PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/union-budget-202193a6fbff-7033-4f12-a4c6-32955eb4107d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/union-budget-202193a6fbff-7033-4f12-a4c6-32955eb4107d-415x250-IndiaHerald.jpg కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 గాను బడ్జెట్ ను సోమవారం పార్లమెంట్ లో ప్రవేశ పెట్టారు. దేశం లో కరోనా విజృంభణ తరువాత ప్రవేశ పెట్టిన మొదటి బడ్జెట్ కావడంతో ఆర్ధిక వ్యవస్థను తిరిగి పుంజుకునే విధంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎలాంటి ప్రకటనలు చేస్తారనే దానిపై సర్వత్ర ఆసక్తిగా ఎదురు చూశారు. తీర బడ్జెట్ కేటాయింపులు చేస్తే పెద్దగా మార్పులేమీ చెయ్యకపోగా..సామాన్యుడిపైనే అధనపు భారం వేసింది కేంద్రం. సామాన్యుడికి అవసరమయ్యే పలు రకాల వస్తువులపై టాక్స్ పెంచడమే కాక నిత్యవసర వస్తువులపై కూడా ధunion budget 2021;2020;parliment;minister;letter;central governmentబడ్జెట్ ఎఫెక్ట్ : వీటి సబ్సిడీ పై భారీగా కోత..బడ్జెట్ ఎఫెక్ట్ : వీటి సబ్సిడీ పై భారీగా కోత..union budget 2021;2020;parliment;minister;letter;central governmentTue, 02 Feb 2021 09:00:24 GMT కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 గాను బడ్జెట్ ను సోమవారం పార్లమెంట్ లో ప్రవేశ పెట్టారు. దేశం లో కరోనా విజృంభణ తరువాత ప్రవేశ పెట్టిన మొదటి బడ్జెట్ కావడంతో ఆర్ధిక వ్యవస్థను తిరిగి పుంజుకునే విధంగా ఆర్థిక మంత్రి  నిర్మలా సీతారామన్ ఎలాంటి ప్రకటనలు చేస్తారనే దానిపై సర్వత్ర ఆసక్తిగా ఎదురు చూశారు. తీర బడ్జెట్ కేటాయింపులు చూస్తే  పెద్దగా మార్పులేమీ చెయ్యకపోగా..సామాన్యుడిపైనే అధనపు భారం వేసింది కేంద్రం. సామాన్యుడికి అవసరమయ్యే పలు రకాల వస్తువులపై టాక్స్ పెంచడమే కాక నిత్యవసర వస్తువులపై కూడా ధరలను పెంచనుంట్లు నిర్ణయం తీసుకుంది. 

అంతే కాకుండా కొత్త (2021-22) బడ్జెట్లో ఆహారం, ఎరువులు, ఇంధనాలపై కూడా ప్రభుత్వం తరుపున ఇచ్చే సబ్సిడీలకు గణనీయంగా కోతపెట్టింది. గత బడ్జెట్ లో(2020-21)లో రైతులకు ఎరువులపై ఇచ్చే సబ్సిడీ కొరకు ప్రభుత్వం రూ.1,33,947 కోట్ల మేర ఖర్చు చేయగా, ఈ  కొత్త బడ్జెట్‌లో ఎరువుల సబ్సిడీని ఒక్కసారిగా రూ.79,530 కోట్లకు తగ్గించింది. అంటే 40.62 శాతం మేరకు ఎరువుల సబ్సిడీలో కోత విధించింది కేంద్రం. దీంతో రైతులపై అధనపు భారం పడనుంది. అదేవిధంగా నిరుపేదలకు ఎంతో ముఖ్యమైన ఆహార సబ్సిడీని కూడా తగ్గించింది. 

గత బడ్జెట్ లో ఆహార సబ్సిడీ కొరకు రూ.4,22,618 కోట్లు ఖర్చు చేయగా,  కొత్త ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆహార సబ్సిడీ కింద రూ.2,42,836 కోట్లు మాత్రమే కేటాయించింది. అంటే 42.54 శాతం మేర సబ్సిడీ ఖర్చు ను తగ్గించింది. అదేవిధంగా పెట్రో ఉత్పత్తులపై సబ్సిడీలకు కోత విధించడంతో.. పెట్రోలు, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలు భగ్గుమనే అవకాశం ఉంది. ఇక పెన్షన్లకు ప్రస్తుతం రూ. 2లక్షల కోట్లు ఉండగా కొత్త బడ్జెట్లో దాన్ని రూ.1,89,328 కోట్లకు పరిమితం చేసింది. మొత్తానికి కరోనా మహమ్మారి కారణంగా కుదేలైన ఆర్థిక రంగాన్ని తిరిగి గాడి లో పెట్టేందుకు సామాన్యుడిపై భారం వేసింది కేంద్ర ప్రభుత్వం.


జగన్ కు అప్పుల విషయంలో కేంద్రం షాక్...?

పాపం మోహ‌న్‌బాబు... జ‌గ‌న్‌ను న‌మ్ముకుని ఇలా మిగిలిపోయాడా ?

జగడ్డ : రెండో విడత నామినేషన్లు షురూ.. ఈసారి బాబోరు పక్కా ప్లాన్..?

జగడ్డ: విజయనగరం జిల్లాను తెగ పొగిడేసిన నిమ్మగడ్డ..? ఎందుకంటే..?

బ్రాహ్మణ ఘోష: పురోహితులు, పూజారులకు పెళ్లి కూతుళ్లు దొరకక పోవటానికి కారణాలివే!

బాలకృష్ణ దృష్టిలో పడిన రామ్ చరణ్ సెంటిమెంట్ !

జగడ్డ: 2 రోజుల్లో యాప్ తీసుకొస్తా.. నిమ్మగడ్డ పరోక్ష హెచ్చరిక..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>