PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionsc2afb27e-5c9d-449e-afd5-498af4bacf14-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionsc2afb27e-5c9d-449e-afd5-498af4bacf14-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేసారు. శ్రీకాకుళం జిల్లాకు వెళ్ళిన ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లాలో గతంలో పనిచేశాను.... మళ్ళీ ఇక్కడకు రావటం సంతోషం అని అన్నారు. జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లు బాగా చేస్తున్నారని వెల్లడించారు. ప్రతిభావంతులైన అధికారులు ఉంటే ఆ జిల్లా అభివృద్ధి చెందుతుంది అని అన్నారు. ప్రతి వ్యవస్థకు రాజ్యాంగం నిర్దిష్ట విధానం ఇచ్చింది అని ఆయన అన్నారు. ఎన్నికల సంఘానికి విస్తృత అధికారాలను రాజ్యాంగం కnimmagadda;amala akkineni;kumaar;manu;poorna;andhra pradesh;district;local language;election commission;partyఏకగ్రీవాలపై నిమ్మగడ్డ సంచలన వ్యాఖ్యలుఏకగ్రీవాలపై నిమ్మగడ్డ సంచలన వ్యాఖ్యలుnimmagadda;amala akkineni;kumaar;manu;poorna;andhra pradesh;district;local language;election commission;partyMon, 01 Feb 2021 20:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో ఏపీ ఎన్నికల కమీషనర్  నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేసారు. శ్రీకాకుళం జిల్లాకు వెళ్ళిన ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లాలో గతంలో పనిచేశాను.... మళ్ళీ ఇక్కడకు రావటం సంతోషం అని అన్నారు. జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లు బాగా చేస్తున్నారని వెల్లడించారు. ప్రతిభావంతులైన అధికారులు ఉంటే ఆ జిల్లా అభివృద్ధి చెందుతుంది అని అన్నారు. ప్రతి వ్యవస్థకు రాజ్యాంగం నిర్దిష్ట విధానం ఇచ్చింది అని ఆయన అన్నారు.

ఎన్నికల సంఘానికి విస్తృత అధికారాలను రాజ్యాంగం కల్పించింది అని తెలిపారు. ఈసీ కి స్వీయ నియంత్రణ ఉంది అని ఆయన తెలిపారు. 20 ఏళ్ల సర్వీస్ లో వివాదాలకు వెళ్ళలేదు అని ఆయన స్పష్టం చేసారు. నేను ఏ రాజకీయ పార్టీ గురించి వ్యాఖ్యలు చేయలేదు అని, నా స్వీయ నియంత్రణలో నేను విధులు నిర్వర్తిస్తాను అని స్పష్టం చేసారు. ఒక వ్యవస్థలో మరో వ్యవస్థ తలదూర్చటం రాజ్యాంగం అంగీకరించదని ఆయన అన్నారు. ఎన్నికల సంఘం అనేక సవాళ్లు ఎదుర్కొంది అని ఆయన పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యం బలంగా ఉండాలంటే ఎన్నికలు తప్పనిసరి అని స్పష్టం చేసారు. రాజ్యాంగం చెప్పింది ఈసీ తూచా తప్పకుండా అమలుచేస్తుంది అని ఆయన వెల్లడించారు. దేశంలో ఎక్కడా ఈసీ పై ఇలాంటి దాడి జరగలేదు అని అన్నారు. చూస్తూ ఊరుకుంటే వ్యవస్థ మనుగడకు ప్రమాదం అన్నారు ఆయన. నాకు న్యాయ వ్యవస్థపై విశేష గౌరవం ఉంది అని తెలిపారు. న్యాయ వ్యవస్థ పై సంపూర్ణ విధేయత, విస్వాసం ఉంది అని ఆయన వ్యాఖ్యానించారు. నేను నా వ్యవస్థను ఎంతగా నమ్ముతానో న్యాయ వ్యవస్తానూ అంతగా నమ్ముతాను అన్నారు. ఒకరిని ఇంకొకరు నియంత్రించలేరు అని ఆయన పేర్కొన్నారు. ఏకగ్రీవాలపై ఈసీ కి నిర్దిష్ట ధోరణి ఉంది అని, సాధారణ ఏకగ్రీవాలను వ్యతిరేకించే ప్రసక్తే లేదు అని స్పష్టం చేసారు. ఒత్తిడి చేసి బలవంతపు ఏకగ్రీవాలను అంగీకరించేది లేదు అన్నారు.


బిగ్ బాస్ ఉత్సవం.. ఈటివి ఛాన్స్ ఇవ్వని స్టార్ మా..!

కాంగ్రెస్‌ గర్జన: తెలంగాణ బీజేపీ ఎంపీలు గాడిదలు కాస్తున్నారా..?

ఊహించని కాంబో.. టాలెంటెడ్ లేడీ డైరక్టర్ తో మహేష్..?

బడ్జెట్ 2021: రాష్ట్రానికి కేంద్రం మొండిచెయ్యి చూపింది - ఎంపీ విజయసాయిరెడ్డి

బడ్జెట్ 2021-22: జల జీవన్ మిషన్ విశేషాలేంటో...?

బడ్జెట్ ప్రసంగంలో టీమిండియా.. నిర్మలమ్మ నోట మోదీ మాట..

జబర్దస్త్ కు ఆల్టర్నేట్.. కామెడీ స్టార్స్ కుమ్మేస్తుందిగా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>