MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anchor-suma734e8e03-3623-41ab-bcaa-53126d547cc6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anchor-suma734e8e03-3623-41ab-bcaa-53126d547cc6-415x250-IndiaHerald.jpgకేరళ కుట్టి సుమ కనకాల ఎంతో కాలం నుంచి బుల్లితెర యాంకర్ గా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. నిజానికి ఆమె తన వాక్చాతుర్యం తో ఎందరో తెలుగు ప్రజలను ఆకట్టుకున్నారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా సుమ కి తాను అభిమానిని అని గర్వంగా చెప్పుకున్నారు.anchor suma;badshah;prema;srinivas;suma;suma kanakala;trivikram srinivas;kerala;cinema;media;love;heroine;nijamయాంకర్ సుమ హీరోయిన్ గా ఎన్ని సినిమాల్లో నటించిందో తెలుసా..?యాంకర్ సుమ హీరోయిన్ గా ఎన్ని సినిమాల్లో నటించిందో తెలుసా..?anchor suma;badshah;prema;srinivas;suma;suma kanakala;trivikram srinivas;kerala;cinema;media;love;heroine;nijamMon, 01 Feb 2021 11:21:37 GMTకేరళ కుట్టి సుమ కనకాల ఎంతో కాలం నుంచి బుల్లితెర యాంకర్ గా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. నిజానికి ఆమె తన వాక్చాతుర్యం తో ఎందరో తెలుగు ప్రజలను ఆకట్టుకున్నారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా సుమ కి తాను అభిమానిని అని గర్వంగా చెప్పుకున్నారు. బుల్లితెర మహారాణిలా దూసుకెళ్తున్న సుమ ని అందరూ కూడా తమ ఇంటి సభ్యురాలిగా భావిస్తుంటారు. అయితే యాంకర్ రంగంలో అడుగు పెట్టక ముందు సుమ సీరియళ్ళలో నటించారు. అయితే అప్పట్లో సుమ దిగిన ఓ ఫోటో షూట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. యుక్త వయసులో తాను దిగిన ఫోటోని సుమ తాజాగా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. అయితే ఈ ఫోటోలో సుమ చాలా అందంగా ఉందని.. అచ్చం హీరోయిన్ లాగానే ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

అప్పట్లో సుమకి ఎన్నో సినిమాల్లో అవకాశాలు విపరీతంగా వచ్చేవి. అయితే కేవలం హీరోయిన్ పాత్రలలో మాత్రమే నటించాలనే ఆలోచన ఆమెకు ఉండకపోయేది. అందుకే సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ నటించడానికి కూడా ఆమె అభ్యంతరం తెలపలేదు. బాద్షా, ఢీ, పవిత్ర ప్రేమ, చాలా బాగుంది వంటి సినిమాల్లో ఆమె నటించారు. ఆ తర్వాత ఆమె సీరియల్స్ వైపు అడుగులు వేశారు. 1996లో దాసరి తెరకెక్కించిన కళ్యాణ ప్రాప్తిరస్తు సినిమా లో హీరోయిన్ గా నటించి మెప్పించారు. ఆ తర్వాత మెల్లగా సీరియల్స్ వైపు.. తర్వాత యాంకరింగ్ రంగంలోకి ఆమె అడుగు పెట్టారు.

తెలుగు తన మాతృభాష కాకపోయినా.. తెలుగు నేర్చుకుని స్పష్టంగా మాట్లాడుతూ తనదైన స్టయిల్ లో యాంకరింగ్ చేస్తూ చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుంటున్నారు. 45 ఏళ్ల వయసులో కూడా యాంకరింగ్ రంగంలో నెంబర్వన్ గా నిలుస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. సుమ కంటే ముందు.. సుమ తర్వాత యాంకరింగ్ రంగంలో అడుగు పెట్టిన వారంతా కూడా కనుమరుగయ్యారు కానీ సుమ మాత్రం పవర్ ఫుల్ యాంకర్ గా ఇప్పటికీ కొనసాగుతున్నారు. ఏది ఏమైనా హీరోయిన్ల కంటే ఎక్కువ పాపులారిటీ దక్కించుకుంటున్న సుమ నిజంగా గ్రేట్ అని చెప్పుకోవచ్చు.


ఈ మూడు సినిమాలు ఒకే తేదీ..యాదృచ్చికమేనా ..!!

కాపు వేద‌న‌: ఉత్త‌రాంధ్ర‌లో టీడీపీ, వైసీపీ కుతంత్రాల‌కు బ‌లి ?

దర్శకులతో గొడవపడుతున్న హేమ !

జగడ్డ : కర్నూలులో రంగంలోకి దిగిన ఎమ్మెల్యే.. ఇక అక్కడ సీన్ రిపీటవుతుందా..?

వై.ఎస్. షర్మిలకు సవాల్ విసిరిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ..?

జగడ్డ : టీడీపీలో నంబర్ టూ టార్గెట్ గా వైసిపీ...?

టీచర్ల వెతలు: అయ్యో.. కూలీ పనులు చేసుకుంటున్న పంతుళ్లు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>