PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tpcc-revanth-reddyda05de38-3cb6-499f-8d8a-0036799042e6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tpcc-revanth-reddyda05de38-3cb6-499f-8d8a-0036799042e6-415x250-IndiaHerald.jpg త్వరలో నాగార్జున సాగర్ కు ఉప ఎన్నిక ఉండటంతో.. ఆ ఎన్నిక జరిగే వరకు పీసీసీ చీఫ్ ఎంపికను వాయిదా వేయాలని పార్టీ హైకమాండ్ ను కోరారు సీనియర్ నేత జానా రెడ్డి. దీంతో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తర్వాతే పీసీసీ చీఫ్ ప్రకటన ఉంటుందని మాణిక్కం ఠాగూర్ ప్రకటించారు.నాగార్జున సాగర్ ఎన్నిక తర్వాత పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని ప్రకటిస్తారని ప్రచారం జరుగుతుండగా.. తాజాగా కొత్త పేరు తెరపైకి వచ్చింది.tpcc revanth reddy;soniagandhi;kumaar;nagarjuna akkineni;jeevan;rahul new;rahul;revanth;sridhar;venkat;hyderabad;k l rahul;uttam kumar reddy nalamada;jeevan reddy;telangana;mohandas karamchand gandhi;revanth reddy;congress;mp;రాజీనామా;december;tpcc;mla;rahul sipligunj;letter;janareddy;jagga reddy;reddy;party;katthiటీపీసీసీ రేసులోకి కొత్త నేత!టీపీసీసీ రేసులోకి కొత్త నేత!tpcc revanth reddy;soniagandhi;kumaar;nagarjuna akkineni;jeevan;rahul new;rahul;revanth;sridhar;venkat;hyderabad;k l rahul;uttam kumar reddy nalamada;jeevan reddy;telangana;mohandas karamchand gandhi;revanth reddy;congress;mp;రాజీనామా;december;tpcc;mla;rahul sipligunj;letter;janareddy;jagga reddy;reddy;party;katthiTue, 02 Feb 2021 09:13:47 GMTతెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై సస్పెన్స్ కొనసాగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాల తర్వాత పీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. రాజీనామా చేయగా అప్పటి నుంచి కసరత్తు జరుగుతూనే ఉంది. డిసెంబర్ లోనే కొత్త పీసీసీ బాస్ వస్తారనే హడావుడి జరిగింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్... నాలుగు రోజుల పాటు గాంధీ భవన్ లోనే మకాం వేసి .. పార్టీలోని అన్ని వర్గాల నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దలకు రిపోర్ట్ ఇచ్చారు. దీంతో పీసీసీ చీఫ్ ప్రకటన వస్తుందని కాంగ్రెస్ నేతలు భావించగా.. వాళ్ల ఎదురుచూపులు అలానే ఉండిపోయాయి. పీసీసీ చీఫ్ ప్రకటనను వాయిదా వేసింది హైకమాండ్.
 
                టీపీసీసీ రేసులో ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు నిలిచినా.. చివరి వరకు మాత్రం రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి మధ్యే పోటీ నడిచినట్లు చెబుతున్నారు. ఇద్దరు గట్టిగా పట్టుబట్టడంతో... మధ్యే మార్గంగా కొంత కాలం వరకు జీవన్ రెడ్డికి ఇవ్వాలని నిర్ణయించినట్లు కూడా ప్రచారం జరిగింది. అయితే అది కూడా జరగలేదు. పీసీసీ పదవి చేపట్టేందుకు జీవన్ రెడ్డి ముందుకు రాలేదని చెబుతున్నారు. దీంతో ఎంపీ రేవంత్ రెడ్డికే పీసీసీ ఖాయమని జోరుగా చర్చ జరిగింది. అయితే త్వరలో నాగార్జున సాగర్ కు ఉప ఎన్నిక ఉండటంతో.. ఆ ఎన్నిక జరిగే వరకు పీసీసీ చీఫ్ ఎంపికను వాయిదా వేయాలని పార్టీ హైకమాండ్ ను కోరారు సీనియర్ నేత జానా రెడ్డి. దీంతో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తర్వాతే పీసీసీ చీఫ్ ప్రకటన ఉంటుందని మాణిక్కం ఠాగూర్ ప్రకటించారు.
 
         నాగార్జున సాగర్ ఎన్నిక తర్వాత పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని ప్రకటిస్తారని ప్రచారం జరుగుతుండగా.. తాజాగా కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఓబీసీ వర్గానికి చెందిన ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీగౌడ్‌ను టీపీసీసీ అధ్యక్షుడిగా నియమించాలని టీపీసీసీ ఓబీసీ సెల్‌ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ మేరకు ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాసినట్లు  టీపీసీసీ ఓబీసీ సెల్‌ అధ్యక్షుడు కత్తి వెంకటస్వామి ప్రకటించారు. దీంతో పీసీసీ రేసులోకి మధుయాష్కి వచ్చినట్లైంది. రాహుల్ గాంధీతో మదుయాష్కికి మంచి సంబంధాలు ఉండటంతో.. ఇప్పుడిది కాంగ్రెస్ లో ప్రాధాన్యత సంతరించుకుంది. 


కాపు వేద‌న‌: జ‌గ‌న్‌కు ఈ కాపు నేత‌లు అక్క‌ర్లేదా... కాపు ఓట్లు అక్క‌ర్లేదా ?

పాపం మోహ‌న్‌బాబు... జ‌గ‌న్‌ను న‌మ్ముకుని ఇలా మిగిలిపోయాడా ?

జగడ్డ : రెండో విడత నామినేషన్లు షురూ.. ఈసారి బాబోరు పక్కా ప్లాన్..?

జగడ్డ: విజయనగరం జిల్లాను తెగ పొగిడేసిన నిమ్మగడ్డ..? ఎందుకంటే..?

బ్రాహ్మణ ఘోష: పురోహితులు, పూజారులకు పెళ్లి కూతుళ్లు దొరకక పోవటానికి కారణాలివే!

బాలకృష్ణ దృష్టిలో పడిన రామ్ చరణ్ సెంటిమెంట్ !

జగడ్డ: 2 రోజుల్లో యాప్ తీసుకొస్తా.. నిమ్మగడ్డ పరోక్ష హెచ్చరిక..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>