PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chinnamma-sensational-decision-on-two-leaves653e110b-8b08-46f3-bb09-d824b33d8d8e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chinnamma-sensational-decision-on-two-leaves653e110b-8b08-46f3-bb09-d824b33d8d8e-415x250-IndiaHerald.jpgఅన్నాడీఎంకేలో రెండాకుల వివాదం మళ్లీ తెరమీదికి వచ్చింది. పార్టీ గుర్తుపై పట్టు విడిచేది లేదంటున్నారు శశికళ. జైలు నుంచి విడుదలైన తర్వాత స్పీడ్‌ పెంచారు. అన్నాడీఎమ్‌కేతో తన పోరు ఆగదని చెబుతున్నారు. రెండాకుల గుర్తుపై ఈసీ నిర్ణయాన్ని సుప్రీంలో సవాల్‌ చేసేందుకు రెడీ అయ్యారు చిన్నమ్మ. త్వరలో క్యూరేటివ్‌ పిటిషన్‌ వేస్తామని ఆమె తరపు లాయర్‌ రాజా సెంథూర్‌ పాండియన్‌ చెప్పారు. chinnamma sensational decision on two leaves;munna;raja;tara;delhi;high court;court;car;tamilnadu;election commission;partyరెండు ఆకులపై చిన్నమ్మ సంచలన నిర్ణయం..!రెండు ఆకులపై చిన్నమ్మ సంచలన నిర్ణయం..!chinnamma sensational decision on two leaves;munna;raja;tara;delhi;high court;court;car;tamilnadu;election commission;partyTue, 02 Feb 2021 21:33:04 GMTపార్టీ గుర్తుపై పట్టు విడిచేది లేదంటున్నారు శశికళ. జైలు నుంచి విడుదలైన తర్వాత స్పీడ్‌ పెంచారు. అన్నాడీఎమ్‌కేతో తన పోరు ఆగదని చెబుతున్నారు. రెండాకుల గుర్తుపై ఈసీ నిర్ణయాన్ని సుప్రీంలో సవాల్‌ చేసేందుకు రెడీ అయ్యారు చిన్నమ్మ. త్వరలో క్యూరేటివ్‌ పిటిషన్‌ వేస్తామని ఆమె తరపు లాయర్‌ రాజా సెంథూర్‌ పాండియన్‌ చెప్పారు.

2017లో శశికళతో పాటు దినకరన్‌ను అన్నాడీఎమ్‌కే నుంచి బహిష్కరించారు. అప్పుడు పార్టీ గుర్తు కోసం జరిగిన న్యాయ పోరాటంలో.. రెండాకులు ఈపీఎస్‌ నేతృత్వంలోని గ్రూప్‌కి ఇచ్చింది ఎన్నికల సంఘం. దీనిపై దినకరన్‌ ఢిల్లీ హైకోర్టుకు వెళ్లారు. తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టు ఈ రెండు పిటిషన్లను కొట్టేసింది. దీంతో మరోసారి రెండాకుల గుర్తు కోసం ఆఖరి పోరాటానికి సిద్ధమవుతున్నారు శశికళ.

మరోవైపు శశికళ రీ ఎంట్రీపై అన్నాడీఎమ్‌కేలోనే భిన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. శశికళ క్షమాపణలు చెబితే.. పార్టీలోకి తీసుకుంటామని కేపీ మున్నుస్వామి చెబితే.. జయకుమార్‌ మాత్రం దీనిని ఖండించారు. చిన్నమ్మను ఏఐడీఎమ్‌కేలోకి తీసుకునేదే లేదని తేల్చి చెప్పారు.

ఇక శశికళ ఆస్పత్రి నుంచి విడుదలైన రోజే ఏఐడీఎమ్‌కే నేతలకు షాకిచ్చారు. ఆమె ప్రయాణించిన కారుపై అన్నాడీఎమ్‌కే జెండా ఉంది. అయితే పార్టీ సభ్యులు కాని వాళ్లు జెండాను ఎలా వాడుతారంటూ మండిపడుతున్నారు అన్నాడీఎమ్‌కే నేతలు. దీనిపై లీగల్‌గా వెళ్తామని చెబుతున్నారు. కానీ దినకరన్‌ మాత్రం దాంట్లో తప్పేమీ లేదంటున్నారు. ఇప్పటికీ చిన్నమ్మే పార్టీ జనరల్‌ సెక్రటరీ అని చెబుతున్నారు. ఈ విషయం కోర్టులో ఉందని.. త్వరలో అంతా తేలిపోతుందని చెబుతున్నారు.

మొత్తానికి శశికళ తన పంథాన్ని వీడటం లేదు. ఎలాగైనా ఆ రెండు ఆకులు తానే దక్కించుకోలనుకుంటోంది. ఎప్పటికైనా అవి తనవే అంటూ ఘంటాపథంగా చెబుతోంది. అదే గుర్తుతో తాను ఎన్నికలకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు శిక్ష అనుభవించిన శశికళ ఇపుడు తమిళనాడులో జరుగబోయే ఎన్నికలపై దష్టిపెట్టింది.



>>




ప్రధానికి యశ్ ఫ్యాన్ లెటర్.. ఇలాంటి లెటర్ ఇప్పటివరకు చూసి ఉండరు..

రవితేజాతో బాలయ్యకు గొడవలేంటి...?

టీచర్ల వెతలు : ప్రైవేట్ టీచర్లకు కూడా ప్రభుత్వం ప్రతినెలా తనవంతు జీతాలు ఇవ్వాలి...

బ్రాహ్మణ ఘోష: వీరి బాధ జగన్ కు అర్ధం కాదా...?

బ్రాహ్మణ ఘోష: ప్రభుత్వం బ్రాహ్మణులకు కూడా రిజర్వేషన్ లు ప్రవేశ పెట్టాలి...

ఇటు బాలయ్యతో...అటు చిరంజీవితో...ఎవరా లక్కీ డైరెక్టర్ ...?

బ్రాహ్మణ ఘోష: జగనోరూ ఇకనైనా కళ్ళు తెరవండి..మమ్మల్ని ఆదుకోండి...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>