Politicsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/union-budget-202146ddaecd-8835-4e6a-a0f8-53a027fe75a5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/union-budget-202146ddaecd-8835-4e6a-a0f8-53a027fe75a5-415x250-IndiaHerald.jpgకరోనా నేపథ్యంలో ప్రవేశ పెడుతున్న బడ్జెట్ కావడంతో 2021బడ్జెట్‌కు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. కోవిడ్ మహమ్మారి కారణంగా కుదేలైన విద్యా, వైద్య, వ్యాపార, ఆరోగ్య రంగాలకు ఈ బడ్జెట్ ఏ స్థాయిలో ఊతమిస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ 2021 బడ్జెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే..union budget 2021;koti;amala akkineni;nidhi;poorna;rakshita;vidya;delhi;india;electricity;king;cabinet;hindustan petroleum corporation limited;minister;chennai;aqua;king 1;silver;letter;banking;central government;juneబడ్జెట్ 2021లో కీలక అంశాలివే.. మిస్ కాకండి..బడ్జెట్ 2021లో కీలక అంశాలివే.. మిస్ కాకండి..union budget 2021;koti;amala akkineni;nidhi;poorna;rakshita;vidya;delhi;india;electricity;king;cabinet;hindustan petroleum corporation limited;minister;chennai;aqua;king 1;silver;letter;banking;central government;juneMon, 01 Feb 2021 14:29:15 GMTన్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో ప్రవేశ పెడుతున్న బడ్జెట్ కావడంతో 2021బడ్జెట్‌కు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. కోవిడ్ మహమ్మారి కారణంగా కుదేలైన విద్యా, వైద్య, వ్యాపార, ఆరోగ్య రంగాలకు ఈ బడ్జెట్ ఏ స్థాయిలో ఊతమిస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ 2021 బడ్జెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఈ బడ్జెట్‌‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లోని కీలక అంశాలను వివరించారు. వివిధ రంగాలపై చేసిన కేటాయింపులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

ఎప్పటిలా కాకుండా ఈ సారి పేపర్ లెస్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మేడిన్ ఇండియా ట్యాబ్‌లో నిర్మ‌ల బ‌డ్జెట్‌ ప్రవేశపెట్టారు. బాహీ ఖాతా(ఎర్రటి బ్యాగు)లో బడ్జెట్‌‌ వివరాలను పొందుపరిచిన మేడ్ ఇండియా ట్యాబ్‌ను ఆమె తీసుకొచ్చారు. తొలుత రాష్ట్రపతిని కలిసి, అనంతరం క్యాబినెట్ మీటింగ్‌లో పాల్గొన్నారు. అక్కడ బడ్జెట్‌పై ఆమెదం లభించిన తరువాత లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

కేంద్ర బడ్జెట్ -2021లో కీలక అంశాలివే.. (ఆర్థిక మంత్రి మాటల్లో..)

* బ‌డ్జెట్ 2021లో ప్రత్యేకంగా 6 మూల స్తంభాల‌ున్నాయి. ఇందులో ప్రధానమైనది ఆరోగ్యం, సంర‌క్ష‌ణ కాగా.. రెండోది ఫిజిక‌ల్‌, ఫైనాన్షియ‌ల్ క్యాపిట‌ల్ అండ్ ఇన్‌ఫ్రా విభాగాలు. మూడోది స‌మ్మిళిత వృద్ధి విధానం. నాలుగోది వ్యక్తిగత మూలధనం. ఐదోది ఇన్నోవేష‌న్ అండ్ రీసెర్చ్ & డెవ‌ల‌ప్‌మెంట్, ఆరోది క‌నిష్ఠ‌ ప్ర‌భుత్వం, గ‌రిష్ఠ పాల‌న విధానం. ఈ ఆరు మూల స్తంభాల‌పైనే బడ్జెట్‌ను రూపొందించాం.

*  వైద్య ఆరోగ్య రంగ్య, బ్యాంకింగ్ రంగాలకు బడ్జెట్‌లో భారీ కేటాయింపులు చేస్తున్నాం. ఆరోగ్య రంగంలో రూ.64,180 కోట్ల‌తో ప్ర‌త్యేక నిధిని ఏర్పాటు చేశాం. వ్యాధుల నివార‌ణ‌, చికిత్స‌, సంపూర్ణ ఆరోగ్య విధానంలో ప్రత్యేక ప‌థ‌కాన్ని ప్రవేశపెట్టనున్నాం. కొత్త‌గా 9 బీఎస్ఎల్ -3 స్థాయి ప్ర‌యోగ‌శాల‌లు ఏర్పాటు చేయనున్నాం. అలాగే 15 అత్య‌వ‌స‌ర ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నాం.

*  ఇక కరోనా నేపథ్యంలో ప్ర‌పంచ దేశాల‌కు భార‌త్ ఓ ఆశాకిర‌ణంగా మారింది. ఇప్పటికే దాదాపు 100 దేశాల‌కు క‌రోనా టీకాను స‌ర‌ఫ‌రా చేస్తున్నాం. కొవిడ్ నివార‌ణ‌లో ప్రపంచానికే మార్గదర్శకంగా మారుతున్నాం. భార‌త్‌లో రెండు వ్యాక్సిన్లు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. మ‌రో రెండు కొత్త వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ కోసం రూ.35 వేల కోట్లు ఖర్చు చేయనున్నాం.

*  ఆత్మనిర్భర్‌ భారత్‌లో రూ.21.17 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నాం. ఈదేశం మూలాల్లోనే ఆత్మనిర్భర్‌ భావం ఉంది. ఆరోగ్యవంతమైన భారతదేశం కోసం కృష్టి చేస్తాం. ఆరోగ్య రంగంలో రూ.64,180 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నాం. రూ.64,180 కోట్లతో పీఎం ఆత్మనిర్భర ఆరోగ్య పథకం తీసుకురానున్నాం. నివారణ, చిక్సిత, సంపూర్ణ ఆరోగ్య విధానంలో పథకం ఉండనుంది.

*  అలాగే కరోనా వల్ల భారీగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజం చేయడానికి అవ‌స‌ర‌మైన చ‌ర్య‌ల‌న్నీ ఈ బ‌డ్జెట్‌లో తీసుకున్నాం. ఆత్మనిర్భ‌ర్ భార‌త్ ఆద‌ర్శం కొత్త‌ది కాదు. ఈ దేశం మూలాల్లోనే ఆత్మ‌నిర్భ‌ర్ భావం ఉంది

*  రైల్వే రంగానికి రూ.1.15 ల‌క్ష‌ల కోట్లు కేటాయిస్తున్నాం. మెట్రో లైట్‌, మెట్రో న్యూ పేరుతో కొత్త ప్రాజెక్టులను సిద్ధం చేయబోతున్నాం. అందులో భాగంగా బెంగ‌ళూరు మెట్రో  విస్త‌ర‌ణ‌కు రూ.14,700 కోట్లు, చెన్నై మెట్రో విస్త‌ర‌ణ‌కు రూ.63 వేల కోట్లు కేటాయింపులు చేస్తున్నాం. అలాగే నాగ్‌పూర్ మెట్రోల అభివృద్ధికి, రెండో దశ కేటాయింపులు చేస్తున్నాం.
వీటితో పాటు నాసిక్‌లో కొత్త కారిడార్ ఏర్పాటుకూ కేటాయింపులు చేశాం.

*  దేశంలోని నగర ప్రాంతాలన్నింటికీ రక్షిత మంచినీటిని సరఫరా చేసేందుకు ప్ర‌ధాని జ‌ల్‌జీవ‌న్ మిష‌న్ అర్బ‌న్‌‌ను ప్రారంభిస్తున్నాం. దాని కోసం రూ.87 వేల కోట్లు కేటాయించాం.

*  రూ.87 వేల కోట్ల‌తో 500 న‌గ‌రాల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. దానితో పాటు ఘ‌న వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ కోసం స్వ‌చ్ఛ‌భార‌త్ అర్బ‌న్‌ పథకాన్ని ప్రారంభించబోతున్నాం. దాని కోసం ఐదేళ్ల‌లో రూ. 1,41,670 కోట్లు కేటాయిస్తున్నాం.

*  జాతీయ ర‌హ‌దారుల అభివృద్ధికి ప్రత్యేకంగా కేటాయింపులు చేశాం. అందులో భాగంగా 5 ప్ర‌త్యేక జాతీయ ర‌హ‌దారులను అభివృద్ధి చేసేందుకు రూ.5 వేల కోట్ల నిధులు కేటాయించాం. 11 వేల కిలోమీట‌ర్ల జాతీయ ర‌హ‌దారుల కారిడార్ నిర్మాణం చేపట్టనున్నాం. ప్రధానంగా అసోం, కేర‌ళ‌, బెంగాల్‌ రాష్ట్రాల్లో జాతీయ ర‌హ‌దారుల అభివృద్ధి ప్రత్యేక దృష్టి సారించాం. బెంగాల్‌లో 675 కిలోమీట‌ర్ల మేర జాతీయ ర‌హ‌దారుల అభివృద్ధి చేయనున్నాం.

*  దేశంలో విద్యుత్ రంగ అభివృద్ధికి గతేడాదితో పోల్చితే భారీ కేటాయింపులు చేశాం. ఈ ఏడాది బడ్జెట్‌లో ఏకంగా విద్యుత్ రంగానికి రూ.3.05 ల‌క్ష‌ల కోట్లు కేటాయిస్తున్నాం.
పీపీఏ ప‌ద్ధ‌తి ద్వారా రూ.2,200 కోట్ల‌తో 7 కొత్త ప్రాజెక్టులు ప్రారంభించబోతున్నాం. ఇక విద్యుత్ రంగంలోనే భాగమైన సౌరశ‌క్తి రంగానికి మ‌రో రూ.1000 కోట్లు కేటాయింపులు చేశాం. ఇక జ‌మ్మూక‌శ్మీర్‌ ప్రజలకు కూడా వంట గ్యాస్ అందించేందుకు సరికొత్తగా గ్యాస్ పైప్‌లైన్ ఏర్పాటు చేయబోతున్నాం.

*  న‌గ‌రాల్లో ఇంటింటికి వంట‌ గ్యాస్ స‌ర‌ఫ‌రా చేసే ఉజ్వ‌ల ప‌థ‌కాన్ని మరింత విస్తృతం చేయనున్నాం. మ‌రో కోటి మంది ల‌బ్ధిదారుల‌కు దీనిని చేర్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నాం. కొత్త‌గా మ‌రో 100 జిల్లాల్లోని న‌గ‌రాల‌కు సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూష‌న్ నెట్‌వ‌ర్క్‌ను సిద్ధం చేయబోతున్నాం.

*  ఇక పేదలకు సొంతిల్లు అందించేందుకు ఏర్పాటు చేసిన ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌నను మ‌రో ఏడాది పొడిగించనున్నాం. దీంతో పాటు మధ్యతరగతి వారికి కూడా సొంతింటి కల నెరవేరేటా అందుబాటు ధ‌ర‌ల గృహ‌రుణాల రాయితీ ప‌థకాన్ని కూడా మ‌రో ఏడాది పొడిగిస్తున్నాం. వీటితో పాటు అందుబాటు ధ‌ర‌ల్లో గృహాలను నిర్మించే సంస్థ‌ల‌కు కూడా మ‌రో ఏడాది పాటు పన్ను విరామం ప్రకటిస్తున్నాం.

*  దేశ వ్యాప్తంగా సరుకు రవాణాను సులభతరం చేయడం కోసం ప్ర‌త్యేక స‌రుకు ర‌వాణా కారిడార్లు ఏర్పాటు చేయనున్నాం. 2022 జూన్ నాటికి తూర్పు, ప‌శ్చిమ ప్ర‌త్యేక స‌రుకు ర‌వాణా కారిడార్లు పూర్తి చేసేలా ప్రణాళికలు రచించాం. ఖ‌ర‌గ్‌పూర్ - విజ‌య‌వాడ మ‌ధ్య ఈస్ట్ - కోస్ట్ స‌ర‌కు ర‌వాణా కారిడార్‌‌ను ఏర్పాటు చేస్తున్నాం.

*  ఇప్పటివరకు అమలులో ఉన్న 1938 బీమా చ‌ట్టానికి స‌వ‌ర‌ణ‌ చేసేందుకూ సిద్ధమవుతున్నాం. బీమా కంపెనీల్లో ఎఫ్‌డీఐల ప‌రిమితి 49 నుంచి 74 శాతానికి పెంచేలా ఈ సవరణ ఉంటుంది.

*  దేశంలోని వాహ‌నాల ఫిట్‌నెస్ ప‌రీక్ష‌కు ప్ర‌త్యేక విధానం తీసుకొస్తున్నాం. వ్య‌క్తిగ‌త వాహ‌నాల‌కు 20 ఏళ్లు, వాణిజ్య వాహ‌నాల‌కు 15 ఏళ్లు మాత్రమే కాలపరిమితి ఉండేలా ప్రత్యేక విధానం అమలు చేయబోతున్నాం.  కాల‌ప‌రిమితి ముగిసిన త‌ర్వాత ఫిట్‌నెస్ ప‌రీక్ష‌కు వెళ్లాల‌ని నిబంధ‌న‌ తీసుకొస్తున్నాం. తుక్కు వాహ‌నాల ర‌ద్దు, అధునాత‌న వాహ‌నాల వినియోగంపై కూడా ప్రత్యేక పద్ధతి తీసుకొస్తున్నాం. 15 ఏళ్లు దాటిన వాణిజ్య వాహ‌నాల‌ను తుక్కు కింద మార్చే ప‌థ‌కం తీసుకురాబోతున్నాం.

*  ఇప్పటికే క‌రోనా స‌మ‌యంలో రూ.27.1 ల‌క్ష‌ల కోట్ల‌తో ప్యాకేజీలు ప్ర‌క‌టించాం. ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను కాపాడి సంస్క‌ర‌ణ‌ల‌కు ఊత‌మిచ్చేందుకు ఈ ప్యాకేజీలు ఎంతో ఉపయోగపడతాయి. 13 రంగాల్లో పీఎల్ఐ ప్రోత్సాహ‌కాల కోసం ప్రత్యేక ఖ‌ర్చుకు నిర్ణ‌యం తీసుకున్నాం. రానున్న మూడేళ్ల‌లో 7 టెక్స్‌టైల్స్ పార్కుల ఏర్పాటుకు రంగం సిద్ధం చేశాం.

*  ప‌లు సంస్థ‌ల్లో పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ‌కు నిర్ణ‌యం తీసుకున్నాం. ప్రధానంగా గెయిల్‌, ఐఓసీ, హెచ్‌పీసీఎల్ పైపులైన్ల‌లో పెట్టుబ‌డుల ఉప‌సంహ‌రించనున్నాం. జాతీయ స్థాయిలో పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణను ప‌ర్య‌వేక్ష‌ించేందుకు ప్ర‌త్యేక డ్యాష్ బోర్డు ఏర్పాటు చేయబోతున్నాం. రాష్ర్టాలు, స్వ‌యం ప్ర‌తిప‌త్తి వ్య‌వ‌స్థ‌ల మూల‌ధ‌న వ్య‌యం కోసం రూ.2 ల‌క్ష‌ల కోట్లు సిద్ధం చేస్తున్నాం.

*  దేశంలో ఇన్నోవేషన్ రంగాన్ని, టెక్నాలజీని అభివృద్ధి పరిచేందుకు స్టార్ట‌ప్‌ల‌కు చేయూతనివ్వనున్నాం. దీనికోసం ఏక‌స‌భ్య కంపెనీల‌కు మ‌రింత ఊతం ఇవ్వనున్నాం. కంపెనీలు ఒక వ్యాపారం నుంచి మ‌రో వ్యాపారానికి మారే స‌మ‌యం 180 నుంచి 120 రోజుల‌కు కుదిస్తున్నాం.

*  స్వ‌చ్ఛంద సంస్థ‌ల భాగ‌స్వామ్యంతో మ‌రో 100 సైనిక పాఠ‌శాల‌లు ఏర్పాటు చేయబోతున్నాం. వాటితో పాటు ఎస్‌సీ విద్యార్థుల కోసం కొత్త‌గా 750 ఏక‌ల‌వ్య పాఠ‌శాల‌లు ఏర్పాటు చేయబోతున్నాం.

*  75 ఏళ్లు పైబ‌డిన వ్య‌క్తులు ఐటీ రిట‌ర్న్స్ దాఖ‌లు చేయాల్సిన అవ‌స‌రం లేకుండా చర్యలు తీసుకోబోతున్నాం. పింఛ‌ను, వ‌డ్డీ ఆదాయం ఆధారంగా ఐటీ మిన‌హాయింపు లభిస్తుంది. ప‌న్ను వివాదాల నివార‌ణ‌కు వివాద ప‌రిష్కార క‌మిటీని కూడా ఏర్పాటు చేస్తున్నాం. రూ.50 ల‌క్ష‌ల లోపు ఆదాయం, రూ.10 ల‌క్ష‌ల లోపు వివాదాలు ఉన్న‌వారు నేరుగా క‌మిటీకి అప్పీల్ చేసే అవ‌కాశాన్నీ కల్పిస్తున్నాం.

*  ఇక వీటితో పాటు డిజిట‌ల్ చెల్లింపుల ప్రోత్సాహానికి రూ.1500 కోట్లు కేటాయించాం.

*  వ్యవసాయ రుణాలకు, సాగు అభివృద్ధికి కూడా భారీ కేటాయింపులు చేస్తున్నాం. వాయుకాలుష్య నివారణకు రూ.2,217 కోట్లు కేటాయించినట్టు తెలిపారు.

*  స్వచ్ఛభారత్ 2.0కు లక్షా 40 వేల కోట్లు కేటాయించాం. వ్యవసాయ రుణాలకు రూ.16.5 లక్షల కోట్లు కేటాయింపులు చేశాం. చిన్న మద్యతరహా పరిశ్రమలకు రూ.15,700 కోట్ల నిధులు కేటాయించాం. సిల్క్ డెవలప్‌మెంట్‌కు రూ.3 వేల కోట్లు కేటాయించాం.

*  ప్రస్తుతం పరిస్థితుల్లో దేశం త్వరితగతిన రూ.5 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్ల ఆర్థిక వ్య‌వ‌స్థగా అవతరించాలంటే రెండంకెల వృద్ధి త‌ప్ప‌నిస‌రి. దానికి అనుగుణంగానే బడ్జెట్ రూపొందించాం.

ఇదిలా ఉంటే తాజా బడ్జెట్ కారణంగా స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లాయి. సెన్సెక్స్ ఏకంగా 1800 పాయింట్ల మేర వృద్ధి సాధించింది.

తగ్గేవి ఇవే..
బంగారం, వెండి ధ‌ర‌లు
నైలాన్ దుస్తుల ధ‌ర‌లు

పెరిగేవి ఇవే..
కార్ల విడిభాగాల ధ‌ర‌లు
మొబైల్ ఫోన్ల ధరలు
ఇంపోర్టెడ్ దుస్తులు


బడ్జెట్ 2021 : అన్నదాతలకు అండగా...16.50 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు !!

బడ్జెట్ 2021 : ఆ వాహనాలపై ఉక్కుపాదం..త్వరలో కొత్త విధానాలు !!

స్థానిక ఎన్నిక‌ల సాక్షిగా ప‌రిటాల సునీత‌కు షాక్‌... శ్రీరామ్ వ‌ల్లేగా ?

కేవీపీ బామ్మ‌ర్ది రివేంజ్ మామూలుగా ఉండ‌దా ?

జగడ్డ: నెల్లూరు జిల్లాలో అధికారుల బాధ్యతా రాహిత్యం..

జగడ్డ:నిమ్మగడ్డ సారూ...ఆ గ్రామంలో 2006 తరువాత స్థానిక ఎన్నికలు జరగలేదు...కారణం ఏమిటో?

కాపు వేద‌న‌: యేడాదికి రు. 2 వేల కోట్లు ఎక్క‌డ‌... జ‌గ‌న్‌కు కాపుల దెబ్బ త‌ప్ప‌దా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>