PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/polio-vaccinatione07b3489-8f08-4ed2-8823-aef00f68cba4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/polio-vaccinatione07b3489-8f08-4ed2-8823-aef00f68cba4-415x250-IndiaHerald.jpgపోలియో చుక్కలు వేయించుకున్న కొద్ది సేపటికే ఓ చిన్నారి మృతి చెందిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. తెలంగాణలోని మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లా దుండిగల్ మున్సిపాల్టీ పరిధిలోని మహేశ్వరం గ్రామంలో ఈ ఘటన జరిగింది. దీక్షిత అనే 16రోజుల పసి నెలల పాప పోలియో చుక్కలు వేయించుకున్న కాసేపటికే చనిపోయింది. చుక్కల మందు వికటించిందని, అందుకే తమ పాప చనిపోయిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పోలియో మందులో ఎలాంటి ఇబ్బంది లేదని, పాప అనారోగ్యం వల్లే అలాంటి పరిస్థితి తలెత్తిందని అంటున్నారు వైద్యులు. polio vaccination;mohandas karamchand gandhi;district;police;village;heart;medchal;central government;polioషాకింగ్.. పోలియో చుక్కలు వేయించుకున్న చిన్నారి మృతి..షాకింగ్.. పోలియో చుక్కలు వేయించుకున్న చిన్నారి మృతి..polio vaccination;mohandas karamchand gandhi;district;police;village;heart;medchal;central government;polioMon, 01 Feb 2021 11:00:00 GMTపోలియో చుక్కలు వేయించుకున్న కొద్ది సేపటికే ఓ చిన్నారి మృతి చెందిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. తెలంగాణలోని మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లా దుండిగల్ మున్సిపాల్టీ పరిధిలోని మహేశ్వరం గ్రామంలో ఈ ఘటన జరిగింది. దీక్షిత అనే 16రోజుల పసి నెలల పాప పోలియో చుక్కలు వేయించుకున్న కాసేపటికే చనిపోయింది. చుక్కల మందు వికటించిందని, అందుకే తమ పాప చనిపోయిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పోలియో మందులో ఎలాంటి ఇబ్బంది లేదని, పాప అనారోగ్యం వల్లే అలాంటి పరిస్థితి తలెత్తిందని అంటున్నారు వైద్యులు.

జగద్గిరిగుట్టకు చెందిన యాదగిరి, మహేశ్వరానికి చెందిన ప్రమీల భార్యా భర్తలు. ఏడాదిన్నర క్రితం వీరికి వివాహం కాగా.. పండంటి పాప దీక్షిత జన్మించింది. పాపకు 16రోజుల వయసు. ప్రస్తుతం దీక్షిత అమ్మమ్మ వాళ్లింట్లో ఉంటోంది. ఆదివారం ఉదయం 11.45 గంటలకు శంభీపూర్‌ లోని అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారి దీక్షితకు పోలియో చుక్కలు వేయించారు. 11.55కి తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే మియాపూర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. చిన్నారి మృతికి పోలియో చుక్కలే కారణమని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. పాప మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ గాంధీ ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై జిల్లా అధికారులు స్పందించారు. పుట్టినప్పుడే కొంతమంది చిన్నారులకు గుండె, ఉపిరితిత్తుల సమస్యలు ఉండొచ్ఛని, వాటి వల్ల సమస్యలు వచ్చిఉంటాయి కానీ, పోలియో చుక్కలు వికటించే అవకాశం లేదని చెప్పారు. ఒక్కో సీసాలో 40 చుక్కలుంటాయని, చిన్నారికి పోలియో డ్రాప్స్ వేసిన తర్వాత మరో 17 మందికి వేశామని, వారందరికి ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. ఎవరిలోనూ దుష్పరిణామాలు లేవని స్పష్టం చేశారు. చిన్నారి దీక్షిత మరణానికి ఇతర కారణాలుంటాయని అనుమానం వ్యక్తం చేశారు. ఏదేమైనా.. పోలియో చుక్కలు వేయించిన కాసేపటికే చిన్నారి మృతిచెందడంతో తల్లిదండ్రులు ఆవేదనకు గురయ్యారు. పోలియో డ్రాప్స్ వేయించకుండా ఉంటే తమ చిన్నారి క్షేమంగా ఉండేదంటూ కంటతడి పెట్టారు. 


బుట్టబొమ్మ కాస్త బాపు బొమ్మలా మారిందేంటి ?

దర్శకులతో గొడవపడుతున్న హేమ !

జగడ్డ : కర్నూలులో రంగంలోకి దిగిన ఎమ్మెల్యే.. ఇక అక్కడ సీన్ రిపీటవుతుందా..?

వై.ఎస్. షర్మిలకు సవాల్ విసిరిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ..?

జగడ్డ : టీడీపీలో నంబర్ టూ టార్గెట్ గా వైసిపీ...?

టీచర్ల వెతలు: అయ్యో.. కూలీ పనులు చేసుకుంటున్న పంతుళ్లు..!

ఆర్ ఆర్ ఆర్ ను వదిలిపెట్టని అలనాటి రాజమౌళి శ్రీదేవిల రగడ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>