PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_analysis/jagan-ysrcpf440b0fb-7f10-4c7c-be5c-cf407a6d0403-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_analysis/jagan-ysrcpf440b0fb-7f10-4c7c-be5c-cf407a6d0403-415x250-IndiaHerald.jpgఈ రెండు చోట్ల గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ గెల‌వ‌డంతో ఇక్క‌డ భ‌ర‌త్ పెత్త‌నం చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తుండ‌డం.. ఇన్‌చార్జ్‌లు వ్య‌తిరేకిస్తుండడం జ‌రుగుతూ వ‌స్తోంది. ఇక ముందుగా ఆకుల వీర్రాజును తొల‌గించాల‌ని వైవి సుబ్బారెడ్డి నిర్ణ‌యించారు. అయితే జ‌క్కంపూడి రాజా మాత్రం కొన‌సాగిస్తే ఇద్ద‌రిని కొనసాగించాల‌ని.. లేక‌పోతే ఇద్ద‌రిని త‌ప్పించాల‌ని సుబ్బారెడ్డి ముందే చెప్పేశార‌ట‌. తాజాగా జ‌గ‌న్ నిర్ణ‌యం మేర‌కు సిటీ, రూర‌ల్ రెండు నియోజ‌క‌వ‌ర్గాల కో ఆర్డినేట‌ర్ల‌ను తొల‌గిస్తూ వైసీపీ నిర్ణ‌యం తీసుకుంది. ysrcp jagan;raja;y. s. rajasekhara reddy;mp;mla;letter;tdp;local language;ycp;partyవైసీపీలో ముస‌లం.... ఒకే సారి ఇద్ద‌రు ప‌ద‌వులు పీకేసిన జ‌గ‌న్వైసీపీలో ముస‌లం.... ఒకే సారి ఇద్ద‌రు ప‌ద‌వులు పీకేసిన జ‌గ‌న్ysrcp jagan;raja;y. s. rajasekhara reddy;mp;mla;letter;tdp;local language;ycp;partyMon, 01 Feb 2021 09:27:00 GMTస్థానిక సంస్థ‌లు ఎన్నిక‌లు జ‌రుగుతోన్న వేళ ఏపీలో అధికార వైఎస్సార్ సీపీలో పెద్ద ముస‌లం మొద‌లైంది. కీల‌క‌మైన రాజ‌మ‌హేంద్ర‌వ‌రం వైసీపీలో ఎంపీ మార్గాని భ‌ర‌త్‌కు స్థానిక పార్టీ నేత‌లు, ఎమ్మెల్యేల‌కు ప‌డ‌డం లేదు. ఈ క్రమంలోనే పార్టీ అధిష్టానం అనూహ్యంగా నిర్ణ‌యం తీసుకుంది.  ఓ వైపు స్థానిక హీట్ ఉండ‌గానే రాజ‌మ‌హేంద్ర‌వ‌రం సిటీ, రూర‌ల్ ఇద్ద‌రూ కో ఆర్డినేట‌ర్ల‌ను తొల‌గించేసింది. ఇప్పటి వ‌ర‌కు సిటీలో ఎంపీ మార్గాని భ‌ర‌త్ రామ్‌కు, సిటీ ఇన్‌చార్జ్ శ్రీఘాకోళ్ల‌పు శివ‌రామ సుబ్ర‌హ్మ‌ణ్యం, రూర‌ల్ ఇన్‌చార్జ్ ఆకుల వీర్రాజుకు ఆధిప‌త్య పోరు న‌డుస్తోంది. వీరు ముందు నుంచి రాజానగ‌రం ఎమ్మెల్యే జ‌క్కంపూడి రాజా వ‌ర్గంగా ఉంటూ వ‌స్తున్నారు.

అస‌లు జ‌క్కంపూడి రామ్మోహ‌న్ రావు ఉన్న‌ప్ప‌టి నుంచే వీరు క‌లిసుండే వారు. ఈ రెండు చోట్ల గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ గెల‌వ‌డంతో ఇక్క‌డ భ‌ర‌త్ పెత్త‌నం చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తుండ‌డం.. ఇన్‌చార్జ్‌లు వ్య‌తిరేకిస్తుండడం జ‌రుగుతూ వ‌స్తోంది. ఇక ముందుగా ఆకుల వీర్రాజును తొల‌గించాల‌ని వైవి సుబ్బారెడ్డి నిర్ణ‌యించారు. అయితే జ‌క్కంపూడి రాజా మాత్రం కొన‌సాగిస్తే ఇద్ద‌రిని కొనసాగించాల‌ని.. లేక‌పోతే ఇద్ద‌రిని త‌ప్పించాల‌ని సుబ్బారెడ్డి ముందే చెప్పేశార‌ట‌. తాజాగా జ‌గ‌న్ నిర్ణ‌యం మేర‌కు సిటీ, రూర‌ల్ రెండు నియోజ‌క‌వ‌ర్గాల కో ఆర్డినేట‌ర్ల‌ను తొల‌గిస్తూ వైసీపీ నిర్ణ‌యం తీసుకుంది.

వీరి స్థానాల్లో సిటీకి మాజీ ఎమ్మెల్యే ఆకుల స‌త్య‌నారాయ‌ణ‌ను, రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గానికి మాజీ ఎమ్మెల్యే చంద‌న ర‌మేష్ కుమారుడు చంద‌న నాగేశ్వ‌ర్‌ను ఇన్‌చార్జ్‌లు గా నియ‌మిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. పంచాయ‌తీ ఎన్నిక‌ల ముందు ఈ మార్పు వ‌ద్ద‌ని చాలా మంది చెప్పినా సుబ్బారెడ్డి మాత్రం వినిపించు కోలేద‌ట‌. దీంతో కొత్త ఇన్ చార్జ్‌లు ఇద్ద‌రూ ఎంపీ వ‌ర్గం నేతలుగా ఉన్న‌ట్లు అయ్యింది. ఈ మార్పుతో అటు సిటీలో శివ‌రామ సుబ్ర‌హ్మ‌ణ్యం వ‌ర్గంలో తీవ్ర అసంతృప్తి నెల‌కొంది.

ఇటు రూర‌ల్లో ఆకుల వీర్రాజు ఇప్ప‌టికే వ‌రుసగా రెండు సార్లు ఓడిపోయారు. ఆయ‌న వ‌ర్గం కూడా భ‌గ్గుమంటోంది. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు రాజ‌మ‌హేంద్ర‌వ‌రం వైసీపీలో ఉన్న విబేధాలు మ‌రింత మండ‌డం ఖాయ‌మే. 


రాగి చెంబులోని నీటిని తాగుతున్నారా..? అయితే ఇది మీకోసమే..!

ఆ మంత్రికి చుక్క‌లు చూపిస్తున్న కేడ‌ర్‌... అద‌ను చూసి దెబ్బ‌కొట్టిందే ?

కేంద్ర బడ్జెట్: కొవిడ్ పన్ను మోత మోగిపోద్ది.. కానీ..!

బడ్జెట్‌: ఓవైపు చైనాతో యుద్ధం.. నిర్మలమ్మ ఏం చేస్తారో..?

బడ్జెట్‌: మీరు తప్పక తెలుసుకోవాల్సిన బడ్జెట్‌ విశేషాలు ఇవే..!

బడ్జెట్‌: దేశ ప్రజలకు కరోనా వాత తప్పదా..?

జగడ్డ: ఏపీలో తొలిదశ 93 పంచాయతీలు ఏకగ్రీవం..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>