీసుకున్న నిర్ణయంపై ప్రజలలో ఆగ్రహం పెరుగుతోంది. అమరావతిని జగన్ ఇబ్బందులు పెడుతున్నారని రాజధాని ప్రాంత అభివృద్ధి విషయంలో ఆయన వైఖరిపై బాగా లేదని ఆగ్రహం వ్యక్తం అవుతుంది.

మూడు రాజధానులు కావాలి అంటూ విశాఖ లో రాజధాని ఏర్పాటు చేయడానికి ఉగాది రోజున ముహూర్తం కూడా ఖరారు చేశారనే ప్రచారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది. అమరావతి కారణంగా గుంటూరు జిల్లా వైసీపీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. కృష్ణా జిల్లాలో కూడా ప్రభావం కనబడుతుంది. అయితే అమరావతి నుంచి రాజధాని తరలింపు పై అక్కడి ప్రజలు వద్దని అంటున్నా... ముఖ్యమంత్రి జగన్ అభిప్రాయాలను తీసుకోవద్దు అనే విధంగా వ్యవహరిస్తున్నారు. దీనిపై ప్రజల్లో క్రమంగా ఆగ్రహం పెరుగుతుంది.

గుంటూరు, నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని అన్ని గ్రామాల్లో కూడా అమరావతి కి అనుకూలంగా ర్యాలీ నిర్వహించారు. వైసీపీ ఎమ్మెల్యేలు బయటకు వచ్చి పార్టీ వైఖరిని ప్రజలకు స్పష్టంగా చెప్పలేకపోయారు. 3 రాజధానులు ఎందుకు అనేదాన్ని వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజల్లోకి బలంగా తీసుకొని వెళ్లలేకపోయారు. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా సొంత వ్యవహారాలను ఎక్కువగా చక్కబెట్టడానికి ఆసక్తి చూపించడంతో పరిస్థితి గుంటూరు జిల్లాలో రోజు రోజుకు దిగజారుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ పై మరింత బలహీన పడే అవకాశాలు ఉండవచ్చు అని అంటున్నారు. దాదాపుగా గుంటూరు జిల్లాలో మాచర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బలంగా ఉండటంతో అక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిణామాలు మాత్రం అధికార వైసీపీలో కాస్త ఇబ్బందికరంగా మారాయి అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు.


జెర్సీ లేకుండా క్రికెటర్ పరుగు.. వీడియో వైరల్

జగడ్డ : నిమ్మగడ్డ మాటకు లక్షలే..షాకేనా...?

తెలంగాణ‌లో టీడీపీ షాకింగ్ డెసిష‌న్‌... మ‌ళ్లీ ఎన్టీఆర్...!

10 సార్లు ఫేస్ టు ఫేస్ గా విడుదలైన చిరంజీవి వర్సెస్ నాగార్జున సినిమాలు.. ఇందులో ఎవరిది పై చేయి..!

జగడ్డ: నిమ్మగడ్డపై కొడాలి నాని మౌనానికి కారణం ఏంటి..?

ఆర్ ఆర్ ఆర్ కోసం అదిరిపోయే ప్లాన్ లో రాజమౌళి ?

ఐటమ్ బాంబ్స్ వల్ల బాగా నష్టపోతున్న స్టార్ హీరోయిన్లు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>