MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bala-krishna-chirub0477221-e0ee-463c-bd22-786a281acd90-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bala-krishna-chirub0477221-e0ee-463c-bd22-786a281acd90-415x250-IndiaHerald.jpgఇక మే నెల‌లో న‌లుగురు పెద్ద హీరోల సినిమాలు థియేట‌ర్ల‌లోకి రానున్నాయి. మెగాస్టార్‌ చిరంజీవి ఆచార్య(మే13) -వెంకటేశ్ నారప్ప(మే14) - మాస్‌ మహారాజా రవితేజ ఖిలాడి (మే28) సినిమాల విడుదల తేదీలు ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు ఈ వార్‌ల‌కి బాల‌య్య కూడా దిగిపోయాడు. బాల‌య్య - బోయ‌పాటి హ్యాట్రిక్ మూవీ బీబీ3 మే 28న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌ చేయ‌నున్న‌ట్లు ప్రకటించారు. దీంతో టాలీవుడ్‌లో స‌మ్మ‌ర్ వార్ మామూలుగా ఉండ‌ద‌ని తేలిపోయింది. ఇక పెద్ద హీరోలుగా ఉన్న చిరు, బాల‌య్య‌, వెంక‌టేష్ సినిమాలు ఒకేసారి రావ‌డం అనేది bala krishna chiru;chiranjeevi;ravi;venkatesh;ravi teja;cinema;war;khaidi.;letter;central government;gautamiputra satakarni;khaidi new;krack;red;narappaబాల‌య్య వ‌ర్సెస్ చిరు ఈ గొడ‌వ ఆగ‌దా ? మ‌ళ్లీ అదే కార‌ణం...!బాల‌య్య వ‌ర్సెస్ చిరు ఈ గొడ‌వ ఆగ‌దా ? మ‌ళ్లీ అదే కార‌ణం...!bala krishna chiru;chiranjeevi;ravi;venkatesh;ravi teja;cinema;war;khaidi.;letter;central government;gautamiputra satakarni;khaidi new;krack;red;narappaMon, 01 Feb 2021 09:45:00 GMTక‌రోనా కార‌ణంగా గ‌తేడాది రిలీజ్ కావాల్సిన సినిమాలు అన్ని ఆగిపోయాయి. ఇప్పుడు థియేట‌ర్లు పునః ప్రారంభించ‌డంతో పాటు షూటింగ్‌లు కూడా కంటిన్యూ అవుతుండ‌డం.. ఇటు థియేట‌ర్ల‌లో 100 శాతం ఆక్యుపెన్సీకికి సైతం కేంద్రం ప‌చ్చ‌జెండా ఊప‌డంతో ఇప్పుడిప్పుడే సినిమా ఇండ‌స్ట్రీలో సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంది. దీనికి తోడు సంక్రాంతికి వ‌చ్చిన సినిమాల్లో క్రాక్ సూప‌ర్ హిట్ అవ్వ‌గా, రెడ్ సైతం బ్రేక్ ఈవెన్ సాధించింది. దీంతో సినిమాబాగుంటే 50 శాతం ఆక్యుపెన్సీతో కూడా మంచి వ‌సూళ్లు వ‌చ్చేస్తున్నాయ‌న్న ధైర్యం నిర్మాత‌ల‌కు, డిస్ట్రిబ్యూటర్ల‌కు వ‌చ్చేసింది. దీంతో వారు వ‌రుస పెట్టి త‌మ సినిమాల‌ను లైన్లో పెడుతున్నారు.

ఇక ఈ యేడాది ఇప్ప‌టి నుంచి వ‌చ్చే ఆరేడు నెల‌ల వ‌ర‌కు ప్ర‌తి వారం ఓ అదిరిపోయే సినిమా రానుంది. ఇక మే నెల‌లో న‌లుగురు పెద్ద హీరోల సినిమాలు థియేట‌ర్ల‌లోకి రానున్నాయి. మెగాస్టార్‌ చిరంజీవి ఆచార్య(మే13) -వెంకటేశ్ నారప్ప(మే14) - మాస్‌ మహారాజా రవితేజ ఖిలాడి (మే28) సినిమాల విడుదల తేదీలు ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు ఈ వార్‌ల‌కి బాల‌య్య కూడా దిగిపోయాడు. బాల‌య్య - బోయ‌పాటి హ్యాట్రిక్ మూవీ బీబీ3 మే 28న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌ చేయ‌నున్న‌ట్లు ప్రకటించారు. దీంతో టాలీవుడ్‌లో స‌మ్మ‌ర్ వార్ మామూలుగా ఉండ‌ద‌ని తేలిపోయింది.

ఇక పెద్ద హీరోలుగా ఉన్న చిరు, బాల‌య్య‌, వెంక‌టేష్ సినిమాలు ఒకేసారి రావ‌డం అనేది 1990ల్లో మాత్ర‌మే సాధ్య‌మైంది. ఇక చిరు  రీ ఎంట్రీ సినిమా అయిన ఖైదీ నంబర్‌ 150 రిలీజ్ సమయంలోనూ గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో ఢీ కొట్టారు.  టాలీవుడ్‌లో బాల‌య్య‌, చిరు సినిమాలు సంక్రాంతికి ఎన్నోసార్లు పోటీ ప‌డ్డాయి. వీరిద్ద‌రి మ‌ధ్య బాక్సాఫీస్ వ‌ద్ద ఎప్పుడూ పోటీ వ‌చ్చినా ఆస‌క్తిగా ఉంటుంది. ఈ క్ర‌మంలోనే మ‌రోసారి వీరిద్ద‌రు స‌మ్మ‌ర్ లో పోటీ ప‌డుతుండ‌డంతో బాక్సాఫీస్ హీటెక్క‌డం ఖాయం.

దీంతో ఈ ఇద్ద‌రు హీరోల ఫ్యాన్స్ కూడా ఏ సినిమా పై చేయి సాధిస్తుందా ? అన్న ఆస‌క్తితో ఉన్నారు. అయితే ఈ సారి వీరి సినిమాల రిలీజ్‌కు మ‌ధ్య రెండు వారాల గ్యాప్ ఉంది. అయితే ఆచార్య వ‌చ్చిన మ‌రుస‌టి రోజే వెంకీ నార‌ప్ప రిలీజ్ అవుతోంది. 


ఆర్ ఆర్ ఆర్ ను వదిలిపెట్టని అలనాటి రాజమౌళి శ్రీదేవిల రగడ !

టీచర్ల వెతలు: అయ్యో.. కూలీ పనులు చేసుకుంటున్న పంతుళ్లు..!

జగడ్డ: మహిళా ఎమ్మార్వోకి షాకిచ్చిన నిమ్మగడ్డ

వైసీపీలో పంచాయితీలే.. ఈ నేత‌ల‌తో జ‌గ‌న్ నిండా మునిగిన‌ట్టే ?

యూనియన్ బడ్జెట్ 2021: నిర్మలాజి ఏ విధంగా ‘చూమంతర్ బడ్జెట్’ చేస్తుందో మరి!

ఆ మంత్రికి చుక్క‌లు చూపిస్తున్న కేడ‌ర్‌... అద‌ను చూసి దెబ్బ‌కొట్టిందే ?

కేంద్ర బడ్జెట్: కొవిడ్ పన్ను మోత మోగిపోద్ది.. కానీ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>