SmaranaSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/smarana/137/kalpana-chawlab55d3c9c-6cac-42ac-9e59-1ed545b04249-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/smarana/137/kalpana-chawlab55d3c9c-6cac-42ac-9e59-1ed545b04249-415x250-IndiaHerald.jpgఅంతరిక్షయానం చేసిన తొలి భారతీయ మరియు ఇండో-అమెరికన్ మహిళ వ్యోమగామిగా చరిత్ర సృష్టించిన కల్పనా చావ్లా కొలంబియా స్పేస్ షటిల్ ప్రమాదంలో మరణించి నేటికి సరిగ్గా పదదిహేడేళ్లు.2003 ఫిబ్రవరి 1 న అంతరిక్షం నుంచి తిరిగివస్తూ కొలంబియా నౌక ప్రమాదానికి గురికావడంతో అమెతోపాటు మరో ఆరుగురు వ్యోమగాములు ప్రాణాలు కోల్పోయారు. కల్పనా చావ్లా 1962 మార్చి 17 న హరియాణాలోని కర్నాల్‌లో ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు.భారతదేశం- పాకిస్తాన్ విభజన సమయంలో ముల్తాన్ నుంచి కర్నాల్‌కు వలస వచ్చిన బనారసి లాల్ చావ్లా నలుగురు పిkalpana chawla;women;jeevitha rajaseskhar;vidya;india;pakistan;colombia;american samoa;school;january;history;job;nasa;november;february;woman;march;punjab;yatraమ‌నంద‌రిలో స్ఫూర్తి నింపి నింగికెగిసిన క‌ల్ప‌నా చావ్లా...మ‌నంద‌రిలో స్ఫూర్తి నింపి నింగికెగిసిన క‌ల్ప‌నా చావ్లా...kalpana chawla;women;jeevitha rajaseskhar;vidya;india;pakistan;colombia;american samoa;school;january;history;job;nasa;november;february;woman;march;punjab;yatraMon, 01 Feb 2021 07:19:33 GMT మహిళ వ్యోమగామిగా చరిత్ర సృష్టించిన కల్పనా చావ్లా కొలంబియా స్పేస్ షటిల్ ప్రమాదంలో మరణించి నేటికి సరిగ్గా పదదిహేడేళ్లు.2003 ఫిబ్రవరి 1 న అంతరిక్షం నుంచి తిరిగివస్తూ కొలంబియా నౌక ప్రమాదానికి గురికావడంతో అమెతోపాటు మరో ఆరుగురు వ్యోమగాములు ప్రాణాలు కోల్పోయారు. కల్పనా చావ్లా 1962 మార్చి 17 న హరియాణాలోని కర్నాల్‌లో ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు.భారతదేశం- పాకిస్తాన్ విభజన సమయంలో ముల్తాన్ నుంచి కర్నాల్‌కు వలస వచ్చిన బనారసి లాల్ చావ్లా నలుగురు పిల్లలలో కల్పన చిన్నది. ఇంట్లో ఆమెను ఆప్యాయంగా మోంటో అని పిలిచేవారు.


కర్నాల్‌లో పాఠశాల విద్య పూర్తిచేసింది. అనంతరం పంజాబ్ ఇంజనీరింగ్ కళాశాల నుంచి బీటెక్ పూర్తిచేసింది. అమెరికా వెళ్లి ఏరోస్పేస్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు. అనంతరం పరిశోధనలో నిమగ్నమైంది. అందమైన భవిష్యత్ కోసం కలలు కంటూ గాలిలో మేడలు కట్టకుండా జీవిత లక్ష్యాన్ని సాధించుకున్న మహిళ కల్పనా చావ్లా. చదువులో ఎప్పుడూ ముందు ఉండేది. కల్పనా చావ్లాకు 1991 లో అమెరికా పౌరసత్వం లభించింది. ఈమె నాసాలో ఉద్యోగానికి దరఖాస్తు చేసినపుడు ఈమెతోపాటు 2 వేల మంది పోటీ పడ్డారు. అయితే ఈమె మాత్రమే నాసా శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. 1997 లో ఆమె నాసా స్పెషల్ షటిల్ ప్రోగ్రాంలో అంతరిక్షంలోకి వెళ్ళడానికి ఎంపికైంది. మొదటి అంతరిక్ష మిషన్ 1997 నవంబర్ 19 న ప్రారంభమైంది.


ఆ సమయంలో కల్పన వయసు 35 సంవత్సరాలు. కల్పనా చావ్లా అంతరిక్ష యానం చేసిన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. అప్పుడీమే 376 గంటల పాటు అంతరిక్షంలో గడిపారు. భూమి చుట్టూ 252 సార్లు పరిభ్రమించి 6.5 మిలియన్ మైళ్ళు అంతరిక్ష యానం చేశారు. 2003, జనవరి 16 న రెండోసారి అంతరిక్షం లోకి వెళ్ళే ముందు కల్పనా చావ్లా మీడియాతో మాట్లాడారు. "భారతదేశంలో మొట్టమొదటి విమానాన్ని నడిపిన జేఆర్‌డీ టాటాయే నాకు స్ఫూర్తి, అందుకనే ఏరోనాటిక్స్ ఇంజనీరింగ్ ను కెరీర్‌గా తీసుకున్నా" అని చెప్పారు. భారత మహిళలకు మీరిచ్చే సందేశమేమిటని అడిగితే.. "ఏదో ఒకటి చేయండి. కానీ, దాన్ని మీరు మనస్ఫుర్తిగా చేయాలనుకోవాలి. ఎందుకంటే ఏదైనా పనిని కేవలం ఒక లక్ష్యం కోసం చేయడం కాక, దానిలో లీనమై అనుభవించాలి. అలా అనుభవించలేని వారు తమకు తాము వంచించుకున్నాట్లే" అని చెప్పారు. 2003 సంవత్సరం కల్పనా చావ్లకు చివరి అంతరిక్ష యాత్ర అని ఎవరూ అనుకోలేదు.  


అందుకే రణవీర్ ను పెళ్లి చేసుకున్న.. అసలు కారణం చెప్పిన దీపికా పదుకొనె?

కేంద్ర బడ్జెట్: కొవిడ్ పన్ను మోత మోగిపోద్ది.. కానీ..!

బడ్జెట్‌: ఓవైపు చైనాతో యుద్ధం.. నిర్మలమ్మ ఏం చేస్తారో..?

బడ్జెట్‌: మీరు తప్పక తెలుసుకోవాల్సిన బడ్జెట్‌ విశేషాలు ఇవే..!

బడ్జెట్‌: దేశ ప్రజలకు కరోనా వాత తప్పదా..?

జగడ్డ: ఏపీలో తొలిదశ 93 పంచాయతీలు ఏకగ్రీవం..

హెరాల్డ్ సెటైర్ : ఇంట్లో కూర్చుని ఇంత పని చేస్తున్నాడా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>