MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anshu93500409-0c2f-469d-8f35-be08e7e1bbfe-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anshu93500409-0c2f-469d-8f35-be08e7e1bbfe-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఆడియన్స్ కడుపారా విందు భోజనం అయినా కనులారా సినిమా విందు అయినా కూడా ఫుల్ గానే ఉండాలి. ఎక్కడా తేడా పాడా రాకూడదు. అరకొరగా వడ్డిస్తే అబ్బే బాలేదు అని పక్కన పెట్టేస్తారు. తెలుగు ఆడియన్స్ టేస్ట్ ని బట్టే ఫిల్మ్ మేకర్స్ కూడా అన్ని రకాలుగా బడ్జెట్ ని రెడీ చేసుకుని పెట్టుకుని మరీ నవరసాలకు ప్రాణం పోస్తున్నారు. anshu;beauty;ntr;nagarjuna akkineni;jr ntr;prema;raasi;srinivas;trivikram srinivas;tollywood;cinema;love;audience;hero;heroine;v;massజూనియర్ మూవీలో మన్మధుడి బ్యూటీ...?జూనియర్ మూవీలో మన్మధుడి బ్యూటీ...?anshu;beauty;ntr;nagarjuna akkineni;jr ntr;prema;raasi;srinivas;trivikram srinivas;tollywood;cinema;love;audience;hero;heroine;v;massMon, 01 Feb 2021 19:30:00 GMTటాలీవుడ్ ఆడియన్స్ కడుపారా విందు భోజనం అయినా కనులారా  సినిమా విందు అయినా కూడా ఫుల్ గానే ఉండాలి. ఎక్కడా తేడా పాడా రాకూడదు. అరకొరగా వడ్డిస్తే అబ్బే బాలేదు అని పక్కన పెట్టేస్తారు. తెలుగు ఆడియన్స్ టేస్ట్ ని బట్టే ఫిల్మ్  మేకర్స్ కూడా అన్ని రకాలుగా బడ్జెట్ ని రెడీ చేసుకుని పెట్టుకుని మరీ నవరసాలకు ప్రాణం పోస్తున్నారు.

తెలుగు సినిమా అంటే అటు క్లాస్ ఇటు మాస్ ఉండాలి. హీరో ఒంటి చేత్తో విలన్లను పడగొట్టాలి. అంతే కాదు, అందాల భామలతో డ్యూయెట్లు కూడా పాడాలి. ఇలా గ్లామర్ తో పాటు గ్రామర్ కూడా ఉంటేనే తెలుగు సినిమా వెలిగేది. ఇపుడు ఆ గ్లామర్ డోస్ మరి కాస్తా ఎక్కువైంది.   కేవలం హీరోయిన్ మాత్రమే కాదు కీలకమైన పాత్రలలో నటించే వారు కూడా అందంగానే ఉండాలి. దాన్ని పరిచయం చేసి రుచి చూపించింది మాత్రం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్  శ్రీనివాస్ అనే చెప్పాలి.

విషయానికి వస్తే జూనియర్ ఎన్టీయార్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్  శ్రీనివాస్ తీస్తున్న కొత్త చిత్రం గురించి ఎన్నో రకాల అప్ డేట్స్ వినిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా చాలా ఆసక్తిగా ఉంటున్నాయి. జూనియర్ ఎన్టీయార్ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం   మన్మధుడు హీరోయిన్ అన్షు  అంబానీ అన్నపాత  హీరోయిన్ ప్రస్తావన వచ్చింది.

ఈ అమ్మడు అపుడెపుడో టాలీవుడ్ మన్మధుడు నాగార్జున పక్కన నటించింది. మన్మధుడు సినిమాలో అన్షు అంబానీ అమాయకంగా అందంగా నాగ్ ని రెచ్చగొడుతుంది. ఈ అమ్మడు ప్రేమ పిచ్చిలో పడి పీకల్లోతు మునిగిపోయే పాత్రలో నాగ్ నటించి హిట్ కొట్టాడు. ఈ మూవీ తరువాత అన్షు అంటే ఎంతో మంది మనసు పారేసుకున్నారు. కానీ ఈ అమ్మడు మాత్రం మళ్లీ సినిమాలు చేసినది లేదు.

ఇపుడు ఇన్నాళ్ళకు ఆ బ్యూటీని టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇప్పించేందుకు త్రివిక్రమ్  చూస్తున్నాడు అంటున్నారు. ఆమె కనుక జూనియర్ మూవీలో మెరిస్తే మాత్రం అందాల‌ రాశి ని మరోసారి తెలుగు తెర మీద తనివి తీరా చూడవచ్చు. ఈ మూవీకి ఎక్కడలేని గ్లామర్ వచ్చినట్లే. మొత్తానికి అన్షు ఫ్యాన్స్ మాత్రం ఈ వార్త నిజం అవాలనే కోరుకుంటున్నారుట.






బిగ్ బాస్ ఉత్సవం.. ఈటివి ఛాన్స్ ఇవ్వని స్టార్ మా..!

కాంగ్రెస్‌ గర్జన: తెలంగాణ బీజేపీ ఎంపీలు గాడిదలు కాస్తున్నారా..?

ఊహించని కాంబో.. టాలెంటెడ్ లేడీ డైరక్టర్ తో మహేష్..?

బడ్జెట్ 2021: రాష్ట్రానికి కేంద్రం మొండిచెయ్యి చూపింది - ఎంపీ విజయసాయిరెడ్డి

బడ్జెట్ 2021-22: జల జీవన్ మిషన్ విశేషాలేంటో...?

బడ్జెట్ ప్రసంగంలో టీమిండియా.. నిర్మలమ్మ నోట మోదీ మాట..

జబర్దస్త్ కు ఆల్టర్నేట్.. కామెడీ స్టార్స్ కుమ్మేస్తుందిగా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>