PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-stays-in-hyderabad-for-another-yeara93d14f3-7176-4e9f-a8f4-bc9892d2f95e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-stays-in-hyderabad-for-another-yeara93d14f3-7176-4e9f-a8f4-bc9892d2f95e-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో అధికార పార్టీ నేతలు అనుసరిస్తున్న వైఖరిపై చాలా సీరియస్ గా ఉంది తెలుగుదేశం పార్టీ. కొందరు టీడీపీ నేతల మీద దాడులకు కూడా అధికార పార్టీ నేతలు దిగుతున్నారు. ఇక ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఎన్నికల సంఘం అదనపు డిజి సంజయ్ కు, విశాఖ డిఐజి రంగారావుకు చంద్రబాబు ఫోన్ చేసారు. నిమ్మాడలో దువ్వాడ శ్రీనివాస్ ఉద్రిక్తతలు రెచ్చగొట్టడంపై చంద్రబాబు ఫిర్యాదు చేసారు. నిమ్మాడలో దువ్వాడ కుట్ర రాజకీయాలను పోలీసు అధికారుల దృషchandrababu;srinivas;telugu desam party;ram mohan naidu kinjarapu;andhra pradesh;mp;district;telugu;smart phone;vishakapatnam;village;fort;tdp;local language;ycp;partyపోలీసు అధికారికి చంద్రబాబు ఫోన్... ఎందుకు...?పోలీసు అధికారికి చంద్రబాబు ఫోన్... ఎందుకు...?chandrababu;srinivas;telugu desam party;ram mohan naidu kinjarapu;andhra pradesh;mp;district;telugu;smart phone;vishakapatnam;village;fort;tdp;local language;ycp;partyMon, 01 Feb 2021 10:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో అధికార పార్టీ నేతలు అనుసరిస్తున్న వైఖరిపై చాలా సీరియస్ గా ఉంది తెలుగుదేశం పార్టీ. కొందరు టీడీపీ నేతల మీద దాడులకు కూడా అధికార పార్టీ నేతలు దిగుతున్నారు. ఇక ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఎన్నికల సంఘం అదనపు డిజి సంజయ్ కు, విశాఖ డిఐజి రంగారావుకు చంద్రబాబు ఫోన్  చేసారు. నిమ్మాడలో దువ్వాడ శ్రీనివాస్ ఉద్రిక్తతలు రెచ్చగొట్టడంపై చంద్రబాబు ఫిర్యాదు చేసారు.

నిమ్మాడలో దువ్వాడ కుట్ర రాజకీయాలను పోలీసు అధికారుల దృష్టికి తెచ్చిన చంద్రబాబు... చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. పెరియంబాడిలో ఎమ్మెల్సీ దొరబాబు వాహనం ధ్వంసంపై సంజయ్ కు చంద్రబాబు ఫిర్యాదు  చేసారు. ప్రశాంతమైన గ్రామాల్లో వైసిపి దౌర్జన్యకాండపై ధ్వజమెత్తిన చంద్రబాబు... వైసిపి నాయకుల అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని అధికారులకు విజ్ఞప్తి చేసారు. మాజీ కేంద్రమంత్రి ఎర్రన్నాయుడు, ఏపి టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం ఎంపి రామ్మోహన్ నాయుడుల స్వగ్రామం నిమ్మాడ టిడిపికి కంచుకోట అని ఆయన అన్నారు.

 అలాంటి ప్రశాంతమైన గ్రామంలో వైసిపి నాయకుడు దువ్వాడ శ్రీనివాస్ గొడవలు సృష్టించి రాజకీయ లబ్ది పొందాలని  చూడటం హేయం అని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.  పంచాయితీ ఎన్నికల్లో వైసిపి చేస్తున్న హింసా కాండపై ఉదాసీనంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని అన్నారు.  తక్షణమే జోక్యం చేసుకుని నిమ్మాడలో ప్రశాంతత కాపాడాలని చంద్రబాబు విజ్ఞప్తి చేసారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం పెరియంబాడిలో టిడిపి ఎమ్మెల్సీ దొరబాబు వాహనం ధ్వంసం చేయడాన్ని, గ్రామంలో టిడిపి శిబిరంపై దాడి చేయడాన్ని, నిమ్మాడలో ఉద్రిక్తతలు రెచ్చగొట్టడంపై అదనపు డిజి సంజయ్ దృష్టికి తీసుకెళ్లారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, పెరియంబాడిలో ప్రశాంత పరిస్థితులు నెలకొనేలా చూడాలని చంద్రబాబు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.


పెద్దలకు మాత్రమే: "తారా శశాంకం" గ్రంధంలోని ఒక పద్యంలో ప్రవహించిన శృంగార రసవాహిని

ఆర్ ఆర్ ఆర్ ను వదిలిపెట్టని అలనాటి రాజమౌళి శ్రీదేవిల రగడ !

టీచర్ల వెతలు: అయ్యో.. కూలీ పనులు చేసుకుంటున్న పంతుళ్లు..!

జగడ్డ: మహిళా ఎమ్మార్వోకి షాకిచ్చిన నిమ్మగడ్డ

వైసీపీలో పంచాయితీలే.. ఈ నేత‌ల‌తో జ‌గ‌న్ నిండా మునిగిన‌ట్టే ?

యూనియన్ బడ్జెట్ 2021: నిర్మలాజి ఏ విధంగా ‘చూమంతర్ బడ్జెట్’ చేస్తుందో మరి!

ఆ మంత్రికి చుక్క‌లు చూపిస్తున్న కేడ‌ర్‌... అద‌ను చూసి దెబ్బ‌కొట్టిందే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>