EducationSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/ugc-net-notification09ae17d3-783f-4b5d-abb7-7f3bd797706f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/ugc-net-notification09ae17d3-783f-4b5d-abb7-7f3bd797706f-415x250-IndiaHerald.jpgకరోనా వల్ల విద్యా సంవత్సరం పూర్తిగా మారిపోయింది. జరగవలసిన పరీక్షలు వాయిదా పడ్డాయి. తరగతులు కూడా వెనక పడ్డాయి. కరోనా ప్రభావం కొంతవరకు తగ్గడంతో మళ్లీ కీలక చర్చలు జరిపిన తర్వాత స్కూల్స్ ను ప్రారంభించారు. ఫిబ్రవరి ఒకటి నుంచి ప్రతి ఒక్క విద్యార్థి స్కూల్స్ కు హాజరు కావాలని సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు నిన్నటి నుంచి పాఠశాలలు కరోనా నిబంధనలను పాటిస్తూ ప్రారంభం అయ్యాయి. విద్యార్థులు కూడా భారీగా హాజరయ్యారు. 75 శాతం సిలబస్ ను మాత్రమే క్లాసుల్లో బోధించి మే 3 నుంచి పరీక్షలను నిర్వహించాలని ఆయా ప్రభుత్వాలు భugc net notification;jr ntr;media;february;minister;qualification;professor;central government;marchయూజీసీ నెట్ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..యూజీసీ నెట్ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..ugc net notification;jr ntr;media;february;minister;qualification;professor;central government;marchTue, 02 Feb 2021 18:00:00 GMTఫిబ్రవరి ఒకటి నుంచి ప్రతి ఒక్క విద్యార్థి స్కూల్స్ కు హాజరు కావాలని సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు నిన్నటి నుంచి పాఠశాలలు కరోనా నిబంధనలను పాటిస్తూ ప్రారంభం అయ్యాయి. విద్యార్థులు కూడా భారీగా హాజరయ్యారు. 75 శాతం సిలబస్ ను మాత్రమే క్లాసుల్లో బోధించి మే 3 నుంచి పరీక్షలను నిర్వహించాలని ఆయా ప్రభుత్వాలు భావిస్తున్నారు.



కాగా, ప్రస్తుతం విద్యార్థులకు కొత్త అవకాశాలను అందించడం లో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే పలు పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేస్తున్నారు. పలు పరీక్షలను కూడా నిర్వహిస్తున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నారు. తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసారు. విషయానికొస్తే.. యూజీసీ నెట్ పరీక్షల నిర్వహణ తేదీలు విడుదలయ్యాయి. ఈ తేదీల పై కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ ఫోఖ్రియాల్ మంగళవారం స్పష్టత ఇచ్చారు. నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ మే 2 నుంచి 17వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తుందని ఫోఖ్రియాల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు..



జేఆర్ఎఫ్, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ ఉద్యోగానికి అర్హత కోసం స‌బ్జెక్టుల వారీగా మే 2, 3, 4, 5, 6, 7, 10, 11, 12, 14, 17 తేదీల్లో మొత్తం 11 రోజులపాటు దేశవ్యాప్తంగా పరీక్షలు జ‌రుగుతాయ‌ని ఆయన వెల్లడించారు. జూనియర్ రిసెర్చ్ ఫెలో షిప్‌, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి అర్హత కోసం కేంద్రం ప్రతీ సంవత్సరం యూజీసీ నెట్ పరీక్షలను నిర్వహిస్తోంది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఈ రోజు ప్రారంభమైంది. ఈ ప్రక్రియ మార్చ్ 2వ తేదీ వరకు కొనసాగనుంది. అభ్యర్థులు ఫీజును మాత్రం మార్చి 3 వరకు చెల్లించే అవకాశం కల్పించారు. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ nta.ac.in ను సంప్రదించవచ్చు. ఇదిలా ఉంటే.. షెడ్యూల్ విడుదల సందర్భంగా అభ్యర్థులకు మంత్రి రమేష్ పొఖ్రియాల్ గుడ్ లక్ చెప్పారు..



సిద్ధిపేట ప్రజలకు హరీష్ రావు సూపర్ గిఫ్ట్

ఆచార్య లో మరో స్టార్ హీరో.. ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

వకీల్ సాబ్ ని వెంటాడుతున్న పవన్ పాత సినిమాల సెంటిమెంట్.. భయపడిపోతోన్న అభిమానులు..!!

జ‌గ‌నోరు వ‌లంటీర్ల‌ను ఇందుకే పెట్టారా ? అనంత‌పురంలో అడ్డంగా బుక్ అయ్యారే ?

వామ్మో.. మహేశ్, రాజమౌళి కాంబో మూవీకి ఇంత బడ్జెట్ కేటాయిస్తున్నారా?

జగడ్డ : ఎస్ఈసీ వర్సెస్ సర్కార్... మరో కొత్త రచ్చ ?

అయాయ్యో..పుష్ప రిలీజ్ డేట్ తో సుక్కు హ్యాపీగా లేడా.. ఎందుకబ్బా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>