PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/achhem-naiduc3a8aaea-6061-4ff1-a94b-c959b4434dbc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/achhem-naiduc3a8aaea-6061-4ff1-a94b-c959b4434dbc-415x250-IndiaHerald.jpgఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని నిమ్మాడలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. సోమవారం అచ్చెన్నాయుడిపై కోటబొమ్మాలి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. వైసీపీ సర్పంచ్‌ అభ్యర్థిని బెదిరించినట్లు అచ్చెన్నాయుడిపై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో అచ్చెన్నాయుడు ఇంటి వద్దకు భారీగా మోహరించిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని కోటబొమ్మాలి పోలీస్‌స్టేషన్‌కు తరలించారుachhem naidu;hari;hari music;srinivas;jagan;atchannaidu kinjarapu;andhra pradesh;mp;smart phone;police;panchayati;village;fort;arrest;letter;tdp;ycp;reddyఅచ్చెన్న అరెస్ట్.. చంద్రబాబు ఉగ్రరూపంఅచ్చెన్న అరెస్ట్.. చంద్రబాబు ఉగ్రరూపంachhem naidu;hari;hari music;srinivas;jagan;atchannaidu kinjarapu;andhra pradesh;mp;smart phone;police;panchayati;village;fort;arrest;letter;tdp;ycp;reddyTue, 02 Feb 2021 09:00:08 GMTఆంధ్రప్రదేశ్ లో  అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య రాజకీయ మంటలు కాక రేపుతున్నాయి. రాష్ట్రంలో మళ్లీ అరెస్టులు మొదలయ్యాయి. ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని నిమ్మాడలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. సోమవారం అచ్చెన్నాయుడిపై కోటబొమ్మాలి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. వైసీపీ సర్పంచ్‌ అభ్యర్థిని బెదిరించినట్లు అచ్చెన్నాయుడిపై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో అచ్చెన్నాయుడు ఇంటి వద్దకు భారీగా మోహరించిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని కోటబొమ్మాలి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అచ్చెన్నాయుడు అరెస్టుతో నిమ్మాడలో  టెన్షన్ వాతావరణం నెలకొంది.

అచ్చెన్నాయుడు , శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు సొంతూరు నిమ్మాడ. ఇది మొదటి నుంచి టీడీపీకి కంచుకోట. అయితే పంచాయతీ ఎన్నికల్లో నిమ్మాడలో వైసీపీ నుంచి పోటీ చేసేందుకు అచ్చెన్న కుటుంబ సభ్యుడైన అప్పన్న సిద్ధమయ్యారు. దీంతో అచ్చెన్న అప్పన్నకు ఫోన్ చేసి నామినేషన్ వేయవద్దని కోరారు. నిమ్మాడలోని టీడీపీ కార్యకర్తలు, అచ్చెన్న అన్న హరి .. వైసీపీ అభ్యర్థిగా అప్పన్నను నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులోనే అచ్చెన్నాయుడిపై కేసు నమోదైంది.

అచ్చెన్నాయుడు అరెస్ట్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఖండించారు. అచ్చెన్నాయుడు అరెస్ట్ జగన్ రెడ్డి కక్ష సాధింపునకు పరాకాష్ట అని మండిపడ్డారు. ఉత్తరాంధ్రపై జగన్ కక్ష కట్టారని... అందుకే భయోత్పాతం సృష్టిస్తున్నారని ఆరోపించారు. నిమ్మాడలో గత 40ఏళ్లలో ఏనాడూ ఇలాంటి ఉద్రిక్తతలు లేవన్నారు.  ప్రశాంత గ్రామంలో ఉద్రిక్తతలు సృష్టించింది ఎవరు..? అని, దువ్వాడ శ్రీనివాస్ స్వగ్రామానికి అచ్చెన్నాయుడు వెళ్లాడా..? అని ప్రశ్నించారు. అచ్చెన్న స్వగ్రామానికి దువ్వాడ వచ్చి ఘర్షణలు రెచ్చగొట్టారా..? అని నిలదిస్తూ, వాటికి సంబంధించి ఫోటోలు, వీడియోలే సాక్ష్యాధారాలని బాబు చెప్పుకొచ్చారు. దువ్వాడ శ్రీనివాస్‌పై కేసు పెట్టకుండా అచ్చెన్నాయుడుపై తప్పుడు కేసు పెట్టడం గర్హనీయమని విమర్శించారు. తక్షణమే అచ్చెన్నాయుడిని బేషరతుగా విడుదల చేయాలని... ఆయనపై పెట్టిన తప్పుడు కేసులు  వెంటనే ఎత్తేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.





జగన్ కు అప్పుల విషయంలో కేంద్రం షాక్...?

పాపం మోహ‌న్‌బాబు... జ‌గ‌న్‌ను న‌మ్ముకుని ఇలా మిగిలిపోయాడా ?

జగడ్డ : రెండో విడత నామినేషన్లు షురూ.. ఈసారి బాబోరు పక్కా ప్లాన్..?

జగడ్డ: విజయనగరం జిల్లాను తెగ పొగిడేసిన నిమ్మగడ్డ..? ఎందుకంటే..?

బ్రాహ్మణ ఘోష: పురోహితులు, పూజారులకు పెళ్లి కూతుళ్లు దొరకక పోవటానికి కారణాలివే!

బాలకృష్ణ దృష్టిలో పడిన రామ్ చరణ్ సెంటిమెంట్ !

జగడ్డ: 2 రోజుల్లో యాప్ తీసుకొస్తా.. నిమ్మగడ్డ పరోక్ష హెచ్చరిక..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>