PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/union-budget-2021-225c4fa51a-2fd3-4f5b-a77f-f41bae36f597-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/union-budget-2021-225c4fa51a-2fd3-4f5b-a77f-f41bae36f597-415x250-IndiaHerald.jpgఆరోగ్య రంగానికి కేటాయింపు పెంచడంపై వైద్య, ఆర్ధిక నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య వ్యవస్థలు అంతంత మాత్రంగానే భారత్ మౌలిక వసతుల ఏర్పాటు ఇక గణనీయంగా పెరగనున్నాయని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.union budget 2021-22;nirmalamma;poorna;varsha;india;nirmala sitharaman;prime minister;february;minister;central government;parliamentబడ్జెట్ 2021-22: ఆరోగ్యానికి పెద్దపీట వేసిన నిర్మలమ్మ...?బడ్జెట్ 2021-22: ఆరోగ్యానికి పెద్దపీట వేసిన నిర్మలమ్మ...?union budget 2021-22;nirmalamma;poorna;varsha;india;nirmala sitharaman;prime minister;february;minister;central government;parliamentMon, 01 Feb 2021 15:51:50 GMTకేంద్ర బడ్జెట్ 2021 విడుదలైంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ 2021 ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టారు.డిజిటల్ పద్ధతిలో బడ్జెట్ ను  సమర్పించడం విశేషం. రానున్న ఆరునెలల్లో ఐదు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆయా రాష్ట్రాలకు భారీగా బడ్జెట్ కేటాయించారు. ఇక్కడ మరో ప్రముఖ విషయం... మునుపెన్నడూ లేని విధంగా బడ్జెట్ పరంగా ఆరోగ్య రంగానికి పెద్దపీట వేశారు. ఈసారి ఆరోగ్య రంగానికి  భారీ స్థాయిలో నిధులు కుమ్మరించినట్లుగా పేర్కొన్నారు సీతారామన్.

కోవిడ్ మహమ్మారి దెబ్బకు ఆరోగ్య దృష్ట్యా... పాలకులు మేల్కొ నట్లయింది. అందుకే గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి బడ్జెట్లో ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది కేంద్రం. తన ప్రసంగంలో భాగంగా ఆరోగ్యరంగం గురించి మాట్లాడిన సీతారామన్... కరోనా విజృంభన  కారణంగా దేశం మునుపెన్నడూ లేని ప్రమాదక పరిస్థితిని ఎదుర్కొంది. లాక్ డౌన్ కొంతవరకు మేలును చేసింది.. లేదంటే ఎంతో నష్టాన్ని ఎదుర్కోవలసి ఉండేది అని తెలిపారు. ఈ బడ్జెట్‌లో ఆరోగ్య మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు గణనీయంగా పెంచాము.

చికిత్స, సంపూర్ణ ఆరోగ్య విధానం పథకం, నివారణ ఈ పథకం కింద 9 బీఎస్ఎల్-3 స్థాయి ప్రయోగ శాలలు,15 అత్యవసర ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు... ఆరోగ్యం, సంక్షేమం కోసం బడ్జెట్ వ్యయం రూ.2.23 లక్షల కోట్లు.. గతేడాది రూ. రూ.94,452 కోట్లతో పోలిస్తే ఇది 137 శాతం అదనంగా పెరిగిందని  నిర్మలా సీతారామన్ అన్నారు. అత్యవసర సేవల రంగంలో పనిచేసిన వారందరూ తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజల కోసం పనిచేశారని ...ఈ క్రమంలోనే జాతీయ స్థాయిలో వ్యాధిని నివారణ కేంద్రంతో పాటు 15 ఎమర్జెన్సీ వెల్ నెస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు నిర్మలా సీతారామన్.

ఆరోగ్య రంగానికి కేటాయింపు పెంచడంపై వైద్య, ఆర్ధిక నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ  నేపథ్యంలో ఆరోగ్య వ్యవస్థలు అంతంత మాత్రంగానే భారత్ మౌలిక వసతుల ఏర్పాటు ఇక గణనీయంగా పెరగనున్నాయని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ప్రధాన మంత్రి ఆత్మనిర్భర్ స్వస్థ్య స్కీమ్ కింద ఆరేళ్లలో రూ.64,180 కోట్ల వెచ్చించింది. తద్వారా దేశంలోని ప్రాథమిక, ద్వితీయ, తృతీయ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను మెరుగు పడనున్నాయని తెలిపారు.

ఇక కరోనా వ్యాక్సిన్ కోసం రూ.35 వేల కోట్లు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్‌ను మరింత బలోపేతం చేస్తామని, గ్రామాల్లో , పట్టణాల్లో  ఆరోగ్య కేంద్రాలను అదనంగా ఏర్పాటుచేయనున్నట్టు తెలిపారు. అంతేకాక దేశంలో మరో నాలుగు ప్రాంతీయ వైరల్ ల్యాబ్ లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు సీతారామన్. ఆరోగ్య రంగానికి బడ్జెట్ కేటాయించిన విధానం చూసి అందరూ కేంద్రంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


జగడ్డ : బాబు మాట ఖాతరు చేయని అచ్చెన్న...?

జగడ్డ: ఏకగ్రీవాల మీద కేంద్రం ఫోకస్...?

జగడ్డ : తొలిపోరులో బాబోరు గెలిచారు...?

జగడ్డ : కేంద్రం సీరియస్ గా ఉందా...?

బడ్జెట్ 2021 హైలైట్స్.. భారీ ఎత్తున వరాలు !

బడ్జెట్‌ 2021: టీడీపీ - వైసీపీల‌ను ఒక్క‌టి చేసిన కేంద్ర బ‌డ్జెట్ ?

బడ్జెట్ 2021 : ఆ వాహనాలపై ఉక్కుపాదం..త్వరలో కొత్త విధానాలు !!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>