PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionsed743804-e679-4c50-8863-e4dd2be9aa46-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionsed743804-e679-4c50-8863-e4dd2be9aa46-415x250-IndiaHerald.jpgఏపీలో రెండేళ్ళుగా రాజకీయ కాక అలాగే ఉంది. అది మరింత శృతి మించిపోతోంది. పంచాయతీ ఎన్నికల వేళ ఆ వేడి కాస్తా రెట్టింపు అయింది. ఇక ఏపీలో అధికార వైసీపీ దూకుడు మీద వెళ్తోంది. ఇక విపక్ష టీడీపీ కూడా ఎక్కడా తగ్గడంలేదు. గత సార్వత్రిక ఎన్నికలలో దారుణమైన పరాజయమే ఎదురై చాలా బాగానే పోగొట్టుకుంది. jagan-nimmagadda-elections;view;shruti;sruthi;vijayawada;andhra pradesh;panchayati;arrest;tdp;ycp;partyజగడ్డ : అక్కడ టీడీపీకి అడ్వాంటేజ్....?జగడ్డ : అక్కడ టీడీపీకి అడ్వాంటేజ్....?jagan-nimmagadda-elections;view;shruti;sruthi;vijayawada;andhra pradesh;panchayati;arrest;tdp;ycp;partyTue, 02 Feb 2021 14:35:05 GMTశృతి మించిపోతోంది. పంచాయతీ ఎన్నికల వేళ ఆ వేడి కాస్తా రెట్టింపు అయింది. ఇక ఏపీలో అధికార వైసీపీ దూకుడు మీద వెళ్తోంది. ఇక విపక్ష టీడీపీ కూడా ఎక్కడా తగ్గడంలేదు. గత సార్వత్రిక ఎన్నికలలో దారుణమైన పరాజయమే ఎదురై చాలా  బాగానే పోగొట్టుకుంది.

కాబట్టి దాన్ని తిరిగి తెచ్చుకోవడానికి వీరోచితంగా పోరాడుతోంది. నిమ్మడలో ఒక్క  పంచాయతీ ఏకగ్రీవం కోసం ఏపీ రాజకీయం అతలాకుతలం అవుతోంది అంటేనే చాలు పంచాయతీ పోరు ఎంతటి హీట్ పెంచిందో. ఇదే తీరున రానున్న మూడు వారాలూ ఏపీని రాజకీయ వేసవి గాడ్పులే చుట్టు ముడతాయని అంటున్నారు.

ఇదిలా ఉంటే ఏపీలో అచ్చెన్ననాయుడు అరెస్ట్ మొత్తం పార్టీ శ్రేణులకు ఒక్కసారిగా కదిలించేసింది. ఆయన ఏపీ టీడీపీ ప్రెసిడెంట్. ఇప్పటికి ఎనిమిది నెలల తేడాలో రెండు సార్లు అరెస్ట్ అయ్యాడు. ఈమధ్యనే సంతబొమ్మాళి విగ్రహాల కేసులోనూ ఆయనకు నోటీసులు ఇచ్చి మరీ స్టేషన్ కి పిలిపించారు.

ఇవన్నీ ఇలా ఉంటే విజయవాడ టీడీపీ నేత పట్టాభి మీద దాడి కూడా పసుపు తమ్ముళ్ళలో ఆగ్రహం పెంచేలా చేస్తోంది. వరసపెట్టి ఒకే రోజు ఇలాంటి ఘటనలు జరగడంతో టీడీపీలో కసి బాగా పెరుగుతోంది అంటున్నారు. ఇది రానున్న పంచాయతీ ఎన్నికల్లో పెను ప్రభావమే చూపుతుందని అంటున్నారు. మొత్తానికి ఏపీలో అధికార వైసీపీ వ్యూహాత్మక తప్పిదాలూ, దూకుడు వల్ల పంచాయతీలలో ప్రతికూల ఫలితాలను మూటకట్టుకుంటుందా అన్న చర్చ అయితే సాగుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఈ మొత్తం పోరును చూస్తే ఏపీలో మళ్లీ వైసీపీ టీడీపీల మధ్యనే కధ సాగేలా ఉందని కూడా అంటున్నారు. ఇక మిగిలిన పార్టీలకు ఏపీ రాజకీయాల్లో ఎంత చోటు ఉంటుందో కానీ వైసీపీ టీడీపీ సమరం మాత్రం రాష్ట్ర రాజకీయాలను కొత్త మలుపు తిప్పుతున్నాయి.






అయ్యయ్యో.. అక్కినేని సామ్ కు అమెజాన్ ప్రైమ్ హ్యాండ్ ఇచ్చిందా?

కాపు వేద‌న‌: సీమ కాపులు జ‌గ‌న్‌కు ప‌నికిరారా ?

జగడ్డ : నిమ్మగడ్డ మాటకు లక్షలే..షాకేనా...?

పెళ్ళైన హీరో అంటే ఎంతో ఇష్టం అంటున్న సాయి పల్లవి...?

తెలంగాణ‌లో టీడీపీ షాకింగ్ డెసిష‌న్‌... మ‌ళ్లీ ఎన్టీఆర్...!

10 సార్లు ఫేస్ టు ఫేస్ గా విడుదలైన చిరంజీవి వర్సెస్ నాగార్జున సినిమాలు.. ఇందులో ఎవరిది పై చేయి..!

జగడ్డ: నిమ్మగడ్డపై కొడాలి నాని మౌనానికి కారణం ఏంటి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>