HealthDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/afternoon-sleeping-good-bad-4e18c760-beda-4360-b1d0-156fb0b797a1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/afternoon-sleeping-good-bad-4e18c760-beda-4360-b1d0-156fb0b797a1-415x250-IndiaHerald.jpgమనలో చాలామందికి మధ్యాహ్నం భోజనం చేయగానే నిద్రొస్తుంది. అయితే పని కారణంగా నిద్ర మానుకొని, పని చేస్తుంటారు. మరికొంతమంది నిద్రపోవడానికి టీ, కాఫీలు తాగి నిద్రను దూరం చేసుకుంటారు. అంతేకాకుండా మధ్యాహ్నం నిద్ర ఆరోగ్యానికి మంచిది కాదనే అపోహతో చాలామంది నిద్ర వస్తున్నప్పటికీ, ఎంతో కష్టపడి నిద్రను ఆపుకుంటుంటారు. అయితే ఇది ఏమాత్రం నిజం కాదు అంటున్నారు వైద్య నిపుణులు. మధ్యాహ్నం నిద్ర ఆరోగ్యానికి ఎంతో మంచిదని వారు సూచిస్తున్నారు. అయితే ఏవిధంగా మధ్యాహ్నం నిద్ర ఆరోగ్యానికి మంచిదో ఇప్పుడు తెలుసుకుందాంafternoon,sleeping good,bad,;heart;shaktiమధ్యాహ్నం నిద్ర ఆరోగ్యానికి మంచిదేనా..?మధ్యాహ్నం నిద్ర ఆరోగ్యానికి మంచిదేనా..?afternoon,sleeping good,bad,;heart;shaktiMon, 01 Feb 2021 14:00:00 GMTమనలో చాలామందికి మధ్యాహ్నం భోజనం చేయగానే నిద్రొస్తుంది. అయితే పని కారణంగా  నిద్ర మానుకొని, పని చేస్తుంటారు. మరికొంతమంది నిద్రపోవడానికి టీ, కాఫీలు తాగి నిద్రను దూరం చేసుకుంటారు. అంతేకాకుండా మధ్యాహ్నం నిద్ర ఆరోగ్యానికి మంచిది కాదనే  అపోహతో చాలామంది నిద్ర వస్తున్నప్పటికీ, ఎంతో కష్టపడి నిద్రను ఆపుకుంటుంటారు.  అయితే ఇది ఏమాత్రం నిజం కాదు అంటున్నారు వైద్య నిపుణులు. మధ్యాహ్నం నిద్ర ఆరోగ్యానికి ఎంతో మంచిదని వారు సూచిస్తున్నారు. అయితే ఏవిధంగా మధ్యాహ్నం నిద్ర ఆరోగ్యానికి మంచిదో  ఇప్పుడు తెలుసుకుందాం..


రాత్రిపూట కనీసం ఏడెనిమిది గంటలు సుఖంగా నిద్ర పోవడం వల్ల అటు శారీరకంగా, ఇటు మానసికంగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇక అలాగే మధ్యాహ్నం కాసేపు నిద్ర కూడా మెదడు పనితీరును మెరుగుపరిచి,మరింత చురుగ్గా పని చేసే అవకాశం ఉందని తేల్చిచెప్పింది తాజాగా ఓ  అధ్యయనం. అయితే "జనరల్ సైకియాట్రీ" అనే జర్నల్ లో ప్రచురించిన ఈ అధ్యయనంలో భాగంగా 60 సంవత్సరాలు,ఇక ఆ పైబడిన వయసున్న 2,214 మందిపై పరిశోధనలు చేశారు. ఈ క్రమంలో మధ్యాహ్నం నిద్ర పోని వారికంటే నిద్రపోయే వారి మెదడు చురుగ్గా పని చేస్తున్నట్లు నిపుణులు తేల్చారు. అయితే మధ్యాహ్నం నిద్ర రెండు గంటల కంటే ఎక్కువ మించకూడదు అని కూడా వారు చెబుతున్నారు.


మధ్యాహ్నం పూట కాసేపు నిద్ర పోవడం వల్ల,మెదడు పనితీరు మెరుగు పడి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా పనిపై ఏకాగ్రతను పెంపొందించుకోవచ్చు. ఒత్తిడి మన రోగనిరోధక శక్తి పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇక దానిని దూరం చేసుకోవాలి అంటే మాత్రం  మధ్యాహ్నం నిద్ర పోవడం ఎంతగానో మంచిది.  తద్వారా రోగ నిరోధక శక్తి పెరిగి, ఆరోగ్యంగా ఉండవచ్చు. అంతేకాకుండా మధ్యాహ్నం నిద్ర పోయే వారిలో రక్తపోటు అదుపులో ఉంటుందని, తద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని ఒక అధ్యయనంలో తేలింది.

వయసు పైబడినవారు రోజంతా  ఉత్సాహాంగా ఉండాలన్నా,  రోజూ రాత్రి హాయిగా నిద్ర పోవాలి అన్నా  మధ్యాహ్నం నిద్ర అందుకు దోహదపడుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక రోజుకి  మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల లోపు అరగంట నిద్రపోవడం, సాయంత్రం నడక, చిన్నపాటి వ్యాయామాలు చేయడం వల్ల రాత్రిపూట నిద్రలేమితో బాధపడుతున్న వారు ఈ సమస్య నుంచి బయట పడవచ్చు.




బడ్జెట్‌ 2021: బ‌ంగారం ప్రియుల‌కు గుడ్ న్యూస్‌...

బడ్జెట్ 2021 : ఆ వాహనాలపై ఉక్కుపాదం..త్వరలో కొత్త విధానాలు !!

స్థానిక ఎన్నిక‌ల సాక్షిగా ప‌రిటాల సునీత‌కు షాక్‌... శ్రీరామ్ వ‌ల్లేగా ?

కేవీపీ బామ్మ‌ర్ది రివేంజ్ మామూలుగా ఉండ‌దా ?

జగడ్డ: నెల్లూరు జిల్లాలో అధికారుల బాధ్యతా రాహిత్యం..

జగడ్డ:నిమ్మగడ్డ సారూ...ఆ గ్రామంలో 2006 తరువాత స్థానిక ఎన్నికలు జరగలేదు...కారణం ఏమిటో?

కాపు వేద‌న‌: యేడాదికి రు. 2 వేల కోట్లు ఎక్క‌డ‌... జ‌గ‌న్‌కు కాపుల దెబ్బ త‌ప్ప‌దా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>