Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa-movie-shooting-updatesc459e2e0-1466-4e22-8c36-15a0a5c8763f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa-movie-shooting-updatesc459e2e0-1466-4e22-8c36-15a0a5c8763f-415x250-IndiaHerald.jpgగతేడాది ‘అల వైకుంఠపురములో’ సినిమాతో హ్యాట్రిక్ రికార్డు సంపాదించిన స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఈ ఏడాది ఫుల్ జోష్ తో సినిమాల్లో పాల్గొంటున్నారు. కాగా ప్రస్తుతం అల్లు అర్జున్ సెన్సెషనల్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో సినిమా చేస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ‘పుష్ప’ టైటిల్ తో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు షూటింగ్ ను శరవేశంగా జరుపుకుంటోంది చిత్ర యూనిట్. మారెడుపల్లి అడవుల్లో కొన్ని కీలక సన్ని వేశాలను చిత్రీallu arjun;kumaar;allu arjun;rashmika mandanna;sukumar;sunny;hyderabad;cinema;ala venkatapuram lo;director;heroine;bunny 1;posters;june;romantic;arjun 1;ala vaikunthapurramloo;josh;ala vaikuntapuramlo‘పుష్ప’ శ్రీశైలం బాట పట్టింది.. ఎందుకో తెలుసా?‘పుష్ప’ శ్రీశైలం బాట పట్టింది.. ఎందుకో తెలుసా?allu arjun;kumaar;allu arjun;rashmika mandanna;sukumar;sunny;hyderabad;cinema;ala venkatapuram lo;director;heroine;bunny 1;posters;june;romantic;arjun 1;ala vaikunthapurramloo;josh;ala vaikuntapuramloMon, 01 Feb 2021 13:58:16 GMTఅల్లు అర్జున్ ఈ ఏడాది ఫుల్ జోష్ తో సినిమాల్లో పాల్గొంటున్నారు. కాగా ప్రస్తుతం అల్లు అర్జున్ సెన్సెషనల్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో సినిమా చేస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ‘పుష్ప’ టైటిల్ తో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు షూటింగ్ ను శరవేశంగా జరుపుకుంటోంది చిత్ర యూనిట్. మారెడుపల్లి అడవుల్లో కొన్ని కీలక సన్ని వేశాలను చిత్రీకరించిన సంగతి తెలిసిందే. అక్కడనుంచి హైదరాబాద్ శివారులో కూడా ఈ చిత్రం షూటింగ్ ను జరుపుకుంది.
 ఇక తదుపరి షూటింగ్ కోసం ప్లాన్స్ వేస్తున్నారు డైరెక్టర్. తాజా సమాచారం ప్రకారం.. పుష్ప యూనిట్ అంతా కలిసి తదుపరి షెడ్యూల్ కోసం శ్రీశైలం పయనమవుతున్నట్టు వార్తలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా ఈ సినిమాలోని ఒక పాట చిత్రీకరణకోసమే డైరెక్టర్ సుకుమార్ శ్రీశైలం అడవులను చేరుకుంటున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ శ్రీశైలం అడవుల్లో స్టైలీష్ స్టార్ తో అల్లు అర్జున్ తో పాటుగా హీరోయిన్ రష్మిక మందాన కూడా పాల్గొననుందని తెలుస్తోంది. వీరి మధ్యలోనే ఒక రొమాంటిక్ సాంగ్ ను చిత్రీకరణ జరుపుతున్నట్టు సమాచారం.  భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 13 న రిలీజ్ కానుందని ఈ చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.

కాగా పుష్ప షూటింగ్ ను జూన్ వరకు కంప్లీట్ చేసుకునేందుకు డైరెక్టర్ పక్కా ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. ఇందులో బన్ని లుక్ అందరినీ ఆకట్టుకోనుంది. ఇంతకు మునుపెన్నడూ కనిపించని విధంగా రఫ్ లుక్ లో కనిపించనున్నాడు స్టైలీస్ స్టార్. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తేనే ఈ విషయం అర్థమవుతుంది. కాగా రఫ్ లుక్ తో పాటుగా చింపురి జుట్టు, మాసిన బట్టలతో స్టైలీష్ స్టార్ కనిపించనున్నాడని తెలుస్తోంది. ఈ పోస్టర్ తోనే బన్ని అభిమానుల్లో పుష్ప పట్ల అంచనాలు బాగానే పెరిగిపోయాయి.  ఇక ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఏ విధమైన రికార్డులు క్రియేట్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదేమో.  




బడ్జెట్‌ 2021: బ‌ంగారం ప్రియుల‌కు గుడ్ న్యూస్‌...

బడ్జెట్ 2021 : ఆ వాహనాలపై ఉక్కుపాదం..త్వరలో కొత్త విధానాలు !!

స్థానిక ఎన్నిక‌ల సాక్షిగా ప‌రిటాల సునీత‌కు షాక్‌... శ్రీరామ్ వ‌ల్లేగా ?

కేవీపీ బామ్మ‌ర్ది రివేంజ్ మామూలుగా ఉండ‌దా ?

జగడ్డ: నెల్లూరు జిల్లాలో అధికారుల బాధ్యతా రాహిత్యం..

జగడ్డ:నిమ్మగడ్డ సారూ...ఆ గ్రామంలో 2006 తరువాత స్థానిక ఎన్నికలు జరగలేదు...కారణం ఏమిటో?

కాపు వేద‌న‌: యేడాదికి రు. 2 వేల కోట్లు ఎక్క‌డ‌... జ‌గ‌న్‌కు కాపుల దెబ్బ త‌ప్ప‌దా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>