PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-reddy-chandra-babu97fee85e-b1e7-4fe6-ba67-d1882cd8a8b9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-reddy-chandra-babu97fee85e-b1e7-4fe6-ba67-d1882cd8a8b9-415x250-IndiaHerald.jpgతాను పార్టీ మారినా చంద్రబాబును ఏనాడు విమర్శించ లేదు రేవంత్ రెడ్డి. బాబును ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు కూడా చేయలేదు. అందుకే ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డిని చంద్రబాబు మనిషి అంటూ టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తూ ఉంటారు.అయితే తొలిసారి చంద్రబాబుకు షాకిచ్చారు రేవంత్ రెడ్డి. ఆయన ఆలోచనలకు భిన్నంగా వ్యవహరించారు. revanth reddy chandra babu;cbn;modi;revanth;tara;telangana rashtra samithi trs;telangana;revanth reddy;congress;mp;prime minister;tpcc;tdp;reddy;leader;party;fidaaబాబుకు రేవంత్ రెడ్డి షాక్!బాబుకు రేవంత్ రెడ్డి షాక్!revanth reddy chandra babu;cbn;modi;revanth;tara;telangana rashtra samithi trs;telangana;revanth reddy;congress;mp;prime minister;tpcc;tdp;reddy;leader;party;fidaaMon, 01 Feb 2021 21:41:20 GMTటీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్. మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి.. ఇప్పుడు తెలంగాణలో క్రేజీ లీడర్. పంచ్ డైలాగులతో ఆయన చేసే ప్రసంగాలకు జనాలు ఫిదా అవుతున్నారు. యువతలో ఆయన క్రేజీగ్రాఫ్  రోజు రోజుకు పెరిగిపోతోంది.  అయితే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నా... ఆయన పేరు చెప్పగానే టీడీపీ, చంద్రబాబే ఎక్కువగా గుర్తుకు వస్తారని చెబుతారు. ఎందుకంటే చంద్రబాబు నాయకత్వంలోనే రాజకీయాల్లో రాటు దేలారు రేవంత్ రెడ్డి. ఉమ్మడి ఏపీలో పదేళ్ల పాటు ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన చంద్రబాబుకు కుడి భుజంగా ఉన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీని ఇరుకున పెట్టాలనే ప్రయత్నాలను ముందుండి అడ్డుకున్నారు.

               తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన.. టీడీపీని, చంద్రబాబును తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి జైలుకు కూడా వెళ్లారు. ఆ సమయంలో చంద్రబాబు కుటుంబం ఆయనకు అండగా నిలిచింది. అందుకే పార్టీ మారినా చంద్రబాబు విధేయుడిగానే రేవంత్ రెడ్డి ఉంటారనే చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. తాను పార్టీ మారినా చంద్రబాబును ఏనాడు విమర్శించ లేదు రేవంత్ రెడ్డి. బాబును ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు కూడా చేయలేదు. అందుకే ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డిని చంద్రబాబు మనిషి అంటూ టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తూ ఉంటారు.

 అయితే తొలిసారి చంద్రబాబుకు షాకిచ్చారు రేవంత్ రెడ్డి. ఆయన ఆలోచనలకు భిన్నంగా వ్యవహరించారు. దేశంలో జమిలి ఎన్నికలు వస్తాయనే ప్రచారం కొంత కాలంగా జరుగుతోంది. జమిలి ఎన్నికలకు మోడీ సర్కార్ కసరత్తు చేస్తుందని తెలుస్తోంది. జమిలి ఎన్నికలు అవసరమని పలు సార్లు ప్రధాని మోడీనే స్వయంగా చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు సైతం జమిలి ఎన్నికలకు జై కొట్టారు. అంతేకాదు మరో రెండేళ్లలోనే ఏపీలో ఎన్నికలు వస్తాయంటూ జమిలికి పార్టీ కేడర్ ను సిద్ధం చేస్తున్నారు చంద్రబాబు.
   
            తన గురువు చంద్రబాబు జమిలి ఎన్నికలకు జై కొట్టగా.. ఎంపీ రేవంత్ రెడ్డి మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అంతేకాదు జమిలి ఎన్నికలు వస్తే దేశం రెండుగా విడిపోవడం ఖాయమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత దేశ విభజన ఉద్యమం వస్తుందన్నారు రేవంత్ రెడ్డి.  దక్షిణాది రాష్ట్రాల ప్రజల అవసరం లేకుండా అధ్యక్షుడి ఎన్నిక జరిగినప్పుడు.. ఇక్కడి ప్రజలు ఎందుకు ఊరుకుంటారని ఆయన ప్రశ్నించారు. దక్షిణాది రాష్ట్రాల వివక్షకు కారణమయ్యే జమిలి ఎన్నికల ఆలోచనను మోడీ విరమించుకోవాలని, లేకుంటే ఈ అన్ని అంశాలను పార్లమెంట్‌లోనే మాట్లాడుతానన్నారు రేవంత్ రెడ్డి.
 
      చంద్రబాబు జమిలి ఎన్నికలు కావాలని బలంగా కోరుకుంటుంగా.. ఆయన శిష్యుడిగా చెప్పుకునే రేవంత్ రెడ్డి జమిలి ఎన్నికలను తీవ్రంగా వ్యతిరేకిస్తుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజకీయ వర్గాల్లోనూ దీనిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.




బాయ్ ఫ్రెండ్ ఇంట్లో ఏకాంతంగా మజా చేస్తున్న కియారా..కెమెరా కంటికి చిక్కిందిలా..?

బిగ్ బాస్ ఉత్సవం.. ఈటివి ఛాన్స్ ఇవ్వని స్టార్ మా..!

కాంగ్రెస్‌ గర్జన: తెలంగాణ బీజేపీ ఎంపీలు గాడిదలు కాస్తున్నారా..?

ఊహించని కాంబో.. టాలెంటెడ్ లేడీ డైరక్టర్ తో మహేష్..?

బడ్జెట్ 2021: రాష్ట్రానికి కేంద్రం మొండిచెయ్యి చూపింది - ఎంపీ విజయసాయిరెడ్డి

బడ్జెట్ 2021-22: జల జీవన్ మిషన్ విశేషాలేంటో...?

బడ్జెట్ ప్రసంగంలో టీమిండియా.. నిర్మలమ్మ నోట మోదీ మాట..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>