EditorialVijayaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/government-and-nimmagadda-playing-cards-very-wisely1b737e65-d64c-42b1-a805-8067715ca295-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/government-and-nimmagadda-playing-cards-very-wisely1b737e65-d64c-42b1-a805-8067715ca295-415x250-IndiaHerald.jpgఎన్నికల్లో మెజారిటి ఏకగ్రీవాలు చేసుకుని తన సత్తా చాటుకునేందుకు అధికారపార్టీ వ్యూహాలు పన్నుతోంది. ఏకగ్రీవాలు కాకుండ నామినేషన్లు వేయించి ఎన్నికలు జరిగేట్లు చూడాలన్నది నిమ్మగడ్డ ప్రయత్నం. అయితే తన ప్రయత్నంలో ఎంతవరకు సక్సెస్ అవుతారో తెలీదు. ఎందుకంటే స్ధానికసంస్ధల ఎన్నికలంటేనే అధికారపార్టీకి అడ్వాంటేజ్ ఉంటుందని అందరికీ తెలిసిందే. పైగా ప్రస్తుతం ప్రతిపక్షాలు చాలా బలహీనంగా ఉన్నాయి. మెజారటి మీడియా మద్దతున్న కారణంగా చంద్రబాబునాయుడు, టీడీపీ నేతల బాగా కవరేజి వస్తోందంతే. ఎల్లోమీడియా వ్యవహారం ఎలాగుందంటే జగన్jagan nimmagadda ycp election commission naidu tdp;view;cbn;kumaar;hyderabad;korcha;n. chandrababu naidu;geum;district;kadapa;media;tdp;success;central government;ycp;mantraహెరాల్డ్ ఎడిటోరియల్ : ప్రభుత్వం-నిమ్మగడ్డ ఎత్తుకు పై ఎత్తుహెరాల్డ్ ఎడిటోరియల్ : ప్రభుత్వం-నిమ్మగడ్డ ఎత్తుకు పై ఎత్తుjagan nimmagadda ycp election commission naidu tdp;view;cbn;kumaar;hyderabad;korcha;n. chandrababu naidu;geum;district;kadapa;media;tdp;success;central government;ycp;mantraMon, 01 Feb 2021 05:00:00 GMTపంచాయితి ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం, స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మధ్య ఆధిపత్య పోరు పెరిగిపోతోంది. ప్రభుత్వ ఇమేజిని దెబ్బకొట్టాలని నిమ్మగడ్డ ప్రయత్నిస్తున్నట్లు, చంద్రబాబునాయుడుతో కలిసి కుట్రలు చేస్తున్నట్లు మంత్రులు ఆరోపిస్తున్న విషయం తిలిసిందే. ఇదే సమయంలో రాజ్యాంగబద్ద సంస్ధ అయిన ఎన్నికల కమీషన్ను ప్రభుత్వం గౌరవించి తీరాల్సిందే అని, కమీషన్ నిర్ణయమే ఫైనల్ అని మాటకు ముందోసారి నిమ్మగడ్డ వార్నింగులిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే శుక్రవారం నుండి మొదలైన నామినేషన్ల పర్వంలో ఏకగ్రీవాలను అడ్డుకునేందుకు నిమ్మగడ్డ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడే ప్రభుత్వం, నిమ్మగడ్డ ఒకరిపై మరొకరు పై చేయి సాధించేందుకు ఎత్తులు పై ఎత్తులు వేసకుంటున్నారు.




ఎన్నికల్లో మెజారిటి ఏకగ్రీవాలు చేసుకుని తన సత్తా చాటుకునేందుకు అధికారపార్టీ వ్యూహాలు పన్నుతోంది. ఏకగ్రీవాలు కాకుండ నామినేషన్లు వేయించి ఎన్నికలు జరిగేట్లు చూడాలన్నది నిమ్మగడ్డ ప్రయత్నం. అయితే తన ప్రయత్నంలో ఎంతవరకు సక్సెస్ అవుతారో తెలీదు. ఎందుకంటే స్ధానికసంస్ధల ఎన్నికలంటేనే అధికారపార్టీకి అడ్వాంటేజ్ ఉంటుందని అందరికీ తెలిసిందే. పైగా ప్రస్తుతం ప్రతిపక్షాలు చాలా బలహీనంగా ఉన్నాయి. మెజారటి మీడియా మద్దతున్న కారణంగా చంద్రబాబునాయుడు, టీడీపీ నేతల బాగా కవరేజి వస్తోందంతే. ఎల్లోమీడియా వ్యవహారం ఎలాగుందంటే జగన్మోహన్ రెడ్డిని ఎవరు వ్యతిరేకించినా వాళ్ళందరినీ బాగా హైలైట్ చేస్తోంది.





అంటే ప్రతిపక్ష నేతల బలమంతా కేవలం మీడియా మాత్రమే అని అర్ధమైపోతోంది. కానీ వైసీపీ బలం అలాకాదు. జిల్లా కేంద్రం నుండి పంచాయితీల వరకు వాళ్ళదే హవా. మరి ఈ నేపధ్యంలో చంద్రబాబు అయినా నిమ్మగడ్డ అయినా చేయగలిగేది ఏమీ లేదనే చెప్పాలి. ఏదో రూపంలో గ్రామస్ధాయిలో అధికారపార్టీ నేతలు తమ మాటే చెల్లుబాటయ్యేట్లు చేసుకుంటారు. కాబట్టి మెజారిటి పంచాయితీల్లో ఏకగ్రీవాలు అయ్యేందుకే అవకాశాలున్నాయి. చంద్రబాబు హైదరాబాద్ లోని తనింట్లో కూర్చుని వైసీపీ అరాచకాలపై పోరాటాలు చేయండంటే వీపులు పగల గొట్టించుకునేందుకు ఎవరు సిద్దంగాలేరు. ఇదే సమయంలో నిమ్మగడ్డ కూడా శుక్ర, శనివారాలు అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఏకగ్రీవాలు కాకుండా ఎన్నికలు జరిపేట్లుగా అధికారులకు కమీషనర్ ఆదేశాలు ఇస్తున్నారు. అయితే నిమ్మగడ్డ ఆదేశాలను పట్టించుకునే వారెంతమంది ? మరి ఎత్తుకు పై ఎత్తు గేమ్ లో చివరకు ఎవరిది పై చేయవుతుందో చూడాల్సిందే.




అమ్మాయి గారు అదరగొట్టింది.. టాలీవుడ్ లో మరో లక్కీ హీరోయిన్..!

‘పుష్ప’లో ఒక్కరు కాదు.. ఇద్దరా..? పోస్టర్ చూసి గుర్తు పట్టేయొచ్చా..?

బిజెపిలోకి టీడీపీ అగ్ర నేత జంప్...?

కొత్త రికార్డు దిశగా మెగా ఫ్యామిలీ...?

జగడ్డ: నిమ్మగడ్డకు ఓటు వేసే అదృష్టం దక్కేనా...?

బ్రాహ్మణ ఘోష : బ్రాహ్మణులకు జగనోరు చేదోడుగా ఉన్నారా ..??

కార్తీక దీపం సీరియల్ లో వంటలక్క కూతురు హిమ బయట ఎంత అందంగా ఉందో మీరే చూడండి..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>