PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/they-are-doing-it-faster-than-anything-else815f45cd-d93c-486a-a643-9567613f918a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/they-are-doing-it-faster-than-anything-else815f45cd-d93c-486a-a643-9567613f918a-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా వ్యాక్సినేషన్‌... వేగంగా జరుగుతోంది. 15 రోజుల్లోనే 37 లక్షల మందికిపైగా టీకా అందించారు. ప్రపంచంలో మరెక్కడా జరగనంతా వేగంగా దేశంలో వ్యాక్సినేషన్ జరుగుతోంది.భారత్‌లో తొలిదశ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. పదిహేను రోజుల్లోనే.. 37 లక్షల మందికిపైగా వ్యాక్సిన్‌ పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అతి తక్కువ సమయంలోనే లక్షల మందికి టీకా ఇచ్చి... భారత్‌ రికార్డు సృష్టించింది. అమెరికా, బ్రిటన్‌ దేశాలతో పోలిస్తే...ఇండియా దూసుకుపోతోంది.they are doing it faster than anything else;health;susheela;krishna;vijayalalitha;hyderabad;india;krishna river;american samoa;director;uttar pradesh;central government;mancherialమరెక్కడా జరగనంత వేగంగా చేేసేస్తున్నారు..!మరెక్కడా జరగనంత వేగంగా చేేసేస్తున్నారు..!they are doing it faster than anything else;health;susheela;krishna;vijayalalitha;hyderabad;india;krishna river;american samoa;director;uttar pradesh;central government;mancherialMon, 01 Feb 2021 17:00:00 GMT
భారత్‌లో తొలిదశ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. పదిహేను రోజుల్లోనే.. 37 లక్షల మందికిపైగా వ్యాక్సిన్‌ పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అతి తక్కువ సమయంలోనే లక్షల మందికి టీకా ఇచ్చి... భారత్‌ రికార్డు సృష్టించింది. అమెరికా, బ్రిటన్‌ దేశాలతో పోలిస్తే...ఇండియా దూసుకుపోతోంది.

పదిలక్షల మార్కును... అమెరికా 10 రోజులు, బ్రిటన్‌ 18 రోజుల్లో చేరుకున్నాయి. ఆరు రోజుల్లోనే... భారత్‌ పది లక్షల మందికి టీకా అందించింది. 15రోజుల్లోనే 30 లక్షల కొవిడ్‌ టీకాలను అందజేసి...రికార్డు సృష్టించింది. దేశవ్యాప్తంగా 71 ప్రదేశాల్లో టీకాలు వేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రాల వారీగా తీసుకుంటే...యూపీ మొదటి స్థానంలో ఉంది.

మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనే వ్యాక్సినేషన్‌ విజయవంతంగా జరుగుతోంది. అయితే అక్కడక్కడ మాత్రం కొన్ని సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మంచిర్యాల జిల్లాలో టీకా తీసుకున్న అంగన్వాడీ టీచర్‌... మృతి చెందారు. కాసిపేట మండలానికి చెందిన సుశీల...ఈ నెల 19న వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి విషమించడంతో... హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ... కన్నుమూశారు.

హెల్త్ కేర్ వర్కర్‌...సుశీల మృతిపై డైరెక్టర్ ఆఫ్‌ హెల్త్ స్పందించారు. ఆమె వ్యాక్సిన్‌ వల్ల మరణించలేదని...ఇతర అనారోగ్య కారణాలతో కన్నుమూసిందన్నారు. శ్వాసకోస సమస్య వస్తే...నిమ్స్‌కు తరలించి చికిత్స అందించామన్నారు.

అటు కృష్ణా జిల్లాలోనూ వ్యాక్సిన్ తీసుకున్న ఓ అంగన్‌వాడీ కార్యకర్త అనారోగ్యం పాలయ్యారు. చాట్రాయి మండలం కోటపాడులో...విజయలలిత టీకా తీసుకున్నారు. వ్యాక్సిన్‌ వేయించుకున్న రోజు నుంచి ఆమె ఆరోగ్యం బాలేదని... సన్నిహితులు చెబుతున్నారు. మెరుగైన వైద్యసాయం అందించాలని బాధితురాలు కోరుతున్నారు. అస్వస్థతకు గురైన వారిపై వైద్యశాఖ అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టారు. వీరి అస్వస్థతకు కారణమేంటో వివరాలు సేకరించి అధికారులకు నివేదించనున్నారు.




దైవ దర్శనానికి వెళ్తుండగా.. ఫోన్ రింగ్ ప్రాణం తీసింది..?

జగడ్డ : జగనోరికి సొంత పార్టీ నుంచే భారీ షాక్...?

నదియా గురించి బయటపడ్డ సంచలన నిజాలు..!

బడ్జెట్ ఎఫెక్ట్ : మోతెక్కనున్న వాటి ధరలు..పడిపోనున్న వీటి ధరలు !!

జగడ్డ : బాబు మాట ఖాతరు చేయని అచ్చెన్న...?

జగడ్డ: ఏకగ్రీవాల మీద కేంద్రం ఫోకస్...?

జగడ్డ : తొలిపోరులో బాబోరు గెలిచారు...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>